తెలంగాణాలో యాసంగి వరి సాగుకోసం నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించే జాగ్రత్తలు తీసుకోవాలి. నారు ఎదుగుదలకు పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్ళు కప్పి ఉంచి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతి రోజు ఉదయం నారుమడి నుంచి నీటిని తీసివేసి, వెంటనే కొత్త నీరు పెట్టాలి. ఎకరా పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియాను పైపాటుగా నారుపోసిన 10-15 రోజుల్లో చల్లుకోవాలి.
Leave Your Comments