Biochar: ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా అనేక రకాల కలుపు మందులు, సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగా చల్లడం వల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. ఈవిషపూరిత రసాయనాలు మట్టిలో కలిసిపోయి నేల నిస్సారం అవుతుంది. రసాయన మందులు పంటలపై చల్లినప్పుడు కొంతవరకే పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణకు ఉపయోగపడి, మిగిలినవి నేలలో గాలిలో నీటిలో కలిసి మానవాళి ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నాయి.
ఈనేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ మార్గంపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రియ పద్ధతులు పాటించి వ్యవసాయం చేసినట్లయితే నేలను మట్టిని సుసంపన్నం చేసుకొని వాటిని సంరక్షించి భావితరాలకు అందించవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే జీవామృతం ఘనజీవామృతం పంచగావ్య వంటి మాత్రమే కాదు. ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ పద్ధతుల్లో పోషకాలు అందిచేలా మార్చుకోవచ్చు, నేలలో ఉండే సూక్ష్మ స్ధూల పోషకాలను మొక్కకు సరఫరా చేయడంలో నేలకు అవసరమైన మేలు చేసే సూక్ష్మజీవుల పెంపుదలలో వేస్ట్ టు వెల్త్ లో భాగంగా మనం బయోచార్ ను ఉపయోగించి నేలను సంరక్షించుకోవచ్చు.
Also Read: Cut Flowers Farming: తక్కువ ఖర్చుతో కాసుల వర్షం కురిపిస్తున్న కట్‌ఫ్లవర్స్ .!
బయోచార్ అనేది అనేక వ్యవసాయ ప్రక్రియలో ఉపయోగించే బొగ్గు వంటి పదార్థం. దీనిని వ్యవసాయ వ్యర్ధాల నుంచి బొగ్గును తయారు చేసుకొని తిరిగి మళ్లీ పొలంలో వెదజల్లే కోవాలి. తక్కువ ఖర్చుతో భూసారని పెంచుకోవడానికి ఇది ఒక మార్గం. బయోచార్ ను పంట భూములకు అందించడం వల్ల ఎక్కువ పోషకాలను మట్టిలోనే ఉంచి భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అధిక కార్బన్ కలిగిన ఘనవ్యర్ధాలను ఉపయోగించి తయారు చేసుకున్న బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతోంది ఇది పశువుల ఎరువు లో ఉండే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. బయోచార్ ను వాణిజ్యపరంగా ఆధునిక పద్దతుల ద్వారా తయారు చేస్తున్నారు.
బయోచార్ ను నీడ కలిగిన ప్రదేశంలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటకు అందించాలి. బయోచారును మన దేశంలో కొన్ని ప్రైవేటు కంపెనీలు తయారు చేస్తున్నాయి. బయోచార్ తో పాటు కొన్ని రకాల ఉత్పత్తులు అయినా వర్మి కంపోస్ట్ బయోచార్ ఎరువులు వంటివి తయారు చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండటం వల్ల పంటల ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. అందువల్ల రైతులు తమ పొలంలోనే వ్యర్ధాలను బయోచార్ ను తయారు చేసుకోవాలి. దీనిని ఒక కిలో నుండి రెండు కిలోల వరకు పండ్ల మొక్కలకు అందించవచ్చు. రెండు నుంచి నాలుగు టన్నుల బయోచార్ ఎరువుగా ఒక ఎకరాకు అందించవచ్చు.
Also Read: Ridge Gourd Farming: బీర సాగులో అద్భుతాలు.. లక్షల ఆదాయం.!