సేంద్రియ వ్యవసాయం

Organic Manure from Cotton Plant: పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ.!

0
cotton Plant
cotton Plant

Organic Manure from Cotton Plant: పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సి రావడంతో హరితవిప్లవం నుంచి నేటి వరకు కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై మాత్రమే దృష్టిసారించి నేల ఆరోగ్యాన్ని కాపాడటాన్ని నిర్లక్ష్యం చేశాం. నేల స్థితిగతులను తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగం ఎంతైనా అవసరం. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలంటే వాటి లభ్యతను పెంచాలి.

వ్యవసాయ వ్యర్థాల సద్వినియోగం: మనదేశంలో ఏటా 3000 మి.టన్నుల సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్త వుతున్నట్లు అంచనా. దీనిలో 340 మి. టన్నుల వ్యవసాయ వ్యర్థాలు రైతుకు అందుబాటులో ఉండి, ఉచి తంగా లభించే సేంద్రియ సంపద అని చెప్పుకోవచ్చు.

Organic Manure from Cotton Plant

Organic Manure from Cotton Plant

పంట అవశేషం అంటే మొక్కలో ఉపయోగంలేని భాగం లేదా పంటకోసిన తర్వాత మిగిలిన మోళ్ళు లేదా చెత్తా చెదారం అని అర్థం. కాని ప్రస్తుత కాలంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణ చూశాక భవిష్యత్తులో పంట అవశేషాలకు పంట ఉత్పత్తుల కంటే ఎక్కువ డిమాండ్ పెరిగేలా ఉంది. భూసార పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయానికి ఇవి మూలాధారం అనడంలో అతిశయోక్తి లేదు.

పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ: రైతులకు అందుబాటులో చాలా రకాల వ్యవసాయ వ్యర్థాలు ఉన్నప్పటికీ అవి ఎలా సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలో ఇప్పటికే మనకు కొంతవరకు తెలుసు. ఉత్తర తెలంగాణ ప్రాంతం, కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో పత్తిని విరివిగా పండిస్తు న్నారు. పత్తి పంటలో ఎకరానికి దాదాపు ఒకటిన్నర నుంచి రెండు టన్నుల పత్తి కట్టె లభిస్తుంది. ఇలాంటి విలువైన పత్తి కట్టెను రైతులు వృథాగా కాల్చివేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం లభించే పత్తి కట్టెను ఉపయోగించి సేంద్రియ ఎరువును రెండు రకాలుగా తయారు చేయవచ్చు. అవి

· వానపాములను ఉపయోగించి కంపోస్టు తయారీ

· శిలీంద్ర సముదాయాన్ని ఉప యోగించి కంపోస్టు తయారీ

వానపాములను ఉపయోగించి పత్తి కట్టెతో కంపోస్టు తయారీ: పత్తి పంటలో మొత్తం పత్తి ఏరటం ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అయిపోతుంది. పత్తి ఏరిన తర్వాత ఏప్రిల్ నెలలో పత్తి మొక్కలను వేరుతో సహా ట్రాక్టర్తో పీకించి ఒక దగ్గర చేర్చిన తర్వాత ట్రాక్టర్లోనే పోగుచేసిన కట్టెను తొక్కించాలి. దీని వల్ల పత్తి కట్టె ముక్కలవుతుంది. నీటి వసతి ఉన్న దగ్గర ఇటుక లతో 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 30 నుంచి 50 అడుగుల పొడవున్న తొట్టెలను కట్టుకోవాలి. ర తొట్టె అడుగుభాగం గట్టిగా ఉండటా నికి ఇటుక ముక్కలు, కొబ్బరిపీచు, రంపపు పొట్టు లేదా మొరం మట్టి పోసి గట్టిగా చేయాలి. వానపాము లకు ఎండ తగలకుండా, వానపడ కుండా తొట్టెలపై షెడ్ వేసుకోవాలి.పత్తి కట్టె ముక్కలను తొట్టెల వద్దకు చేర్చుకొని పెట్టుకోవాలి. రైతుల వద్ద సాధారణంగా రెండు లేదా నాలుగు ఎడ్లు ఉంటాయి. వీటి నుంచి వచ్చే వారం రోజుల పేడను పోగుచేసి ఉంచుకోవాలి.

Also Read: Green Manure Crops: పచ్చి రొట్ట ఎరువులు – సాగులో మెళకువలు అవరోధాలు.!

ఈ విధంగా పత్తి కట్టె ముక్కలు, పేడను సిద్ధం చేసుకొన్న తర్వాత వీటిని తొట్టెల్లో నింపాలి. మొదట ఒకడుగు మందం వరకు పత్తికట్టె ముక్కలను నింపి వాటిపై పేడ నీటిని పోస్తూ, తడపాలి.పత్తి కట్టెను తొట్టెలో పేర్చి వేడ నీరు కలుపుతూ మళ్లీ ఒకడుగు మందం పత్తి కట్టె ముక్కలను నింపి పేడ నీటితో తడపాలి. ఈ విధంగా తొట్టె పైన ఒక అడుగు ఎత్తు వరకు పత్తి కట్టె ముక్కలను నింపాలి.

Cotton Plant

Cotton Plant

చివ రగా చిక్కటి పేడను పత్తి కట్టె ముక్కలపై పోసి కొద్ది పాటి నీటితో తడుపుతూ తొట్టెలో ఎప్పుడు తేమగా ఉండేలా చూడాలి. నీరు మరీ ఎక్కు వగా పోయరాదు. దాదాపు 20-25 రోజుల్లో పత్తి కట్టె ముక్కలు కుళ్ళి పోయి వానపాములు తినటానికి అనువుగా, మెత్తగా మారతాయి. ఇప్పుడు తొట్టెలో దాదాపు 20 కిలోల వానపాములను వదలాలి. 20-25 రోజుల్లో వానపాములు కుల్లిన పత్తి కట్టెను తింటూ నాణ్యమైన వర్మికంపోస్టుగా మారుస్తాయి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం

Must Watch:

Leave Your Comments

Health Benefits of Drumsticks: మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగ కాయల గురించి తెలుసా?

Previous article

Grape Cultivation: ద్రాక్ష సాగులో వేరు మూలాల ఎంపికలో సూచనలు.!

Next article

You may also like