Plastic Mulching: వ్యవసాయంలో ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం చాలా పెరిగి పోతుంది. మల్చింగ్ షీట్స్, ఫార్మ్ పౌండ్ లైనింగ్, డ్రిప్ లాటరల్స్, పివిసి పైపులు, గ్రీన్ హౌసెస్, ఇలా చాలా వాటిలో ప్లాస్టిక్ వాడుతున్నాము. అని వాటిలో మల్చింగ్ షీట్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ మల్చింగ్ షీట్స్ ఒక పంట పూర్తి అవ్వగానే చిరిగిపోతాయి. ఈ మల్చింగ్ షీట్స్ కలుపు నివారణకు, రసాయానికి ఎరువులు వాడుకని తగ్గిస్తుంది. మట్టి నుంచి నీటిని ఆవిరి కాకుండా ఉంచుతుంది.
ఈ ప్లాస్టిక్ వాడకం వ్యవసాయంలోనే కాకుండా ఆక్వాకల్చర్లో కూడా ఎక్కువగానే ఉంది. ఆహారం పండించే దగ్గరి నుంచి ఆహారాన్ని ప్రజలు తిన్నాడనికి వెళ్లే వరకు ప్రతి చోట ప్లాస్టిక్ వాడుతున్నాము. వ్యవసాయంలో మాత్రమే కోట్ల 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నాము. ఇందులో కేవలం మల్చింగ్లోనే 25 లక్షల టన్నుల ప్లాస్టిక్, ఆక్వా కల్చర్ ద్వారా 21 లక్షల టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నాము. మనము ఇలాగే ప్లాస్టిక్ వడుతూపోతే వచ్చే 5 సంవత్సరాలలో 50% వాడకం పెరుగుతుంది.
రైతులు పంట పండించక పొలంలో మిగిలిన ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ భూమిలో కలిసి, భూమిలో ఉండే సూక్ష్మజీవులని నాశనం చేస్తుంది. సూక్ష్మజీవులు నాశనం అవుతే మట్టిలో సారం తగ్గిపోతుంది. ఇంకా భూమిలో కలిసి పోయిన ప్లాస్టిక్ ఆహారంలో లేదా మట్టి నుంచి నీళ్లలోకి కలిసిపోయి మనుషుల ఆరోగ్యానికి హాని చేస్తాయి.
Also Read: Moringa Seeds: మునగ విత్తనాల సాగులో మంచి లాభాలు..

Plastic Mulching
రైతులు మిగితా మల్చింగ్ షీట్స్ని కాల్చి వేస్తారు. దాని వల్ల గాలిలో ఇంకా హాని కారకమైన రసాయనాలు విడుదల అవుతాయి. ఈ మల్చింగ్ షీట్స్ని మళ్ళి వాడుకునేల లేవు. వీటిని రిసైకిల్ చేసే పద్ధతులు కూడా లేవు. మిగిలిన మల్చింగ్ షీట్స్ రైతులు చెత్త కుప్పలో వేసిన వాటిని కూడా నిప్పు పెట్టి తగలపెడ్తారు.
పంట పండించడం పూర్తి అయ్యాక మల్చింగ్ షీట్స్ చీలికలని తీసుకోవడం పెద్ద తలనొపిగా మారింది రైతులకి. ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు డ్రిప్ లాటరల్స్, డ్రిప్పర్స్, మళ్ళి వీటిని తిరిగి ఈ వస్తువులని ఉత్పత్తి చేసే వీలుగా లేవు. వీటిని ఒకే సారి వాడేలా ఉన్నాయి. ఈ వస్తువులు భూమిలో కలిసి నెల నాణ్యతతో పాటు మట్టిలో ఉండే జీవరాశులని పాడు చేస్తున్నాయి.
ఒక కిలో ప్లాస్టిక్ పొలంలో వాడడం వల్ల దాదాపు 700 చెదరపు అడుగుల దూరం భూమిని కాలుష్యంగా మారుస్తుంది. రైతులు ఈ ప్లాస్టిక్ మల్చింగ్ పొలంలో వాడకుండా ప్రకృతి సిద్ధమైన మల్చింగ్ పద్ధతులు కూడా రైతులు వాడుకోవచ్చు. గడ్డి, కొబ్బరి పీచు కూడా మల్చింగ్ షీట్స్ల వాడుకోవచ్చు. కాకపోతే ఈ ఆర్గానిక్ మల్చింగ్ ప్లాస్టిక్ మార్చ్ కంటే ఖరీదు ఎక్కువ ఉండటంతో రైతులు ప్లాస్టిక్ మార్చ్ని వాడుతున్నారు.
పొలంలో ఎక్కువ కలుపు వస్తుంది అంటే అంతర పంటలు లేదా పంట మార్పిడి పద్ధతులు వాడుకోవచ్చు. పంట పొలంలో కాళీ లేకుండా అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. ఎలా ప్లాస్టిక్ మల్చింగ్ పద్దతిని ఇంకా వడుతూపోతే భూమికి సూర్య కాంతి తగలకుండా ఉండటం వల్ల పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది.
Also Read: Vetiver Cultivation: వట్టివేరు సాగుతో రూ.లక్షల్లో ఆదాయం.!