Deep Soils Management: వరి సాగు కారణంగా సీసన్ లో లోతుగా దుక్కి,దమ్ము వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా అదే పనిగా లోతుగా దమ్ము చేయడం వలన వరి పంట సాగు చేసే నేలలు అన్ని ఊబిలాగా తయారయి ట్రాక్టర్ తో దుక్కికి సంహరించడం లేదు. ఎడ్లతో దమ్ము చేస్తే వేసిన కాలు బురద నుండి బయటకు రాని వైనం. ఇలా లోతు ఎక్కువ ఉంది నీరు నిలిచిన నేలలు పంట సాగుకి ఎంతో అవరోధంగా మారుతున్నాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలలో 15 – 100 సెం.మీ వరకు నీరు నిలిచి ఉండటం సాధారణ లక్షణం.
Also Read: Citrus Gummosis Managment: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!
ఈ రకం నెలలో సాగు పరిమితులు :
- నీరు నిండుగా ఉండడం వలన నేలలో ఆక్సిజన్ లేకపోవడం.
- CO2, CH4 మరియు ఇథిలీన్ వంటి విషపు వాయువుల పెరుగుదల వేరు వ్యవస్థను నాశనం చేస్తుంది.
- పై నేల లవణీకరణ. ఉప్పు పేరుకుని పోవడం.
- మొక్క నీరు తీసుకునే గుణం తగ్గుతుంది.
- వేర్లు దెబ్బతింటాయి మరియు కొత్త వేర్లు ఏర్పడకపోవడం.
- మరిన్ని వ్యాధులకు పంట సుగ్రాహ్యంగా మారడం.
- నేలలో ఫంగస్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
- పంటకు కావలసిన పోషకాల నష్టం.
- ఫెర్రస్ అయాన్లు మరియు సల్ఫైడ్ అయాన్లు వంటి విషపూరిత పదార్థాలు అభివృద్ధి చెందుతాయి.
- కరిగే భాస్వరం మట్టి నుండి బయటకు పోతుంది.
నీరు నిలిచిన నేలల నిర్వహణ:
- అదనపు నీటిని తొలగించడానికి ఓపెన్ డ్రైనేజీలు & సబ్‌సర్ఫేస్ డ్రైనేజీ సిస్టమ్ ఉత్తమ నిర్వహణ పద్ధతి.
- అనుబంధ N & P ఎరువులు అదనపు నీటి ఒత్తిడిని తగ్గిస్తాయి.
- నీటి నిల్వ నిరోధక రకాలను ఉపయోగించడం, ఎత్తయిన నారు మడుల పెంపకం, రైజ్డ్ – సన్కెన్ బెడ్ టెక్నాలజీ వంటి వ్యవసాయ పద్ధతులు ఉత్తమ ఫలితాలు అందిస్తాయి.
- నీటిపారుదల సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు భూగర్భ జలాలకు నష్టాలను తగ్గించడం, నీరు నిల్వతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గించడం, నిస్సారమైన భూగర్భ నీటి పట్టికలను నిర్వహించడం వంటి నీటి నిర్వహణ పద్ధతులు; వేరు వ్యవస్థలో లవణీయత స్థాయిలను తగ్గించడానికి భూగర్భ జలాల స్థాయిలు క్లిష్టమైన లోతులకు చేరుకున్నప్పుడు నీటిపారుదలని ఆపాలి.
- వరి సాగులో లోతు దుక్కులు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే చేసుకోవాలి.
Also Read: Integrated Pest Management: సమగ్ర సస్య రక్షణ అమలులో వ్యూహాలు.!