సేంద్రియ వ్యవసాయం

Organic Fertilizers Preparation: సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారీ విధానం.. సహజ పద్ధతుల్లో సస్య రక్షణ.!

1
Organic Fertilizers
Organic Fertilizers

Organic Fertilizers Preparation: ఇటీవల కాలంలో పంట సాగు గిట్టుబాటు కాక ఆర్ధికంగా నష్టాల బారిన పడుతున్నారు. పంట పెట్టుబడి వ్యయంలో 50% పైగా రాసాయనిక ఎరువులు మరియు పురుగుమందులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.కొన్ని విధాలైన ద్రావణాలు,కాషాయాలుతయారు చేయు విధానం గురించి తెలుసుకుందాం.

పచ్చి మిర్చి వేప వెల్లుల్లీ – పొగాకు ద్రావణం

కావలిసిన పదార్ధాలు: ఎకరాకు
వేప ఆకులు – 2 కిలోలు
వెల్లుల్లీ పాయలు -1 కిలో
ఆవు మూత్రం – 5 లీటర్
పొగాకు రద్దు – 1 కిలో
పచ్చి మిర్చి -1 కిలో

తయారు చేసే విధానం:
వేపాకులు, వెల్లులి పాయలు , పచ్చి మిరపకాయలను మెత్తగా ముద్ద చేయాలి.
పై విధంగా చేసిన ముద్దను, పొగాకు రద్దును 10 రోజుల పాటు 5 లీటర్ల ఆవు మూత్రంలో నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని 10 రోజుల తర్వాత వడపోసి, దానికి 200 లీటర్ల నీరు కలిపి, ఒక ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. కషాయాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయరాదు.

ఉపయోగాలు: శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్ర గొంగళి పురుగు, కాయతొలిచే పురుగు, ఆకుముడత పురుగును నివారించడానికి ఉపయోగపడుతుంది.
కుళ్ళిన పండ్లు లేక కూరగాయలు మిశ్రమ ద్రావణం
కావలసిన పదార్ధాలు ( ఎకరాకు )
ఆవు పేడ =10 కిలోలు
కుళ్ళిన పండ్లు లేక కూరగాయలు -10 కిలోలు
నీరు – 100 లీటర్లు.

తయారు చేసే విధానం
ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పైన సూచించిన పదార్ధాలు వేయాలి. ప్లాస్టిక్ డ్రమ్మకు మూత పెట్టి నీడలో 10 రోజుల వరకు ఉంచాలి.
డ్రమ్ములో మిశ్రమాన్ని ప్రతి రోజు కర్రతో బాగా కలపాలి.
తర్వాత మిశ్రమాన్ని వాడపోయాలి.
ఈ ద్రావణం ఒక ఎకరా పొలంలో నీటి ద్వారా పారించాలి.

ఉపయోగాలు:  ఈ ద్రావణం భూమిలో ఉండే సూక్ష్మ జీవులకు , వాన పాములకు ఆహారంగా ఉపయోగపడి పంటకు ఆరోగ్యవంతంగా పెరగడానికి తోడ్పాడుతుంది.

తూటి కాడ కాషాయం:
తూటి కాడ ఆకులు -10 కిలోలు
ఆవు మూత్రం -15 లీటర్లు

తయారు చేసే విధానం: మొదట 10 కిలోల తూటి కాడ ఆకులను తీసుకోని బాగా మెత్తగా దంచాలి. ఇప్పుడు మెత్తగా దంచిన తూటి కాడ ఆకులను 15 లీటర్లు ఆవు ముత్రాన్ని కలుపుకోవాలి. పై రెండింటిలో మిశ్రమాన్ని ఒక కుండాలో పోసి ఉడకబెట్టాలి. ఉడకపెట్టి న మిశ్రమాన్ని బాగా చల్లారా నివ్వలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి బాగా కలియబెట్టాలి.

ఉపయోగాలు: తూటి కాడ కాషాయం ముఖ్యంగా సుడి దోమ నివారణకు బాగా పనిచేస్తుంది.

Organic Fertilizers Preparation

Organic Fertilizers Preparation

Also Read: Weed Free Garden: మీ కూరగాయల పంటల్లో కలుపు సమస్య ఉందా? అయితే దాన్ని ఎలా నివారణ చేయాలో తెలుసుకోండి.!

ద్రవ జీవామృతం

కావాల్సిన పదార్ధాలు:
ఆవు పేడ -10 కిలోలు
నల్ల బెల్లం – 2 కిలోలు
పప్పు దినుసుల పిండి – 2 కిలోలు
ఆవు మూత్రం -10 లీటర్

తయారు చేసే విధానం:
ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీరు తీసుకోవాలి.
దానికి 10 కిలోల ఆవుపేడ కలిపి , కర్రతో బాగా కలియబెట్టాలి.

ఈ మిశ్రమాన్ని మెత్తగా పొడి చేసిన బెల్లం, శనగపిండి కలపాలి.
దానికి 10 లీటర్ల పశువుల మూత్రాన్ని పిడికెడు మట్టిని కలిపి కర్రతో బాగా కలియబెట్టాలి.

పాత్ర పై గోనే సంచి కప్పి ఉంచి, ప్రతి రోజు 3-4 సార్లు కలియబెట్టాలి. ఈ ద్రావణాన్ని ఈ విధంగా 4 రోజులు పులియా బెట్టాలి. దీన్ని 3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

ఉపయోగాలు: అన్ని పంటలకు ఉపయోగించవచ్చు. పెరుగుదలకే కాకుండా చీడ పీడల రానివ్వదు. పండ్ల తోటలకు, ప్రతి చెట్టుకు 2-5 లీటర్ల ద్రవ జీవామృతం భూమి పై చల్లాలి. చెట్టు చుట్టూ నీడ పడే పరధిలో చల్లుకోవాలి.

పసుపు దుంప కాషాయం: ఒక కిలో పసుపు దుంపలను తీసుకోని వాటిని మెత్తగా పొడి చేయాలి.ఈ పొడికి 5 లీటర్ల ఆవు మూత్రాన్ని బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని పలుచటి గుడ్డలో వాడపోసి 100 గ్రా. ల సబ్బు పోడిని కలపాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్లు నీటితో కలిపి ఒక ఎకరాకు సాయంత్రం పూట పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: పంటల్లో వచ్చే బూడిద తెగులు నివారించబడుతుంది.

Also Read: Insect Pest Management in Grapes: ద్రాక్ష పంటను ఆశించే తెగుళ్ళు వాటి గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయి? వాటి నివారణకు ఏం చేయాలి.!

Leave Your Comments

Wood Apple Unknown Facts: వెలగపండు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు.!

Previous article

Kiwi Fruits Health Benefits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివి ఫ్రూట్స్ గురించి తెలుసుకోండి.!

Next article

You may also like