Reclamation of Saline Soils: అధిక ఎరువుల వాడకం, వారి వంటి పంటల ఏక పంట సాగు విధానం, పునరుద్ధరణ పాటించకపోవడం వంటి పద్ధతుల వలన నేలలు రోజు రోజుకి ఉప్పులుగా మారడం జరుగుతుంది. ఇలాంటి నెలలు పంట సాగుకి అంత అనుకూలంగా ఉండవు. సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాక నష్టాల పాలు కావడమే జరుగుతుంది. రైతులు గమనించి మంచి నేల యాజామాన్య పద్ధుతులు పాటించి నేల సారం క్షీణించకుండా జాగ్రత్తలు చేపట్టవచ్చు. మంచి నేల యాజమాన్యం అధిక దిగుబడులపై కారణం అని గుర్తుపెట్టుకోవాలి.
తెల్ల చౌడు నేలలు: చౌడు నేలలను రసాయనాలతోను, సవరణ పదార్థాలతోను , కండీశ్నర్ల తోను లేదా ఎరువుల ద్వారా అధిగమించలేము. కేవలం వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న లవణాలను తొలగించడం ద్వారానే నేలను మునపటిలాగా తిరిగి పొందవచ్చు. దీని కోసం నెలలో గల ఉప్పును-తట్టుకోగల పంటలను ఎంచుకోవాలి. చౌడు నేలలను నిర్వహించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
Also Read: Water Management in Tobacco: పొగాకు పంటలో సాగునీటి యాజమాన్యం
ఒకటి నీటి నిలువ పద్ధతి:
మొదట భూమిని దున్ని,ఆ తర్వాత దానిని చిన్న మడులుగా తయారు చేసుకోవాలి. ఆ మడులలో స్వచ్ఛమైన నీరు/వర్షపు నీటిని (అనగా ఎలాంటి లవణాలు,ఉప్పు లేని నీరు)తో నింపాలి. ఈ నీటిని మడులలో ఐదు రోజుల పాటు అలానే నిల్వ ఉంచాలి. అప్పుడు నీరు మట్టిలోకి లోతుగా వెళ్తుంది మరియు వేరు వ్యవస్థలో ఉండే లవణాలు కూడా నీటితో పాటు లోతుగా భూమిలోకి వెళ్తాయి. నేల ఉపరితలంపై మిగిలిన నీటిని కాల్వ ద్వారా బయటకు పోనివ్వాలి. ఇది కూడా కొన్ని లవణాలను వెంట తీసుకెళ్తుంది.దీనికి దాదాపు 25 రోజుల సమయం పడుతుంది. ఇలా నాలుగు నుంచి ఐదు సార్లు చేసుకున్నట్లైతే ఆశించిన ఫలితాలు వస్తాయి కానీ ఇది దీర్ఘకాల ప్రక్రియ.
రెండవ పద్ధతి పిలిపిసెర , జిలుగ మొదలైన పచ్చి రోట్ట పంటల సాగు, ఈ పంటల సాగు చేయుట వలన నేలలో గల అసేంద్రియ లవణాలను సేంద్రియం చేయుట జరుగును, నేలలో లవణాలను మొక్కలు సంగ్రహించి వాటి శరీర నిర్మాణం లో కొంత ఉపయోగించుకుంటాయి అలాగే మిగతావి ఇవి కలియదున్నినపుడు రసాయన చర్యల ద్వారా మట్టిలో హానికరం కానీ స్థాయికి చేరుకుంటాయి. ఈ పచ్చి రోట్ట పంటను వేసవిలో సాగు చేసి పూత దశలో ఉన్నప్పుడు మట్టితో కలిపి భూమిని దున్నుకోవాలి.ఇవే కాకుండా పొలంలో కంపోస్టు ను వేయాలి. యూరియా ,సూపర్ ను ను పిచికారీ చేయాలి. ఒకవేల పై పొరపై చౌడు ఉన్నట్లయితే పారను ఉపయోగించి దాన్ని తొలగించుకోవాలి.దీనినే స్క్రాపింగ్ అంటారు.
Also Read: Reducing Soil Fertility: నేల సారం తగ్గడానికి గల కారణాలు