Pomagranate Farming: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వి కోట మండలానికి చెందిన రైతు నాగరాజు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తనకున్న ఐదెకరాల పొలం లో అధునాతన పద్దతులు ఉపయోగించి దానిమ్మ సాగు చేశారు. నాగరాజు సాధించిన దిగుబడులు చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో చెట్టుకు 30 కేజీల దిగుబడి సాధించారు.
సాగు భళా:
నాగరాజు అవలంబిస్తున్న పద్ధతులు అధిక దిగుబడికి కారణం అవుతున్నాయి. ఐదెకరాల్లో నాగరాజు 1700 దానిమ్మ మొక్కలు నాటారు. క్రమం తప్పకుండా పర్యవేక్షణ సమయానికి నీరు, ఎరువులు ఇవ్వడంతోపాటు ట్రూనిగ్ పద్ధతులు అవలంబించారు. దీంతో ఒక్కో చెట్టుకు 150 కాయల దిగుబడి సాధించారు. కిలో రూ.80 చొప్పున పొలం వద్దే వ్యాపారులకు విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు.
Also Read: Pomagranate Farming: అధునాతన పద్ధతిలో దానిమ్మ సాగు లక్షల్లో ఆదాయం
ఆశాజనకంగా ధరలు:
పండుగల సీజన్ కావడంతో పండ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం మరో కోతకు సిద్దంగా ఉంది. వినాయక చవితికి ముందుగా పంటను కోయాలని నాగరాజు ప్రణాళిక వేసుకున్నారు. పండగ సీజన్లో కిలో రూ.120 చెల్లించి తీసుకెళతారని రవాణా ఖర్చులు కూడా ఉండవని ఆయన చెబుతున్నరు. ఐదెకరాల్లో 25 టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. ఖర్చులు రూ.6 లక్షల వరకు అయిందని నాగరాజు తెలిపారు. ఖర్చులన్నీ పోయి రూ. 18 లక్షల నికరలాభం వచ్చే అవకాశం కనిపిస్తోందని ఆయన వివరించారు. దానిమ్మ సాగు చేయాలనుకునే రైతులు తమ పొలాన్ని పరిశీలించుకోవచ్చని, ఉచితంగా మెలకువలు నేర్పిస్తానని నాగరాజు అభయం ఇచ్చారు.
మధ్యలో మామిడి:
రైతు నాగరాజు 5 ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటారు. అధునాతన పద్ధతిలో సెరికల్చర్ ద్వారా మొక్కలు సేకరించి సాగు మొదలు పెట్టారు. 18 నెలలకే కాపు వచ్చాయని నాగరాజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో మామిడి ద్వారా రూ.5 లక్షల ఆదాయం పొందారు. ఎకరాకు సాగు ఖర్చలు రూ.1 లక్ష వరకు అయ్యాయని రైతు నాగరాజు చెప్పారు.
Also Read: Niranjan Reddy: మూడవరోజు పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మార్కెట్ గమనించాలి:
వ్యవసాయంలో అధునాతన విధానాలు అవలంభించడం తో పాటు మార్కెట్లో ఏ పంటకు ఎప్పుడు మంచి ధర వస్తుందో అంచనా వేసి ఆ సమయంలో పంట చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని నాగరాజు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతం దానిమ్మ, మామిడి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్థి చెప్పి పండ్ల తోటల పెంపకం పై దృష్టి పెట్టాలని నాగరాజు సలహా ఇస్తున్నారు. రైతులంతాఒకే పంట సాగు చేయడం ద్వారా ధరలు పతనమై ఎవరికీ లాభం రాకుండా పోతోందని ఆయన విశ్లేషించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నగరాలు విస్తరిస్తున్నాయి. పండ్ల వినియోగం కూడా భాగా పెరిగిందని నాగరాజు చెప్పుకొచ్చారు. పండ్ల తోటలు పెట్టుకుంటే రైతుకు పది నుంచి 20 సంవత్సరాలపాటు నికర ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు.
Also Read: PJTSAU: వ్యవసాయ విశ్వవిద్యాలయము M.P.C స్ట్రీం కోర్సులకు వాక్.ఇన్.కౌన్సిలింగ్