చీడపీడల యాజమాన్యం

Chilli Insect Pests: మిరప చీడపీడల – యాజమాన్య పద్ధతులు

2
Chilli Farming
Chilli

Chilli Insect Pests: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో సాగు చేసే వాణిజ్య పంటల్లో మిరప ముఖ్యమైనది. మిరపను సుమారుగా 6.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తునారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు జరుగుతున్న దృష్ట్యా ఈ పంటను తొలిదశ నుంచి మలిదశ వరకు వివిధ రకాలైన చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. నాణ్యమైన పంటతొ పాటు అధిక దిగుబడులు పొందాలంటే పంటను ఆశించే చీడపీడలను సకాలంలో గుర్తించడం మరియు వాటి వ్యాప్తికి కారణాలు, అనుకూల పరిస్థితులు వంటి విషయాలపై సరైన అవగాహనకు రావడం చాలా అవసరం. మిరప పంటను ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. కావున తగిన చర్యలు తీసుకోని సరైన యాజమాన్య పద్ధతులు పాటించిన యెడల మిరపలో చీడపీడలను నివారించి అధిక దిగుబడులను పొందవచ్చును.

తామర పురుగులు (పై మడత): వాతావరణం పొడిగా ఉండి, పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. తామర పురుగులు చాలా చిన్నవిగా, సున్నితంగా ఊదారంగులో, చీలిన రెక్కలతో ఉంటాయి. తల్లి, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు మెలి తిరిగి, అంచుల వెంబడి పైకి ముడుచుకుపోతాయి. అందువల్ల దీనిని పై ముడత అంటారు. ఈ ముడత వల్ల మిరప మొక్కల్లో ఆకులు చిన్నవై ఇటుక రంగులో కనిపిస్తాయి. మొక్కలు గిడసబారి పూత రాలుతుంది. పూత పిందెగా మారాడు. లేతకాయలు గిడసబారి చారలు ఏర్పడి కాయల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. నివారణకు సెంటు నారుమడికి 80గ్రా. 0.3% ఫిప్రోనిల్ గుళికలు వేయాలి. నాటిన 15 మరియు 45 రోజులకు ఎకరాకు 25 కిలోల ఫిప్రోనిల్ 0.3జిఆర్ గుళికలు తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. పురుగు ఉధృతిని బట్టి ఎసిటామిప్రిడ్ 20% ఎస్.పి 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.7 మి.లీ. లేదా డైఫెన్ థైయూరాన్ 1.5గ్రా. లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Also Read: వినాయక చవితి రోజున విఘ్నేశ్వరున్ని పూజించవలసిన 21 రకాల పత్రి-విశిష్టత.!

Crop Protection in Chilli

Chilli Insect Pests

తెల్లనల్లి (క్రింది ముడత) :
మిరప నాటిన 40 రోజులకు ఆశిస్తుంది. దీని తీవ్రత 2-3 నెలల పంటకు ఎక్కువగా ఉంటుంది. తల్లి, పిల్లప్ అరుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా గూడు కట్టుకుని రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ఆశించిన ఆకులు క్రింది వైపుకు ముడుచుకొని పోయి తిరగబడిన పడవ ఆకారంలో ఉంటాయి. ఈ పురుగులు ఆశించిన మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఆకుల పెరుగుదల తగ్గి పూత పూయడం నిలిచిపోయి దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగులు ఆశించడం వల్ల కాయతోలు గట్టిపడి తెల్లని చారలు ఏర్పడతాయి. దీని నివారణకు నీటిలో కరికే గంధకం 3గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లేదా ప్రోపార్గైట్ 2.5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పేనుబంక: ఈ పురుగులు వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉండే పిల్ల పురుగులు క్రమేపీ మెరిసే నల్లని పెద్ద పురుగులవుతాయి. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఎండి మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఈ పురుగులు విసర్జించే తియ్యని పదార్థం వల్ల చీమలు చేరతాయి. ఆకు, కాండం, కాయలపై మసి తెగులు వ్యాపిస్తుంది. ఈ పురుగులు ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్క ఎదుగుదల తగ్గి, దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.7 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 25% డబ్ల్యూజి 0.5 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

శనగపచ్చ పురుగు : దీని పిల్ల పురుగులు కాయలకు రంధ్రం చేసి లోపలకు తలను ఉంచి మిగతా శరీరాన్ని బయటే ఉంచి గింజలను తింటుంది. దీని నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి 0.4 గ్రా. లేదా నొవాల్యురాన్ 5.25% + ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.9% ఎస్.సి 1.5 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్ 0.8మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పొగాకులద్దె పురుగు: ఇవి ఆకులపై సమూహాలుగా గ్రుడ్లు పెట్టి వాటిపై గోధుమ వర్ణపు నూగు కప్పుతాయి. పిల్ల పురుగులు మొదట ఆకుపచ్చ రంగులో ఉండి పెరుగుతున్న కొద్దీ ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. ఈ లద్దె పురుగులు ఆకలపై వంకర టింకర రంధ్రాలు చేసి తింటాయి. కాయలను కూడా ఆశించి రంధ్రం చేసి గింజలు తింటాయి. దీని నివారణకు ఆముదం ఏరా పంటను పొలంలో అక్కడక్కడ నాటుకోవాలి. నొవాల్యురాన్ 5.25% + ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.9% ఎస్.సి 1.5 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్ 0.8మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

వేరు పురుగు: మిరప మొక్క వేర్లను, కాండాన్ని తిని నష్టపరుస్తాయి. తిన్న మొక్కలు వడలి, ఎండిపోతాయి. తల్లి పెంకు పురుగు తొలకరి వర్షాల తరువాత భూమిలో గ్రుడ్లు పెడుతుంది. 10-12 రోజుల్లో గ్రుడ్లు పొదిగి తెల్లని పిల్ల పురుగులు భూమిలో తిరుగుతూ మొక్కని నష్టపరుస్తాయి. దీని నివారణకు ఎకరాకు 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 10-12 కిలోల 3% కార్బోఫ్యూరాన్ గుళికలు ఆఖరి దుక్కిలో వేసి భూమిలో కలియదున్నాలి. మరియు క్లోరిపైరిఫాస్ 50 ఇసి 1.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.7 మి.లీ. + ఫిప్రోనిల్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళను తడపాలి.

Also Read: పాలమూరు దశ, దిశను మార్చే ప్రాజెక్టు – మంత్రి

Leave Your Comments

Gypsum Application on Groundnut: వేరుశనగ సాగులో జిప్సం యాజమాన్యం.!

Previous article

Bengal Gram Crop: శనగ పంటలో – సమగ్ర సస్యరక్షణ

Next article

You may also like