ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయం

ఈ ఎరుపు బెండకాయలు మీకు తెలుసా..?

1
red-ladies-finger-cultivation-details

Red Ladies Finger సర్వసాధారణంగా బెండకాయలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆకుపచ్చగా జిగటగా ఉంటాయి అని అనుకుంటాము. ఆ బెండకాయలను తినడం వల్ల మేధాశక్తి పెరుగుతుందని పెద్దలు చెప్తూంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా లెక్కలు బాగా వస్తాయని కొందరు జ్ఞాపక శక్తి పెరుగుతుందని భావించి మరికొందరు వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కేవలం ఆకుపచ్చ బెండలే కాదండోయ్‌ ఎరుపురంగు బెండకాయలు కూడా ఉంటాయి. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది.

red-ladies-finger-cultivation-details

ఈ ఎరుపు రంగు బెండ సాగు గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ పెంబర్తికి చెందిన ప్రభాకర్‌ రెడ్డి అనే రైతు సేంద్రీయ పద్దతిలో ఈ బెండను సాగుచేస్తున్నారు. ఈ విధంగా పండించిన పంటను మార్కెట్లో ప్రవేశపెట్టి విక్రయదారుల నుంచి భారీ లాభాలను గడిస్తున్నారు. ఈ విధమైన ఎరుపు బెండ సాగును చాలా అరుదుగా చూస్తామని… సాధారణ బెండకాయ సాగుకు ఇది భిన్నంగా ఉంటుందని.. తక్కువ కాలంలో అధిక దిగుబడిని ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ ఎరుపు బెండ సాగు ద్వారా అధిక లాభాలను పొందుతున్నానని… దీనికి మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉందని ప్రభాకర్‌ రెడ్డి చెప్తుకొచ్చారు.

ఎరుపు రంగు బెండ సాగుకు అనుకూలతలు:

ఈ ఎరుపు రంగు బెండ వంగడాన్ని రాధిక అని పిలుస్తారని రైతు ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఈ బెండ సాగు చేయడానికి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉంటాయని అలాంటి ప్రాంతాలలో బెండ అధిక దిగుబడి వస్తుందని ఆయన తెలిపాడు. సాధారణ బెండతో పోలిస్తే ఈ బెండలో ఎక్కువ మొత్తంలో సూక్ష్మపోషకాలు, శరీరానికి అవసరమైన పోషకవిలువలు ఉంటాయని.. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి ఎర్ర బెండ ఎంతో మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Leave Your Comments

ఒంగోలు గిత్తలపై స్పెషల్ స్టోరీ…

Previous article

క్యాబేజీ సాగులో యాజమాన్య పద్ధతులు తెలుసా..!

Next article

You may also like