Reasons for Methane Emissions from Soil: మీథేన్ వాయువు నేల ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణం. ఇది భూమికి మరియు వాతావరణానికి అత్యంత హానీకరంగా పరిగణించబడుతుంది. ఈ వాయువు ఇతర గ్రీన్ హౌస్ వాయువుల లో అత్యంత ప్రమాదకరం.అలాంటి వాయువు మోటార్ సైకిల్ ల నుండి మాత్రమే కాకుండా వ్యవసాయ పంటల నుండి కూడా వస్తుందంటే నమ్ముతారా? అవును. వరి మొత్తం మీథేన్ ఉత్పత్తిలో 4% వాటా కలిగి ఉంది.
Also Read: Weed Menace in Agriculture: కలుపు ముప్పా లేదా మేలా ?
వరి పొలాల్లో మీథేన్ ఉత్పత్తికి మరియు విడుదలకు అనుకూలమైన పరిస్థితుల గురించి తెలుసుకుందాం!
• బురద నేలల్లో ఏర్పడే వాయురహిత పరిస్థితులు మీథేన్ ఉత్పత్తికి ప్రధాన కారణం.
• బరద నేలల్లో చేసే కొన్ని సాంస్కృతిక పద్ధతుల వలన మట్టి సూక్ష్మ రంధ్రాల్లో ఉన్న మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదల అవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
• సేంద్రీయ సవరణలను ఉపయోగించడం వలన, మీథేన్ వాయువు విడుదలకు దారి తీస్తుంది.
• రసాయనిక ఎరువుల వాడకం.
మీథేన్ ఉద్గారతను తగ్గించే మార్గాలు:
• సాధ్యమైనంత వరకు వరి ఉత్పాదకత పై ఎలాంటి ప్రభావం లేకుండా వరి పొలాలు మునిగిపోకుండా నీటిని నిర్వహించాలి.
• దమ్ము చేయకుండా నేరుగా విత్తనాన్ని వెదజల్లే పధ్ధతిలో వరిని సాగు చేయాలి.
• వరి ప్రత్యామ్నాయ పంటల విధానాలు పాటించాలి.
• నీటి నిర్వహణలో భాగంగా నియంత్రిత నీటి పరిస్థితులలో అడపాదడపా ఎండబెట్టడం మరియు మంచి డ్రైనేజీని ఉంచాలి.
• తక్కువ మీథేన్ విడుదల చేసే లక్షణాలను కలిగి ఉన్న వరిని సాగు చేయాలి.
• సల్ఫేట్ కలిగిన ఉన్న ఎరువులను వాడాలి కావున అవి మీథేన్ ఉద్గారాలను తగ్గిస్తాయి.
• పంట ఉన్న సమయంలో నేలను దున్నడాన్ని తగ్గించాలి తద్వార నేలలో ఉన్న మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది.
• బాగా కుల్లిన సేంద్రీయ సవరణల ఉపయోగించాలి.
Also Read: Analysis on Good Prices of Dried Chillies: ఈ ఏడాది ఎండుమిర్చికి మంచి ధరలకు కారణాలు ఒక విశ్లేషణ.!