Orchard Pest Management: పురుగులు ఆశించిన కాయలకు మార్కెట్లో డిమాండ్ లేక రైతులు బాగా నష్టపోయే ప్రమాదముంది. కొన్ని దేశాలు ఈ పురుగు ఆశించిన కాయలను గుర్తించినట్లయితే మొత్తం కాయలను తమ మార్కెట్లోకి రాకుండా నిషేధించిన సందర్భాలు అనేకం కాయ పుచ్చు ఈగ తల్లి పురుగులు పండటానిక సిద్ధంగా ఉన్న కాయపై పొర క్రింద గ్రుడ్లను పెడుతుంది. వీటి నుండి వెలువడిన పిల్ల పురుగులు మ్రాగట్స్ లోపలి గుజ్జును తినటము వలన శిలీంధ్రాలు ఆశించి కాయ కుళ్లి రాలిపోతుంది. దీని నుండి వెలువడిన లార్వాలు భూమిలోకి వెళ్లి కోశస్థ దశలోకి వెళ్తాయి. పెంకు పురుగు పొడవాటి ముక్కును కలిగి ఉండి కాయపై గ్రుడ్లను పెడుతుంది. వీటి నుండి వెలువడిన పిల్ల పురుగులు కాయను తొలుచుకుంటు టెంకలోకి వెళ్లి టెంకలోని పప్పును తినటం వలన పండిన కాయలు రాలిపోతాయి. టెంక పురుగు ఆశించిన కాయలపై ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ పురుగు సంవత్సరంలో ఒకే ఒక్క సారి తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది.
నివారణ చర్యలు:
1. పురుగు ఆశించి రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరివేసి నాశనం చేయాలి.
2. కాయ పుచ్చు ఈగ, టెంక పురుగు ఆశించిన చెట్ల మొదళ్ల చుట్టూ, చెట్ల క్రింద భూమిని మండు వేసవి కాలంలో లోతుగా కలియ దున్నాలి. తద్వారా భూమిలో కోశస్థ ఉన్న పురుగులు చనిపోతాయి.
3. టెంక పురుగు సమర్థ నివారణకు పురుగు ఆశించిన కాయలను 12 సెంటి గ్రేడ్ వద్ద 2 నుండి 5 రోజులుంచిన యెడల టెంకలోని పురుగులు నశింపబడుతాయి. ఆ తర్వాత కాయలను విదేశాలకు అడ్డు లేకుండా ఎగుమతి చేసుకోవచ్చు.
4. కాయ పుచ్చు ఈగ ఉనికిని గుర్తించడానికి, తల్లి పురుగులను నివారించటానికి విషపు ఎరలను అమర్చాలి. 2 లీటర్ల నీటికి 20 మి.లీ మలాథియాన్, 200 గ్రరాముల మొలాసిస్ పిచికారీ చేసుకోవాలి. ఎరలకు ఆకర్షింపబడిన పురుగులు విషానికి లోనై చనిపోతాయి.
5. ఈ పురుగుల నివారణకు తల్లి పురుగుల ఉనికిని గుర్తించిన వెంటనే మెటాసిష్టాక్స్ 2 మి.లీ లేదా పాస్ఫామిడాన్ 2 మి.లీ లేదా డైమిథోమోట్ 2 మి.లీ లీటరు నీటి కలిపి 2-3 సార్లు పిచికారి చేయాలి.
ఆకు గూడు పురుగు: ఇటీవలి కాలంలో లేత, ముదురు తోటల్లో ఆకు గూడు పురుగు బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పురుగు ఆకులను, పూకొమ్మలను దగ్గరగా చేర్చి గూడుగా తయారు చేసి ఆకులలోని పత్రహరితాన్ని గోకి తింటుంది. పూలను కూడా తినటం వలన కాయ దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. ఈ పురుగు సోకటం వలన చెట్టంతా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. పెద్ద తోటల్లో ఈ పురుగు ఆశించినపుడు నివారణ చాలా కష్టమవుతుంది.
నివారణ చర్యలు:
1. పురుగు చేసిన గూళ్లను వెదురు కర్ర చివర కట్టిన ఇనుప కొక్కాలతో వీడదీసి గూళ్లను మరిటయలు పురుగును
నాశనం చేయాలి.
2. చెట్టు లేత చిగురు వేసే సమయంలో తప్పకుండా పురుగుమందులతో పిచికారి చేయాలి. మోనో 2 మి.లీ లేదా రోగార్ 2 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా పాస్ఫామిడాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Maize Farmers: వర్షాభావంతో ఇబ్బంది పాలవుతున్న మొక్కజొన్న రైతులు.!
తామర పురుగులు: లేత గోధుమ/పసుపు రంగులో ఉండే సన్నని పురుగులు లేత ఆకు చిగుర్లు, పూలు, లేత పిందెలనుండి గోకి రసం పీల్చుతాయి. తద్వారా లేత ఆకు అంచులు ఎండి వంకర తిరిగిపోతాయి. పూత రాలిపోతుంది. ఈ పురుగు ఆశించు కాయలపై సన్నని తెలుపు గీతలు కనిపిస్తాయి. ఈ పురుగు అన్ని వయస్సుల తోటల్లో అంటు మొక్కలలో కనిపిస్తాయి. ఈ పురుగు నివారణకు అంతర్వాహిక మందులైన మోనో 1.6 మి.లీ. లేదా డైమిథోన్ 2 మి.లీ. లేదా మెటాసిక్స్ 2 మి.లీ. పురుగు చేసే నష్టలక్షణాలను గుర్తించి పిచికారి చేయాలి.
పిండి పురుగులు:
పాల లాంటి తెలుపు రంగులో ఉండే మైనంతో కప్పబడి ఉండే గోధుమ రంగు పురుగు కొమ్మలు, పూకొమ్మలపై గుంపులు గుంపులుగా ఆశించి మొక్కను బలహీన పరుస్తాయి. ఈ పురుగులు లేత కొమ్మలు, ఆకుల నుండి రసం పీల్చుతాయి. ఈ పురుగులు విసర్జించు తేనె లాంటి పదార్థము కొమ్మలపై, ఆకులపై కనిపిస్తుంది. దీనిపై నల్లని బూజులాంటి పదార్థం అభివృద్ధి చెంది కిరణజన్య సంయోగ క్రియను బాగా తగ్గిస్తుంది. తద్వారా మొక్క బలహీనమవుతుంది.
నివారణ చర్యలు:
1. పురుగు ఉధృతి ఎక్కువైనపుడు పురుగు ఆశించిన చెట్టు పాదు లోతుగా కలియ దున్నాలి. తద్వారా భూమిలో ఉండే గ్రుడ్లు మరియు పిల్ల పురుగులు, చీమలు మరియు పక్షుల బారిన పడి చనిపోతాయి.
2. పిల్ల పురుగులు భూమిలో నుండి మొక్క మొదలుపైకి ప్రాకకుండా భూమికి 2-3 సెం. ఎత్తును గ్రీసు లేదా
మెత్తటి నల్లమట్టిని పూసి ఆల్కతీన్ షీట్ను చుట్టాలి.
3. చెట్టు పాదులలో లిండేన్ లేదా కార్బరిల్ పొడి లేదా ఫోరేట్ గుళికలు వేసి నీటి తడివ్వాలి.
4. చెట్టుపై ఆశించిన పురుగుల నివారణకు అంతర్వాహిక మందులైన మోనో లేదా మెటాసిస్టాక్స్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి, 1 మి.లీ. లీటరు నీటికి చొప్పున నువాన్ కలపాలి.
చెదలు: నీటి వసతి సరిగా లేని తేలిక పాటి ఎర్ర చెల్కా నేలలో ఈ చెద పురుగుల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. చెద పురుగులు చెట్టు పాదుల నుండి మొదలై కాండం మొదలు నుండి పైకి చెద పుట్టలను కడుతూ పైకి ఎగబ్రాకుతాయి. ఈ పుట్టలలో ఉంటూ బెరడు, కాండాన్ని తింటాయి. కొమ్మలను కూడా చనిపోతాయి. చెద పురుగుల ఉధృతి ఎక్కువైనపుడు చెట్టు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది.
నివారణ చర్యలు:
1. చెద పురుగుల సమర్థ నివారణకు తోటంతా శుభ్రంగా ఉండాలి. ఎండిపోయిన కొమ్మలు, పెంట లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.
2. చెద పుట్టను గుర్తించి పుట్టను తీసివేసి రంధ్రాలలో లిండేన్ లేదా పురుగు మందు ద్రావణాన్ని పోయాలి. కాండం, కొమ్మలపై చెద పుట్టలను గోనెసంచితో రుద్దుతూ ఏరివేయాలి.
3. లీటరు నీటికి 2 మి.లీ. క్లోరిఫైరిఫాస్ మందు కలిపిన ద్రావణంతో పాదులు, కాండం కొమ్మలు తడిచేట్టుగా పిచికారి చేయాలి. పాదులలో లిండేస్పొడి, 200 గ్రాములు చెట్టుకు చల్లి నీటి తడివ్వాలి.
తెగుళ్ళు :
మామిడిలో ప్రధానంగా బూడిద మరియు మచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి. వాతావరణము తేమతో మంచు పడుతున్న పరిస్థితులలో అనగా మామిడి పూత సమయంలో బూడిద తెగులు ఆశిస్తుంది. లేత ఆకులు, పూలకొమ్మలు, పూలపై తెల్లని బూజు కనిపిస్తుంది. దీని వలన పూలు, కాయ పిందెలు రాలి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. దీని నివారణకు బెయిలిటాన్ 1 గ్రా. లేదా కారథేన్ 1 మి.లీ లేదా నీటిలో కరుగు గంధకము 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మచ్చ తెగులు ఆశించినపుడు ఆకులు, కొమ్మలు, కాయలపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఎం. 45 మందును 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పచికారి చేయాలి.
Also Read: e- Crop App Problems: రైతులకు ఈ క్రాప్ ఇక్కట్లు.!