నేలల పరిరక్షణ

Role of Fertilizers in Agriculture: నేల జీవం పెంచే జీవన ఎరువుల వాడకం – వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత

2
Role of Fertilizers in Agriculture
Importance Fertilizers in Agriculture

Role of Fertilizers in Agriculture: అధిక మోతదులో రసాయనిక ఎరువుల వాడకం వలన నేల భౌతిక స్థితులు దెబ్బతిని నేల సారం తగ్గిపోతుంది. అంతే కాదు రైతుకు పెట్టుబడి కూడా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే రైతులు తప్పని సరిగా సేంద్రీయ ఎరువులు వాడాలి. సేంద్రీయ ఎరువులలో జీవన ఎరువులు కూడా ఒకటి. జీవన ఎరువులను వాడటం వలన నేలలో జీవరాశులు పెంపొందించడంతో పాటు నేలకు సారం పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. జీవన ఎరువులలో నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరాన్ని అందించేవి ఉన్నాయి.ఈ ఎరువులు పొడి రూపంలోనె కాక ద్రవ రూపంలోను అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ జీవన ఎరువులు ఎందుకు వాడుకోవాలి, ఏలా వాడుకోవాలి, వాడకం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో రైతులు రసాయనిక ఎరువుల అధికంగా వాడటం వలన నేలలో రకరకాల మార్పులు వచ్చి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. అదే విధంగా రైతులకు పెట్టుబడి కూడా పెరుగుతుంది. జీవన ఎరువులు వాడకం వలన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు .

నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు
రైజోబియం :
ఈ రైజోబియం జీవన ఎరువును అపరాల పంటలలో ఎక్కువగా వాడతారు. ప్రధానంగా పెసర, మినుము, కంది ,సోయచిక్కుడు, వేరుశెనగ పంటలలో ఎక్కువగా వాడతారు.
వాడే విధానం:
100 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం వేసి కలిపి మరిగించి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలా చేయాలి. ఈ ప్రక్రియ రైతులు పాలిథిన్ సంచిని గాని, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటుకోవాలి.

అజటోబాక్టర్ :
పప్పు జాతి పంటలకు తప్ప మిగతా అన్ని పంటలలో నత్రజని జీవన ఎరువుగా వాడతారు. చెఱకు, ప్రొద్దు తిరుగుడు, జొన్న, మొక్క జొన్న, ప్రత్తి, మిరప పంటలలో వాడతారు.
వాడే విధానం:
ఏ పంటకు వాడినా గాని 2 కిలోల కల్చర్ ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వేదజల్లవలేను.

అజోస్పైరిల్లుం :
మొక్క వ్రేళ్ళ చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వ్రేళ్ళలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. వరి, చెఱకు, ప్రొద్దు తిరుగుడు, జొన్న, మొక్క జొన్న, సజ్జ, ప్రత్తి, మిరప, అరటి పంటలలో వాడతారు.
వాడే విధానం:
2 కిలోల కల్చర్ ను 80-100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం క్రింద పడేటట్లు వేసుకోవాలి. వరి లాంటి పంటలకు నారు నటేటప్పుడు, నారు వ్రేళ్ళను ఈ జీవన ఎరువు ద్రావణం లో ముంచి నాటుకోవాలి. అలాగే చెఱకు కూడా ముచ్చెలను నాటే ముందు ఈ జీవన ఎరువు ద్రావణం లో ముంచి నాటుకోవాలి.

నీలి ఆకుపచ్చ నాచు:
ఇది వరి కి మాత్రమే ఉపయోగపడే నత్రజని జీవన ఎరువు. ఒక చిన్న ప్లాస్టిక్ తొట్టెలలో గాని, చిన్న మడులలో గాని పెంచుకొని వృద్ధి చేసుకోవాలి.
వాడే విధానం:
ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన తరువాత అంటే 3-7 రోజుల వ్యవధిలో 4-6 కేజీల ఈ జీవన ఎరువు 40-60 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఒక 15-20 రోజులలో పొలమంతా వ్యాపించి పెరుగుతుంది. ఆ తర్వాత పొలంలో నుంచి నీళ్ళను తీసినట్లైతే భూమికి అనుకొని కుళ్ళి నత్రజిని ని అందిస్తది.

Also Read: Dates Health Secrets: ఒంటికి రక్తాన్ని ఇచ్చే ఐరన్ పండు – ఖర్జూరం ఆరోగ్య రహస్యాలు

Role of Fertilizers in Agriculture

Role of Fertilizers in Agriculture

అజోల్లా – అనబినా:
ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క.నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందిస్తుంది. నత్రజని తో పాటు సేంద్రియ కర్బనం మరియు పొటాషియం అందిస్తుంది.
వాడే విధానం :
వరి నాటిన వారం తరువాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.ఆ తర్వాత పొలంలో నుంచి నీళ్ళను తీసినట్లైతే భూమికి అనుకొని కుళ్ళి నత్రజని తో పాటు సేంద్రియ కర్బనం మరియు పొటాషియం అందిస్తుంది.

అసిటో బాక్టర్ :
ఇది చెఱకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడును.
వాడే విధానం :
ఒక ఎకరం చెఱకు పంటకు 4 కిలోల జీవన ఎరువును 2 దఫాలుగా వాడాలి. ముచ్చెలు నాటేటప్పుడు 2.0 కిలోలు మరియు మోకాలు లోతు పంట అయిన తరువాత 2.0 కిలోలు ,200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి వాడవలెను.

భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు :
ఫాస్ఫో బ్యాక్టీరియా : ఈ జీవన ఎరువు నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఈ జీవన ఎరువు అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం,భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి, వివిధ రకములైన లభ్యం కాని భాస్వరపు రూపంలోనికి మారిపోవును. ఇలాంటి పరిస్థితులలో భాస్వరంనకు సంబంధించిన జీవన ఎరువులు వేసినచో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరం ను మొక్కలకు లభ్యమయ్యే స్థితికి తెచ్చును.

భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు 3 రకాలు:
1) ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బాక్టీరియా ( ఫాస్ఫో బాక్టీరియా)
2) ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఫంగై ( ఫాస్ఫో ఫంగై)
3) ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా ( వేమ్ ):

ఫాస్ఫో బాక్టీరియా:
ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాసిల్లస్ మెగథీరియంతో గాని, సుడామోనాస్ ను గాని ఉపయోగించి తయారు చేయబడును . ఈ జీవన ఎరువును అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు.
వాడే విధానం :
ఎకరాకు 2 కిలోల ఫాస్ఫో బాక్టర్ ను ,200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో గాని, మొక్క నాటేతప్పుడు గాని సాళ్ళలో పడేటట్లు వేసుకొనవలేను. వరిలో నాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో వేసుకొనవలెను. ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు పొలంలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి.

ఫాస్ఫో ఫంగై:ఈ జీవన ఎరువు ఆస్పర్జిల్లస్ అవమోరి లేదా పెనిసీలియం డిజిటోటంను ఉపయోగించి తయారు చేయబడును . ఈ జీవన ఎరువును అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు.
వాడే విధానం :
2 కిలోల ఫాస్ఫో ఫంగై ను ,200 కిలోల సేంద్రియ ఎరువుతో ఒక ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్ళలో పడేటట్లు వేసుకొనవలేను.

ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా ( వేమ్ ):
ఇది శీలీంధ్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వ్రేళ్ళు చొరలేని భూమి అడుగు పొరలలోనికి చొచ్చుకొనిపోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలు వంటి వాటిని నీటి తో సహా అందిస్తుంది.
వాడే విధానం :
5 కిలోలు ఒక ఎకరం భూమికి వేయవలసి ఉంటుంది. తప్పని సరిగా విత్తనం / మొక్క క్రింద మాత్రమే పడేటట్లు ఈ జీవన ఎరువును వాడవలెను.

పొటాషియం మొబిలైజెర్స్:
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఇవి ఇటీవలి కాలంలో పరిగణలోకి వచ్చాయి.వీటిలో ముఖ్యంగా ఫ్రటూరియా అరాన్షియ అనే బాక్టీరియా పొటాషియం మొబిలైజెర్స్ గా ఇవ్వబడుచున్నది. దీనితో పాటు కొన్ని బాసిల్లస్ జాతులు కలిపి మిశ్రమంగా తాయారు చేయుచున్నారు.
వాడే విధానం : 2 కిలోల జీవన ఎరువును ,200 కిలోల సేంద్రియ ఎరువుతో ఒక ఎకరం భూమిపై వెదజల్లవలేను.

Also Read: Reducing Dairy Production Costs: పాడి పరిశ్రమలో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి.!

Leave Your Comments

Dates Health Secrets: ఒంటికి రక్తాన్ని ఇచ్చే ఐరన్ పండు – ఖర్జూరం ఆరోగ్య రహస్యాలు

Previous article

Pregnancy Tests in Cattle: పాడి పశువుల చూడి నిర్ధారణ

Next article

You may also like