Pest of Soybean and Rice – సోయా చిక్కుడులో ఆంత్రాక్నోస్ తెగులు : ఈ తెగులు మొక్క అన్ని భాగాలపై ఎప్పుడైనా ఆశించవచ్చు. తేమ, వాతావరణం, అధిక వర్షపాతం ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఆకుల మీద గుండ్రటి మచ్చలు ఏర్పడి మచ్చల మధ్య భాగంలో బూడిద వర్ణం కలిగి అంచులు చుట్టూ ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. క్రమేణా ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి ఎండిపోతాయి.
మొక్కలు మొలచిన వెంటనే ఆశిస్తే చిన్న లేత మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు కారక శిలీంద్రము (కొల్ల్లిటోట్రైకమ్ డిమాషియమ్) ఈ తెగులు ఆశించినప్పుడు పంట పొలాల్లో మ్యాంకోజెబ్ G కార్బెండాజిమ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా హెక్సా కొనజోల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తనశుద్ధి వైటావాక్స్ పవర్ 3 గ్రా. కిలో విత్తన శుద్ధి చేయాలి.
Also Read: రైతన్నకో ప్రశ్న.!
వరిలో కాండం కుళ్ళు తెగులు :
లక్షణాలు : ఈ తెగులు ఆశించినప్పుడు దుబ్బులోని పిలకలు వాడినట్లుగా కనిపిస్తాయి. క్రమేణా దుబ్బులోని పిలకలు మొత్తం ఎండిపోతాయి. వ్యాధి తీవ్రమైనప్పుడు పంట పక్వానికి రాకముందే ఎండిపోతుంది. కాండం కుళ్ళు ఆశించిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలి భాగం ముదురు గోధుమ లేదా నలుపు రంగుకు మారును. ఈ రంగు కణుపుల వద్ద ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా ఎండిన పిలకలను చీల్చినప్పుడు చిన్న, చిన్న శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి.
నివారణ :
కిలో విత్తనానికి మూడు గ్రా. కార్బెండాజిమ్‌తో పొడి విత్తన శుద్ధి చేయాలి. తడి విత్తనశుద్ధికి 1 గ్రాము కార్బెండాజిమ్ ఒక లీటరు నీటిలో కలిపి విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి మండె కట్టి దుంపనారుమడిలో పోసుకోవాలి. తెగులు లక్షణాలను గమనించిన 2 మి.మీ. హెక్సాకొనజోల్ లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2.5 మి.లీ. లేదా కార్బన్డిజం 1 గ్రా. లేదా టెబ్యుకొనజోల్ 2 మి.లీటర్లు 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Also Read: వాతావరణం పంటల పరిస్థితి విశ్లేషణ, రైతులకు సూచనలు.!