Dryland Agriculture Problems – వర్ష పాత వ్యత్యాసాలు:
1) ఋతు పవనాల ప్రారంభం: నైరుతి ఋతుపవనాల ప్రభావం వలన వర్షాలు ముందుగా లేదా ఆలస్యం గా రావడం. ముందుగా వచ్చిన కాలంలో విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైన పంట మార్పిడి మరియు ఇతర సేద్య పద్ధతులు చేపట్టి దిగుబడులను పెంచుటకు అవకాశమo కలదు.
2) పంట కాలం లో వర్షాభావం: పంట కాలం లో 3-4 వారాలు అంత కంటే ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులు వలన మొక్కలు నీటి ఎద్దడికి గురై తక్కువ దిగుబడి వచ్చుటకు ఆస్కారం కలదు. పూత సమయం లో వర్ష భావం సంభవిస్తే పంట నష్టం ఎక్కువగా ఉంటుంది.
3) వర్గాలు ముందుగానే ఆగిపోవుట: ఈశాన్య ఋతుపవనాలు కాల పరిమితి ముగియకుండానే ఆగి పోవుట వలన తేలిక నేలల్లో పండించే వేరుశెనగ, జొన్న, ఆముదాలు, కంది పంట దిగుబడులు తగ్గుటకు అవకాశం కలదు.
Also Read: Pests in Redgram Cultivation: కంది పంటను ఆశించు పురుగులు.!
తక్కువ వర్షాకాలం: పంట కాలం 90 – 120 రోజుల లోపు ఉంటుంది . అటువంటి ప్రాంతాలలో తక్కువ కాలపు రకాలను సాగు చేయడం మంచిది.
ఉధృత వర్ష పాతం: వర్ష పాతం ఉదృతం గా పడిన నేలకోత తో పాటు, పడిన వర్షపు నీరు వృధాగా పోతుంది. కనుక నేలను, నీటిని సరైన పద్ధతులను అనుసరించి కాపాడుకొనాలి.
నేల స్వభావం: పంటల దిగుబడులు నేల భౌతిక, రసాయనిక స్వభావం (నీటిని నిల్వ చేసే శక్తి, పోషకాల సరఫరా సామర్ధ్యం, నేల లోతు పై ఆధార పడి ఉంటాయి. ఎర్ర నేలలు వర్షం పడిన తర్వాత పై పొర గట్టి పడి మొలక శాతం తక్కువ అవుతుంది. లోతైన నల్ల రేగళ్ళ కు నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ అధిక వర్షాలు పడినపుడు మురుగు నీరు పోక పంటకు నష్టం కలుగుతుంది.
కలుపు మొక్కల సమస్య: కలుపు మొక్కలు, పంట మొక్కలు మొలకెత్తక ముందే మొలిచి పంట పెరుగుదలను అరికట్టి నీటి ఎద్దడికి గురి చేస్థాయి. నీటితోపాటు, పోషక పదార్ధాలకు పోటీ పడుతాయి. కనుక సకాలం లో కలుపు నివారణా చర్యలు చేపట్టాలి.
అనువైన పంట రకాలను సకాలం లో అందించుట: ఒక్కొక్కసారి వర్ష పాతం మామూలు కంటే ముందుగా వస్తుంది. అట్టి పరిస్థితులలో మేలు రకపు వంగడాలను సకాలం లో అందజేసి పంట ఉత్పత్తి పెంచుటకు తోడ్పడాలి. వర్షాలు ఆలస్య మైనపుడు పంట మార్పిడి చేసి అనువైన రకాలను అందజేసి పంట దిగుబడి పెంచే వీలు ఉంది.
రైతు ఆర్థిక స్థోమత: సాధారణం గా మెట్ట సేద్యపు రైతుల ఆర్ధిక స్థోమత చాల తక్కువ. అందువలన మెట్ట సేద్యపు పంటలు అతి తక్కువ ఖర్చుతో పండిస్తారు. కాని వారికి తగు ఋణ సదుపాయం అందించి మంచి రాబడి ఇవ్వగల పంటలను వేసుకునేటట్లు ప్రోత్సాహం ఇవ్వాలి.
Also Read: Dryland Agriculture: మెట్ట వ్యవసాయంలో ఏ పంటలు పండిస్తారు.!