నేలల పరిరక్షణ

Problematic Soils: సమస్యాత్మక భూముల యాజమాన్యం ఎలా చేపట్టాలి.!

0
Problematic Soils in India
Problematic Soils in India

Problematic Soils: వివిధ భూ సమస్యలు సుస్థిర అధికోత్పత్తిని సాధించకుండా ఆటంకపరుస్తున్నాయి. ఈ క్రింద సూచించిన యాజమాన్య పద్ధతులు ద్వారా వీటిని అధిగమించి సుస్థిరమైన అధిక దిగుబడులను సాధించవచ్చు.

లోతు తక్కువ నేలలు: నేల లోతు తక్కువగా వుండటం (30 సెం.మీ. కన్న తక్కువ) వలన వేరు పెరుగుదల తగ్గడమే కాక నీరు మరియు భూసార పరిమితంగా ఉండటంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచటానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు నాగళ్ళతో or “బండ్ఫార్మర్ ” లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. ఒక metre దూరంలో లోతుగా మూడు సంవత్సరాల కొకసారి దున్నాలి. వీటితో బాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియపు ఎరువును వేసి దిగుబడిని పెంచవచ్చు.

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు: వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కన్న తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో దిగుబడిని పెంచటానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలాలి. చెరువు మట్టిలోని పెద్ద పెళ్ళలను పగలగొట్టి చేను మొత్తంపై పలుచగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుక నేలల్లో చెరువు మట్టిని తోలిన తరువాత 200 కిలోల బరువు గల రోలర్ను 5-6 సార్లు నడిపించాలి. చెరువు మట్టి వేయటం వలన భూమిలో బంక మన్ను శాతం పెరుగుతుంది. భూమికి నీటిని పోషక పదార్థాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాళ్ళ చొప్పున వర్షాకాలానికి ఒక నెల ముందుగానే చేను పై పలచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. పై వ్యర్ధ పదార్ధాలను చేనులో తోలిన తర్వాత అలాగే గాలికి వదిలి వేయకుండ వెంటనే చేనులో కలియదున్నడం చాలా ముఖ్యం. పశువుల ఎరువులను కూడా దీనికై వాడవచ్చు.

Also Read: Weed Impact on Crops: పంట పెరుగుదల, దిగుబడుల పై కలుపు మొక్కల ప్రభావం ఎలా ఉంటుంది.!

Problematic Soils in India

Problematic Soils 

అడుగు మట్టిలో గట్టి పొర: ఈ సమస్యను తేలికగా గుర్తించవచ్చు. ఒక మీటరు వెడల్పు, పొడవు, లోతు గల గొయ్యిని త్రవ్వి చూస్తే భూమి లోపల గట్టిపొర కనపడుతుంది. గట్టి పొరకు పైన, క్రింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గ్రుచ్చి ఈ గట్టి పొరను నిర్ధారించుకోవచ్చు. గట్టిపొర ఉన్నచోట చాకుకు గట్టిగా తగులుతుంది. సమస్య నిజామాబాద్ జిల్లాలోని చెరకు పండించే రేగడి భూముల్లో ఎక్కువగా ఉంది. పెద్ద ట్రాక్టరుతో లోతుగా దున్నే నాగళ్ళతో or సబ్ సాయిలర్ or చిసెల్ నాగళ్ళతో దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ లోతు సాళ్ళను 60 సెంటీ మీటర్ల దూరంలో రెండు వైపులా తోలాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు or 2 టన్నుల జిప్సం కూడా వేస్తే 10 – 12 శాతం వరకు అధికంగా చెఱకు దిగుబడిని పెంచవచ్చు. లోతు దుక్కి ప్రభావం మూడు సంవత్సరాల వరకు ఉంటుంది.

మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్య: మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్య. వరి తరువాత ఆరుతడి పంటలు వెయ్యటానికి భూమిని దున్నగానే పెళ్ళలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పైరు (విత్తిన గింజలు) సరిగా మొలకెత్తదు. మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్ళతో దున్నిన తరువాత ట్రాక్టరుతో నడిచే తిరుగు దంతె (రోటవేటర్) లేదా పళ్ళ దంతెతో తేలికగా దున్నితే పెద్ద పెళ్ళలు పగిలి ఆరుతడి పంటలకు అనువైన దుక్కి వస్తుంది. దీని వల్ల వేరుశనగలో అధిక దిగుబడి సాధించవచ్చు. వరికోసిన తరువాత వేసే ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్ధతితో దుక్కిచేయడం ఎంతో శ్రేయస్కరం.

Also Read: Natural Enemies for Pest Control: పంటలపై పురుగులను నివారించే సహజ శత్రువుల గురించి మీకు తెలుసా.!

Leave Your Comments

Weed Impact on Crops: పంట పెరుగుదల, దిగుబడుల పై కలుపు మొక్కల ప్రభావం ఎలా ఉంటుంది.!

Previous article

TS Agri Minister Niranjan Reddy: నిర్మలమ్మా ఎరువుల ధరలు పెంచింది మీరు కాదా – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like