Water Management in Castor: మన పూర్వికుల ఆరోగ్య రహస్యం ఆముదం అనే సంగతి ఈ జనరేషన్ కు తెలియదు. మన దేశంలో క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరం నుంచి ఆముదం వాడుకలో ఉందంటే ఆశ్చర్యపోతారు. ఆముదం గింజల నుంచి ఆముదం నూనెను తయారు చేస్తారు. ఆముదం నూనె జుట్టు లోతుల్ని బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మరియు పొడి స్కాల్ప్‌ను హైడ్రేట్ చేయడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నూనె జుట్టును పెంచలేనప్పటికీ, తలపై ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంచుతుంది.ఆముదం యొక్క యాంటీఆక్సిడెంట్లు సహజ కెరాటిన్‌ను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, జుట్టును బలంగా మరియు మృదువుగా చేస్తుంది. ఇందులోని విటమిన్ E కంటెంట్ విరిగిన చివరలను పునరుద్ధరిస్తుంది.
రాష్ట్రంలో వర్షాధారంగా సాగు చేసే నూనెగింజల పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట. మన రాష్ట్రంలో సుమారు 80-85 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ హెక్టారుకు 633 కిలోల దిగుబడి నమోదవుతున్నది. ఈ పంట వర్షాకాలంలో మహబూబ్నగర్ మరియు నల్గొండ జిల్లాల్లో విస్తారం గానూ, రంగారెడ్డి, మెదక్ మరియు కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ విస్తీర్ణంలో సాగవుతున్నప్పటికీ, అన్ని లేకుండా కురిసే వర్షా జిల్లాల్లోను ప్రత్యేకించి యాసంగిలో తక్కువ సాగు ఖర్చుతో ఈ రెండు సందర్భాలు ఈ పంటను ఆరుతడి పంటగా పండించడానికి చాలా అవకాశముంది.
Also Read: Green Gram Cultivation: పెసర పంటలో పొగాకు లద్దె పురుగు యాజమాన్యం
విత్తే సమయం: ఖరీఫ్లో జూన్ రెండవ పక్షం నుండి జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. నీటి పారుదల సౌకర్యం అధిక ఆదాయం వస్తుం ఉన్న ప్రాంతాల్లో అముదంను యాసంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు.
నేలలు: బాగా ఇంకె నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. ఈ పంటను ఎర్రనేలలు, నల్ల రేగడి నేలలు, గరప నేలల్లో సాగు చేయవచ్చు. చవుడు నేలలు మరియు నీరు నిలువ ఉండే నేలల్లో పంటను పండించరాదు.
నీటి యాజమాన్యం: సాధారణంగా ఆముదం వర్షాధారంగా పండిస్తారు. బెట్ట పరిస్థితుల్లో నీటి వసతి ఉంటే 1-2 తడులను ఇస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. యాసంగిలో ఆముదంను విత్తిన తర్వాత నేల తడపాలి. అక్టోబరు నుండి డిసెంబరు వరకు తక్కువ ఉష్ణోగ్రతల వలన 10-15 రోజులకొకసారి తడి ఇవ్వాలి. జనవరి నెల నుండి 8-12 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. మొక్కలు పుష్పించే దశ మరియు కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా నీరు ఇవ్వాలి.
బిందు సేద్య పద్దతిలో ఆముదంను పండించినప్పుడు అక్టోబరు నుండి డిసెంబరు వరకు ప్రతి 3 నుండి 5 రోజులకు 1% -2 గంటలు మరియు జనవరి నుండి మార్చి వరకు 2-3 గంటలు నీరు ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఆముదంను సాగు చేసినప్పుడు 20-25% వరకు నీరు ఆదా అవుతుంది.
Also Read: Green Gram Cultivation: ఖరీఫ్ వరి మాగాణులలో రబీ పెసర విత్తుకున్నప్పుడు కలుపు నివారణ చర్యలు