మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

కొబ్బరి పీచుతో ఇంట్లోనే కూరగాయలు పండించండిలా!

0
/training-production-fermented-cocopeat-and-soilless-cultivation-vegetables

ఇటీవల కాలంలో ప్రకృతిపై జనాలకు ప్రేమ పొంగిపొర్లిపోతోంది. బహుశా ఆక్సిజన్ స్థాయి పడిపోయి.. ప్రాణాలు గాల్లో ఆయువుల్లా కలిసిపోతుంటే.. ఇప్పుడిప్పుడే అందరికీ ప్రకృతి గొప్పతనమేంటో తెలుస్తున్నట్లుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే చెట్లు, కూరగాయలు సాగు చేసుకోవడం మొదలుపెడుతున్నారు. నగరాల్లోనూ వీటిపై ఆవశ్యకత పెగుతోంది.  అయితే, సిటీల్లో ఎక్కువగా వీటని పండించేందుకు నేల అందుబాటులో దొరకదు.. అలాంటప్పుడు ఇష్టమైన మొక్కలను, కూరయాలను ఎలా పెంచుకోవాలో తెలుసా?.. ఇక్కడ చూద్దాం రండి..

/training-production-fermented-cocopeat-and-soilless-cultivation-vegetables

సిటీల్లో మనకు మట్టి దొరకని నేపథ్యంలో.. వాటి స్థానంలో కొబ్బరి పొట్టుతోనే నారు మొక్కలు, కూరగాయలు పండించొచ్చు. శుద్ది చేసిన కొబ్బరి పొట్టును ఆర్క మైక్రోబియల్‌ కన్సార్షియం అనే ద్రావణంతో కుల్లబెడితే.. మంచి పోషకాలు కలిగిన సేంద్రీయ కొబ్బరిపొట్టు రెడీ అవుతుంది.

ఈ విధానంతో ఎలా పంటలు పండించుకోవాలనే అంశంపై శిక్షణా తరగుతులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పొట్టును ఎలా చేసుకోవాలి.. మట్టిని ఉపయోగించకుండా.. కుండీల్లో నారు మొక్కలు, కూరయాలను ఎలా సాగుచేసుకోవాలో ఐఐహెచ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు క్షుణ్నంగా వివరించి శిక్షణ ఇస్తారు. వీటితో పాటు పంట సాగులో తెగుళ్లకు సంబంధించిన సమస్యలను ఎలా నివారించాలనే అంశాలపైనా చెప్తారు. రసాయన రహిత పద్దతుల్లో పంటను నాశనం చేసే చీడపురుగులను ఎలా అంతమొందించాలనే విషయాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

కరోనా కాలంలో ఆక్సిజన్​ విలువేంటో అందరికీ కల్లారా తెలిసొచ్చింది. ఎన్ని డబ్బులున్నా.. సమయానికి ఆక్సిజన్​ అందక.. ప్రాణాలు కోల్పోయినవారు ఎంతో మంది ఉన్నారు. మరోవైపు ఆహారం విషయంలోనూ అనేక రసాయనాలు చేరి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇటువంటి వనూత్న పద్దతుల్లో ఇంట్లోనే మనకు కావాల్సిన వాటిని పండించుకోవడం ఎంతో శ్రేయష్కరం.

Leave Your Comments

లిప్​స్టిక్​ను ఈ గింజలతోనే తయారు చేస్తారు తెలుసా?

Previous article

ఆంధ్రా అరటికి విదేశాల్లో పెరుగుతోన్న డిమాండ్​…

Next article

You may also like