Rainfall Impact on Crops: మనదేశం లో వర్షాలు ఎక్కువగా ఋతు పవనాల ప్రభావం వల్ల కురుస్తాయి. ఋతు పవనాలు అనగా ఆయా ఋతువు లలో పీచు గాలుల వల్ల కురిసే వర్షాలకు ఋతు పవన వర్షాలు అంటారు. మన దేశం లో నైరుతి ఋతు పవనాల వల్ల 70 % ఈశాన్య ఋతు పవనాల వల్ల 20%, వేసంగి వర్షాల వల్ల 10 % వర్షాలు కురుస్తున్నాయి.
ప్రభావం:
విత్తనం మొలకెత్తడానికి, మొక్కల పెరుగుదలకు, నేలలో తేమ అవసరం; ఈ తేమ ముఖ్యం గా వర్షాల వల్ల సమకూరుతుంది.పంటలకు కావలసిన నీటిని అందించే భారీ ప్రాజెక్టులు (నాగార్జున సాగర్, బాక్రానంగల్ మొ.) చెరువులు, సరస్సులు, భూగర్భ జలాలు వర్షాలు పడి నిండి నపుడే పంటలకు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయగలo. అంటే పంటల కైనా, మానవుని నిత్యావసరాకైనా పరిశ్రమ ల కైనా నీరు వర్షాల వల్ల సమకూర వలసినదే.పంటలు సక్రమం గా అధిక దిగుబడులు ఇవ్వాలంటే పంట అధిక తేమకు గాని, బెట్టకు గాని గురి కాకూడదు. యుక్తతమ తేమ పరిస్థితులు అవసరం.
Also Read: Importance of Food Grain Crops: ఆహార ధాన్య పంటల ప్రాముఖ్యత.!

Rainfall Impact on Crops
అందువల్ల మొత్తం వర్ష పాతం కన్నా ఆ వర్ష పాతం ఏ విధం గా వితరణ (distribution) చెందు తుంది అన్న విషయం ముఖ్యం. ఉదా: ఒక ప్రాంతం లో 24 గంటల లో 10 సెం. మీ వాన కురియడం కంటే ఆ 10 wee సెం.మీ వాన 3-4 దఫాలుగా ఒక వారం, పది రోజుల వ్యవధి లో కురిస్తే పంటలకు కావలసిన నీరు ఎక్కువ, తక్కువలు కాకుండా ఉండి పంట దిగుబడులు పెరుగుతాయి.
తక్కువ వర్ష పాత ప్రాంతాలలో (దక్కను పీటభూమి, రాజస్థాన్ మొ ప్రాంతాలు) పంటలు సాధారణంగా బెట్టుకు గురవుతాయి. అటువంటి ప్రాంతాలలో దిట్టకు కట్టుకోగల పంటలో వేస్తారు. ఉదా : తెలంగాణా బెట్ట ప్రాంతాలలో తేలిక నేలల్లో ఆముదాలు ఎక్కువగా పండిస్తారు. అదే విధంగా అనంతపూర్ జిల్లాలో తేలిక నేలల్లో ఎక్కువగా వేరుసెనగ పండిస్తారు. బరువైన నల్ల రేగ గళ్ళలో జొన్న, సెనగ వంటి రబీ పంటలు పండిస్తారు.పంట కోత సమయం లో అధిక వర్షాలు పడితే పంట నేలపై వాలిపోయి కోత కష్టం అవుతుంది. (వరి) అంతే గాక గింజ నీటిలో నానిపోయి నాణ్యత పోవడం, గింజ మొలకెత్తడం జరుగుతుంది.
అధిక వర్ష ప్రభావం:
అధిక వర్షాల వల్ల నేల సంతృప్త దశ కు చేరడం వల్ల నీరు నేలలో ఇంకకుండా భూమిపైనే నిలచిపోతుంది. దీనివల్ల మొక్కల వ్రేల్లకు ప్రాణ వాయువు అందక మొక్కలు చనిపోతాయి. అంతేగాక పోషక పదార్ధాలు నేల అడుగు పొరలలోనికి పోవడం వల్ల పంటకు పోషక పదార్ధ లోపాలు ఏర్పడతాయి.
అల్ప వర్ష ప్రభావం:
వర్షపాతం తక్కువగా ఉండి వితరణ క్రమ బద్ధంగా లేనపుడు బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో సరైన పోషక పదార్ధాలు మొక్కలకు అందక మొక్కల పెరుగుదల, దిగుబడులు తగ్గిపోతాయి. బెట్ట పరిస్థితులలో నేలలో తేమ కంటే భాష్పీభవన, భాష్పోత్సేకాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read: Bendi Cultivation: బెండ సాగు యాజమాన్య పద్ధతులు.!