నేలల పరిరక్షణ

Nitrogen Fixing Biofertilizers: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులతో ఎన్నో లాభాలు.!

2
Nitrogen Fixing Biofertilizers
Nitrogen Fixing Biofertilizers

Nitrogen Fixing Biofertilizers: నత్రజని వాయు రూపంలో 78 శాతం వరకు ఉంటుంది. దీనిని కొన్ని రకాలైన సూక్ష్మ జీవులు మాత్రమే -మొక్కలకు ఉపయోగపడే రూపంలోనికి మార్చగలవు. నత్రజని స్థిరీకరణ జీవ సంబంధ రసాయనిక క్రియ, ఈ ప్రక్రియలో వాయు రూపంలో ఉన్న నత్రజని సూక్ష్మజీవులతో ఉన్న ‘నైట్రోజినేజ్” అనే ఎంజైమ్ ద్వారా మార్పిడి చెంది అమ్మోనియా మొక్కలకు ఉపయోగపడుతుంది.

రైజోబియం: లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాలు (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడాలి. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ సోయాచిక్కుడు వంటి నూనె గింజలు పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి. దీనిని ఉ పయోగించుట వలన మొక్క వ్రేళ్ళపై లేత గులాబి రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్థాయి. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ప్రత్యేకమైన స్ప్రెన్ కలిగి ఉంటుంది. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్దేశించబడిన రైజోబియం మాత్రమే వాడాలి.

Also Read: Ground Water Resources Assesment: అత్యధికంగా భూగర్భజలాలు పెరిగిన జిల్లా వనపర్తి ఒక్కటే -మంత్రి నిరంజన్ రెడ్డి

Nitrogen Fixing Biofertilizers

Nitrogen Fixing Biofertilizers

ఉపయోగించు విధానం: ఒక ఎకరానికి 200 గ్రా. కల్చర్ సరిపోతుంది. దీని వల్ల 25-30 శాతం నత్రజని ఎరువుల వాడకం తగ్గించవచ్చు. 100 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రా.ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కి.ల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియను రైతులు పాలిథీన్ సంచినిగాని, ప్లాస్టిక్ తొట్టినిగాని ఉపయోగించి చేసుకొనవచ్చు. పట్టించిన విత్తనమును 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటాలి .

అజటోబాక్టర్: పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నజ్రతనిని స్థిరీకరించుటయే కాక మొక్కకు కావల్సిన హార్మోన్లను మరియు విటమిన్లను అందిస్తుంది. ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. అందువలన ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడిన గాని 2 కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి . ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే కాని భూమిలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకొవాలి.

Also Read: Palle Nidra: వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి – మంత్రి నిరంజన్ రెడ్డి.!

Nitrogen Biofertilizers

Nitrogen Biofertilizers

అజోస్పైరిల్లమ్: ఈ మధ్య కాలములో దీని ప్రాముఖ్యత అధికముగా గుర్తించడం జరిగింది. ఈ బాక్టీరియా మొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ ఆవకాశమున్న చోట వ్రేళ్ళలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే జిబ్బరిల్లిక్ ఆమ్లాన్ని ఆక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకొనవచ్చు. ఇది వరి, చెఱకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్ధం తక్కువగా ఉన్న నేలలో కూడా ఇది పనిచేస్తుంది.

ఉపయోగించు విధానం: తక్కువ కాలం పంటలకు 2 కిలో అజోస్పైరిల్లమ్ కల్చర్ను 80-100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనము క్రింద పడేటట్లు వేసుకొవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్ల పట్టే చిన్న మడిని తయారు చేసుకొవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వ్రేళ్ళను మాత్రమే ముంచి వెంటనే నాటుకొవాలి. చెఱకు పంట విషయంలో నాటే విత్తనపు చెఱకు ముచ్చెలను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి.

నీలి ఆకుపచ్చనాచు (సైనోబాక్టీరియా): ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, ఎనాబినా, కెలోట్రిక్స్ మొదలగు సైనో బాక్టీరియాల సముదాయము ఉంటుంది. రైతులు వరి పంట కాలమునకు ముందుగా చిన్ని చిన్న మడులలోగాని, తొట్టెలలోగాని పెంచుకొని వరినాట్లు వేసిన తరువాత దీనిని వాడుకొనవచ్చు. ఈ జీవన ఎరువును 3-4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తరువాత నుండి వేయనవసరం లేదు.

వాడే విధానం: ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల ఈ జీవన ఎరువును 40-50 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15-20 రోజులలో ఈ నాచు, మందముగా, దాపలా అల్లుకుపోయిన తరువాత నీరు తీసివేసి నేలను తాకిన నామును మట్టిలో కలిసేటట్లు చెయ్యాలి. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని మొక్కకు అందుటయేగాక ఈ నాచు సేంద్రీయ పదార్ధంగా కూడా మొక్కకు ఉపయోగపడుతుంది.

Also Read: Tomato Integrated Plant Protection: టమాటలో సమగ్ర సస్యరక్షణ.!

Leave Your Comments

Ground Water Resources Assesment: అత్యధికంగా భూగర్భజలాలు పెరిగిన జిల్లా వనపర్తి ఒక్కటే -మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

Optimum Plant Population: మొక్కల సాంద్రతను దోహదం చేసే అంశాలు.!

Next article

You may also like