Waste Decomposer: ప్రస్తుతం భారత రైతులకు సేంద్రియ వ్యవసాయం మీద పెరుగుతున్న ఆదరణ వలన నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ (NCOF) వ్యర్థాలను కుళ్లిపోయేలా చేయడానికి ప్రత్యేక ద్రావణాన్ని అభివృద్ధి చేసింది. ఇది సేంద్రీయ వ్యర్థాల నుండి త్వరగా కంపోస్ట్ చేయడానికి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు మొక్కలను సంరక్షించడానికి ఉపయోగపడుతుంది . ఇది దేశీ ఆవు పేడ నుండి సేకరించిన సూక్ష్మ జీవుల సమాఖ్య.

Waste Decomposer
వేస్ట్ డికంపోజర్ 30 గ్రాముల బాటిల్లో రూ.20/- కి అందుబాటులో ఉంది.దీన్ని NCOF మరియు ప్రాంతీయ సేంద్రీయ వ్యవసాయ కేంద్రాల (RCOF) ద్వారా నేరుగా రైతులకు అందిస్తున్నారు . వేస్ట్ డికంపోజర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ద్వారా ధృవీకరించబడింది. ఒక సీసా కేవలం 30 రోజుల్లో 10000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బయో–వ్యర్థాలను కుళ్ళిస్తుంది.
మదర్ కల్చర్ నుండి వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని సిద్ధం చేయు పధ్ధతి:
- 2 కిలోల బెల్లం తీసుకుని 200 లీటర్ల నీటితో ప్లాస్టిక్ డ్రమ్ములో కలపాలి
- దీని నుండి 1 బాటిల్ వేస్ట్ డికంపోజర్ తీసుకుని, అందులోని అన్ని పదార్థాలను బెల్లం ద్రావణం ఉన్న ప్లాస్టిక్ డ్రమ్లో పోయాలి. చేతులతో కలపడం నిషిద్ధం.
- వ్యర్థాలపై సమంగా వ్యాప్తి చేయడం కోసం కర్ర సహాయం తీసుకోవొచ్చు.
- డ్రమ్ను కాగితం లేదా కార్డ్బోర్డ్తో కప్పి, ప్రతిరోజు ఒకటి లేదా రెండుసార్లు కలపాలి.
- 5 రోజుల తర్వాత డ్రమ్ యొక్క ద్రావణం క్రీముగా మారుతుంది.
Also Read: పొట్టును కాల్చే కాలుష్యానికి పరిష్కారం
రైతులు పైన ఏర్పడిన ద్రావణం నుండి మళ్లీ మళ్లీ వ్యర్థ డీకంపోజర్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం 20లీటర్ల వేస్ట్ డికంపోసర్ ద్రావణాన్ని డ్రమ్ములో 2కిలోల బెల్లం, 20లీటర్ల నీరు కలపాలి. ఈ ద్రావణం నుంచి రైతులు జీవితాంతం డెకంపోజర్ ని తయారు చేసుకోవొచ్చు.
రైతులు వేస్ట్ డెకంపోసర్ ఉపయోగించు విధానం:
- పశువుల పేడతో కలిపి వేయడం.
- నీడ కింద ఉంచిన ప్లాస్టిక్ షీట్‌పై 1 టన్ను కంపోస్ట్‌ను పొరగా వేయండి.
- ముందుగా తయారు చేసిన 20 లీటర్ల ద్రావణాన్నికంపోస్ట్ పొరపైన చల్లుకోండి.
- ఇప్పటికే ఉన్న పొర పైన కంపోస్ట్ యొక్క మరొక పొరను విస్తరించండి.
- కంపోస్ట్ పొరపై 20 లీటర్ల ద్రావణాన్ని చల్లుకోండి.
- 10 కంపోస్ట్ పొరల కోసం ద్రావణాన్ని ఉపయోగించండి.
- కంపోస్టింగ్ మొత్తం కాలంలో 60% తేమ ఉండేలా చుసుకోవాలి.
- 7 రోజుల వ్యవధిలో ఒకసారి కంపోస్ట్‌ను తిప్పాలి. 30 రోజుల తర్వాత కంపోస్ట్ ఉపయోగించడానికి సిద్ధం అవుతుంది.
- 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో ఉన్న పంటపై తయారీని పిచికారీ చేయండి.
బిందు సేద్యం:
1 ఎకరానికి అవసరమైన నీటిలో తయారీని కలుపుకుని బిందు సేద్యానికి ఉపయోగించండి.
పంట అవశేషాల ఇన్–సిటు కంపోస్టింగ్:
1 ఎకరం భూమిలో పంట మొక్కల కోత అనంతర కాండాలపై తయారీని పిచికారీ చేసి, కుళ్ళిపోయేలా వదిలివేయండి.
విత్తన శుద్ధి:
- చేతి తొడుగులు ధరించి 1 బాటిల్లోని పదార్థమును 30గ్రా బెల్లంతో పూర్తిగా కలిపి 20 కిలోల విత్తనాలను శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు.
- శుద్ధి చేసిన విత్తనాలను నీడలో 30 నిమిషాలు ఆరనివ్వాలి.
- 30 నిమిషాల తర్వాత. విత్తనాలు విత్తడానికి సిద్ధం అవుతాయి.
- సాధారణ వ్యాధి నియంత్రణ కోసం, నెలకొకసారి నిలబడి ఉన్న పంటపై పిచికారీ చేయాలి.
ఉపయోగాలు:
ఎకరానికి 1000 లీటర్ల వ్యర్థ డీకంపోసర్ ఉపయోగించిన 21 రోజులలో అన్ని రకాల నేల (ఆమ్ల మరియు ఆల్కలీన్) యొక్క జీవ మరియు భౌతిక లక్షణాలను మారుస్తుంది మరియు ఇది కేవలం ఆరు నెలల్లో 1 ఎకరా భూమిలో 4 లక్షల వరకు వానపాముల జనాభాను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
Also Read: బయోగ్యాస్ వల్ల కలిగే ఉపయోగాలు