చీడపీడల యాజమాన్యం

Fungal Diseases in Crops: శిలీంధ్రాలతో వచ్చే తెగుళ్లు మరియు వాటి తెగులు లక్షణాలు.!

1
Fungal Diseases
Fungal Diseases

Fungal Diseases in Crops: శిలీంధ్రాలు ఆశించిన మొక్కలలో రకరకాల తెగులు లక్షణాలు కనిపిస్తాయి.

నానుడు తెగులు (Damping off): ఈ తెగులు వివిధ రకాల శిలీంధ్రాల వలన, బాక్టీరియా వలన ఆశిస్తుంది. తెగులు సంక్రమిస్తే బాగా మొలకెత్తగల విత్తనాలు కూడా వారు మొక్కలుగా వృద్ధి కావు. మొదటి దశలో విత్తనాలను నాటిన నేలలో మొలకెత్తని ఆవరణను గమనించ వచ్చు. ఇక రెండవ దశలో అంకురం వేసిన నారు మొక్కల కణజాలాలు నేలకు తగిలే కాండం వద్ద నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి, లేత గోధుమ వర్ణానికి మారి కృశించిపోతాయి. ఈ తెగులు వలన మొక్కలు వాడిపోయి చనిపోతాయి. పైన వివరించిన రెండు దశలను విత్తనం మొలవకముందు దశ (Pre-emergence damping off). మొలకెత్తిన తరువాత దశ (Post-emergence damping off), అంటారు.

ఈ తెగులు ప్రీతియం, ఫైటాప్పోరా, పూసేరియం మొదలగు శిలీంధ్ర జాతుల వలన సోకుతుంది. నేలలో సుప్తావస్థలో మన గలిగే వ్యాధి జనకాల వలన, విత్తనాల ద్వారా తెగులు సోకుతుంది.

వేరు కుళ్ళు తుగుళ్ళు (Root rot): ఈ తెగులు వలన వేరుమండలం కుళ్ళు తుంది. దీని ఫలితంగా మొక్కకు అవసరమైన నీరు, పోషక పదార్ధాల సరఫరా ఆగాపోతుంది. మొక్కలు విపత్కర పరిస్థితులకు లోనై వాటి పెరుగుదల నిలిచిపోయి గిడసబారతాయి. ఆకులు పసుపు వర్ణానికి మారి ఎండి రాలిపోతాయి. చివరకు మొక్కల చనిపోతాయి. వేరు కుళ్ళును కలుగజేసే శిలింధ్రాలు వైకల్పిక పరాన్నజీవులుగా, పూతికాహారులుగా నేలలో కూడ జీవించగలవు.

Fungal Diseases in Crops

Fungal Diseases in Crops

Also Read: Integrated Pest Management in Sugarcane: చెఱకు పైరు నాశించు తెగుళ్ల సమగ్ర యాజమాన్య చర్యలు.!

వడలు తెగులు (Wilt): వడలు తెగులులో వేరుమండలాలు విపరీతంగా క్షీణించి ప్రఖండ భాగంలో జరిగే బాష్పాత్సేకానికి సరిపడినంత నీటిని సరఫరా చేయలేనందున మొకకలు వాడిపోతాయి. ఆరంభ చిహ్నంగా మొక్క అధోభాగం లోని పత్రవృంతాలు కిందికి వంగిపోతాయి. ఈ చిహ్నాన్ని అధకుంచితం లేక ‘ఎపినాస్టీ’ అంటారు. కొన్నిసార్లు ఈనెలను అంటుకొని వివర్ణత ఏర్పడుతుంది. అధోభాగంలోని ఆకులు పసుపు వర్ణానికి మారి క్రమంగా ఎండిపోతాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని ఆకులు పగటి పుట వాడి రాత్రికి మళ్ళీ ఆరోగ్యంగా మారుతాయి. చివరకు మొక్కల కాండము చీల్చి చూసినపుడు నాళికా కణజాలాలు వివర్ణమై టైలోసిస్ మరియు జిగురు పదార్థాలతో నిండి ఉంటాయి.

తుగులు (Downy Mildew): ఉష్ణోగ్రత తక్కువగా ఉండి తేమగా ఉన్న వాతావరణ పరిస్థితులలో ఆతిథేయి ఆకులు మీద శిలింధ్రం యొక్క సిద్ధబీజాశయాలు విపరీతంగా ఏర్పడి నందు వలన తెల్లని లేదా బూడిదరంగు నూగువలె కనిపిస్తుంది. పెరనోస్పోరా, ప్లాస్మోపారా మరియు స్త్రీరోస్పోరా అనే శిలీంధ్రాలవలన ఈ తెగులు ఆశిస్తుంది.

బూడిద తెగులు (Powdery mildew): ఆకులపై చిన్నచిన్న పసుపు పచ్చని ప్రదేశాలు కనబడి ఆ ప్రదేశాలలో తెల్లని శిలింధ్రపు పెరుగుదల వలన బూడిద చల్లినట్లుగా మొక్కలు అన్ని భాగాలపై కనిపిస్థాయి. ఎరిసైఫి కుటుంబానికి చెందిన కొన్ని శిలీంధ్రాల వలన ఈ రోగ లక్షణాలు. కలుగుతాయి.

తుప్పు తెగులు (Rust disease) (కుంకుమ తెగులు): ఆతిధేయి మొక్కల మీద ఎరుపు, గోదుమ వర్ణం లేక కొన్నిసార్లు నారింజ రంగులో ఉండే స్పోటకపు మచ్చలు లేకపాక్కులుగా కనిపిస్థాయి. యురిడినేల్స్ క్రమానికి చెందిన కొన్ని శిలింధ్రాల వలన ఈ తెగులు ఆశిస్తుంది.

కాటుక తెగులు (Smut Disease): ఈ తెగులు సోకిన మొక్కలు సాధారణంగా పుష్పించే సమయం వరకు ఎటువంటి తెగుళ్ళ లక్షణాలను చూపవు. పుష్పించినపుడు తెగులు సోకిన మొక్కల పుష్పాలలో విత్తనాలుక బదులుగా నల్లని బొగ్గుపొడిలాంటి శిలీంధ్రపు బీజపుంజాలు ఏర్పడతాయి. మొక్కలలోని శిలీంధ్ర జాలం అంతర్వాహికంగా పుష్పాలలో చేరి తంతుల కణాల నుండి అసంఖ్యాకమైన టెలిటోస్సోలను ఉత్తత్పి చేయడం వలన ఈ సిద్ధబీజ పుంజాలు ఏర్పడతాయి. యుసిలారిజినేల్స్ ప్రజాతికి చెందిన శిలీంధ్రాల వలన కాటుక తెగుళ్ళు ఆశిస్తాయి.

Also Read: Insect Pests Management in Castor Crop: ఆముదం పంటను ఆశించు కీటకాలు – యాజమాన్యం

Leave Your Comments

Integrated Pest Management in Sugarcane: చెఱకు పైరు నాశించు తెగుళ్ల సమగ్ర యాజమాన్య చర్యలు.!

Previous article

Techniques in Paddy Drying: ధాన్యం ఆరబెట్టుటలో కొన్ని మెళుకువలు.!

Next article

You may also like