Weed Management in Paddy: ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా వరిని సాగుచేస్తారు. అయితే వరి ఇప్పుడు వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల నాట్లు వేయగా మరికొన్ని చోట్ల నాట్లు వేయడానికి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి దశలోనే నాటు వేసిన తరువాత మందులు వాడితే దిగుబడులు భారీగా వస్తాయాని రైతుల అంచనా. అంతేకాకుండా కలుపును నివారించడానికి రైతులు అనేక మందులను పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు అన్నదాతలకు లభిస్తున్నాయి. అయితే ఏపంటకు, ఏ మందును ఎంత మోతాదులో వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాల్సి ఉంటుందని ఆధికారులు సూచిస్తున్నారు.
వరిలో కలుపు నివారించేందుకు మార్కెట్లో ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో వస్తున్నాయి. కలుపు పైన దృష్టి పెడితే కలుపు నివారణ అనేది చాలా తేలికైన పని. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వరిలో కలుపు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కూలీల కొరత కారణంగా కలుపు తీయడం రైతులకు ఖర్చుతో కూడుకున్నదగా మారుతోంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణకు రైతులు రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యవసాయాధికారుల సూచనలు
వరిని రైతులు రెండు పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. వెదజల్లడం, గొర్రుతో విత్తడం. ఇలా సాగుచేసిన పైరులో కలుపు నివారణకు వరి విత్తిన రెండు లేక మూడు రోజుల్లోగా రైతులు మందులను పిచికారి చేయాలి. అంతేకాకుండా వరిలో గడ్డిజాతి మొక్కలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిని నివారించాలి. ముఖ్యంగా వ్యవసాయాధికారులను సంప్రదించి మందులను వాడాలి. ఏదిపడితే అది వాడి నేల సారాన్ని తగ్గించుకో కూడదు. ఆధికారుల సలహాలు పాటించి పిచికారీ చేస్తే ఎలాంటి కలుపు నైనా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
Also Read: ఉప్పలపాడు కేంద్రంగా పక్షుల సంరక్షణ కేంద్రం.!
మార్కెట్‌లో రసాయనిక మందులు లభ్యం
కలుపు మందును సిఫారసు చేసిన మోతాదులో అనువైన సమయానికి మాత్రమే సరైన పద్ధతిలో పిచికారీ చేయాలి. మందు పిచికారీకి సరైన నాజిల్‌ను ఉపయోగించాలి. ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడకూడదు. వరిలో కలుపు నివారణకు అనువైన రసాయనిక మందులు అన్ని మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని వాడి సులువుగా కలుపును నివారించవచ్చు.
కలుపును బట్టి మందులను ఎంపిక చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలో మాత్రమే వినియోగించాలి. వరిలో కలుపును నివారించడం ద్వారానే ఆశించిన దిగుబడి పొందే అవకాశం రైతులకు ఉంటుంది. సాధారణంగా పంట చేలో కలుపును కూలీలతో తీయించేవారు. కానీ ప్రస్తుతం కూలీల కొరత తో పాటు విపరీతమైన ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో రైతులు మందులపై ఆధారపడుతున్నారు.
Also Read: Harvest Home Foods: ఇంటి పంట లోగిళ్లకి అందమే కాదు ఆరోగ్యం కూడా.!