Weeding Equipments and Uses: విత్తనాలు నాటిన తర్వాత మొక్కలు మొలకెత్తిన పిదప చాళ్ల మధ్య గల నేలను వదులు చేయుటకు మరియు కలుపు మొక్కలను తొలగించుటకు ఉపయోగించు పరికరాలను కలుపు తీయు సాధనాలు అంటారు.
చేతితో పనిచేయు సాధనము: చేతితో పనిచేయు సాధనాలు పదునైన మొనలను కలిగిన ఇనుప కడ్డీల రూపములో నున్న పళ్ళను (teeth) కలిగి ఉంటుంది. ఇవి ఒక చక్రమునకు బిగించబడి ఉండి, చట్రము ఒకటి లేదా రెండు చక్రముల మీద అమర్చబడి ఉంటుంది. చేతితో ముందు నెట్టుకుంటూ సుమారు 4 నుండి 5 సెం. మీ. లోతు వరకు నేలను వదులు చేయవచ్చు. మరియు పళ్ల మధ్యగల దూరమును మార్చుకొనుటకు వీలుగలదు.
జపాను దంతె:
ఇది ముఖ్యముగా వరి చేలలో కలుపు తీయటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది ఒక చట్రము కలిగి ఉండి దాని అడుగు భాగమున వాడి మొనలు గల బ్లేడ్ లను కలిగి ఉంటుంది.
Also Read: Reasons for Land Area Decrease: భూమి విస్తీర్ణం తగ్గుదలకు కారణాలు.!
Wheel hoe: అన్ని రకముల మెట్ట పంటలలో చాళ్ల మధ్య కలువు నివారణ లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇనుప ఫ్రేమ్ కలిగియుండి అడుగు భాగమున చక్రము బిగించబడి ఉంటుంది. ఈ చక్రమునకు వెనుక భాగమున ఒక ముదిమొన వంటి బ్లేడు బిగించబడి, రెండు లేక మూడు మొనవంటి భాగములు అమర్చబడి ఉంటుంది. హాండిలును హాండిలు ప్రేముకు బిగించబడి ఉండి ముందుకు నెట్టుట ద్వారా కలుపు మొక్కలు నిర్మూలించబడు తుంది. నేల యొక్క స్వభావాన్ని బట్టి మరియు పంటను బట్టి వివిధ రకముల బ్లేడులను ఉపయోగి స్తారు.
Star Weeder: నక్షత్రముల ఆకారముగల పళ్ళ చక్రములను ఒక ఫ్రేమ్ నకు అడుగు భాగమున బిగించబడి ఉంటుంది. ఈ పళ్ళ చక్రాలు వెనుక భాగమున బ్లేడులు అమర్చబడును. పళ్ళ చక్రాలు మరియు హాండిలు ఒక ఫ్రేమ్ క్కు బిగించబడి ఉండి పొండిల్ను ముందుకు నెట్టుట ద్వారా కలుపు మొక్కలు సులభముగా నేలనుండి వేరు చేయబడతాయి. పళ్ళ చక్రములకున్న వాడి మొనలు వెనుక అమర్చబడిన బ్లేడు ద్వారా నేలను సులువుగా వదులు చేయవచ్చు. దీనితో రోజుకు అర హెక్టారు విస్తీర్ణము వరకు పని చేయవచ్చు.
పశువులతో లాగబడు గొర్రులు (Animal drawn seed drill):
ఈ పరికరము యందు ఒక చట్రము కలిగి ఉండి దానికి వంపు తిరిగిన కడ్డీలను కలిగి ఉంటాయి. దాదాపు 5 నుండి 7 వరకు వంపు తిరిగిన కడ్డీలను కలిగి ఉంటుంది. ఈ కడ్డీలకు లేక ట్రైనులకు చివరల వివిధ రకముల సేద్యపు పని ముట్లను అమర్చుకొనవచ్చు. ఈ ట్రైనుల మధ్య దూరము 40 సెం.మీ నుండి 100 సెం. మీ దాకా మార్చుకొను వీలు కలదు.
సాధారణముగా వంపు తిరిగిన కడ్డీలు (టైనులు) ఒక ఇనుప చక్రమునకు అమర్చబడి ఉంటాయి. పశువులతో లాగుటకు వీలుగా ఒక దూలము ఈ చక్రమునకు బిగించబడి ఉంటుంది. ఈ పరికరము పొలంలో సక్రమముగా నడుపుటకు హాండిలు బిగించబడి ఉంటుంది.సాధారణంగా నాగలి దూలము తప్ప మిగిలిన భాగములన్నీ ఉక్కుతో చేయబడి ఉంటాయి.
Also Read: Lemongrass Cultivation: నిమ్మగడ్డి సాగులో మెళుకువలు.!