నేలల పరిరక్షణ

Fertilizer Management in Coconut: కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం.!

1
Coconut
Coconut

Fertilizer Management in Coconut: ఈ మధ్యకాలంలో కొబ్బరిలో దిగుబడులు మరియు కాయ పరిమాణం తగ్గడానికి ప్రధానమైన కారణాలలో సరైన సమగ్ర ఎరువుల యాజమాన్యం లేకపోవడమే. దీని కోసం కొబ్బరి రైతాంగం సిఫార్సు చేయబడిన ప్రధాన ఎరువుల మోతాదును కొబ్బరి చెట్లు బేసిన్‌లలో వేసుకోవాలి. తద్వారా పోషకాల లోపాల్ని అధిగమించి, అధిక దిగుబడులు మరియు కాయ నాణ్యతను మెరుగుపరచుకోవడానికి మంచి అవకాశం ఉన్నం.

నత్రజని : కొబ్బనిలో లేతమొక్కల పెరుగుదలకు, త్వరగా పొత్తులు రావడానికి నత్రజని దోహదపడుతుంది.

భాస్వరం : లేత కొబ్బరి మొక్కలలో మొదలు లావుగా, ధృడంగా తయారవడానికి, పక్కువ ఆకులు ఏర్పడటానికి భాస్వరం ఉపయోగపడుతుంది.

పొటాష్‌ : కొబ్బరి అతిముఖ్యమైన స్థూలపోషక పదార్థం పొటాషియం, కాయ పరిమాణం, పిందెరాలడం తగ్గించడం, తెగుళ్ళు మరియు ఎరువుల ను తట్టుకునేలా చేస్తుంది.

ఎరువుల యాజమాన్యం : నాటిన 1 సంవత్సరము నుండి సిఫార్సు చేసిన మోతాదులో పరువులు వాడవలెను. వేపపిండి, పశువుల పరువు, వర్మికంపోస్ట్‌ వంటి సేంద్రియ పరువులు, పచ్చిరొట్ట పరువుల వాడకం చాలా లాభదాయకంగా ఉంటుంది. దిగుబడులు నిలకడగా ఉంటాయి.

Also Read: Coconut Fruit Drop: కొబ్బరిలో పిందెలు రాలటాన్ని ఇలా నివారించండి.!

Fertilizer Management in Coconut

Fertilizer Management in Coconut

1`4 సంవత్సరాల వయస్సు గల చెట్లకు : 1/2 కిలో యూరియా G 1 కిలో సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ R 1/2 కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ G 20 కిలోల పశువుల ఎరువు / సం॥ చెట్టుకు. రెండు సమభాగాలలో జూన్‌ ` జూలై మరియు సెప్టెంబర్‌ ` అక్టోబర్‌ మాసాల్లో రెండు దఫాలుగా వేసుకోవాలి.

5 సంవత్సరాల వయస్సు మించిన కాపు కాయ చెట్లకు : 1 కిలో యూరియా G 2 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ G 2 1/2 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ G 25 కిలోల పశువుల పరువు లేదా 2 కిలోల వేపపిండి / సంవత్సరానికి చెట్టుకు వేయాలి.

ఎరువుల వేసే పద్ధతి : పరువులను సక్రమమైన పద్ధతిలో చెట్ల చుట్టూ పళ్ళెములో వేసినప్పుడే, అది నేలలో ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. పైన సిఫార్సు చేసిన ఎరువులను రెండు దఫాలుగా జూన్‌ ` జులై మరియు సెప్టెంబర్‌ ` అక్టోబర్‌ మాసాల్లో రెండు సమభాగాలుగా వేసుకోవాలి. చెట్టు కాండమునకు ఒకటిన్నర నుండి రెండు మీటర్ల దూరములో చుట్టులో గాడిచేసి, పురుగులని చల్లి, మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పువేయుట, వేర్లను నరికివేయుట మొదలగునవి అశాస్త్రీయమైన పద్ధతులు. ఈ చర్యలవలన చెట్లుకు హాని కలుగుతుంది.

సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతిద్వారా కొబ్మరిలో రసాయన పరువుల వాడకం 25 శాతం మేర తగ్గించి, సేంద్రీయఎరువులైన వర్మికంపోస్టును (కొబ్బరి పదార్థాలనుండి తయారు చేసిన) వాడకం వలన నేల సారవంతంగా ఉండి, మంచి దిగుబడి పొందవచ్చు.

Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!

Leave Your Comments

Bapatla Agriculture College Platinum Jubilee: 75 వసంతాల వ్యవసాయ కళాశాల, బాపట్ల.!

Previous article

Dairy Cattle Calendar 2023: పాడి పశు క్యాలెండర్‌ 2023

Next article

You may also like