రైతులు సాగు చేసే ప్రధానమైన వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. మిరపను వండర్ స్పైస్ లేదా ఎర్ర బంగారం అని కూడా పిలవడం జరుగుతుంది. మిరపను రైతులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ, మంచి దిగుబడును సాధిస్తున్నారు. మిరపలో మంచి దిగుబడులు వస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో దిగుబడులు చాలా వరకు రావట్లేదు. దీనికి కారణం మిరపలో ఆశించే వివిధ రకమైన పురుగులు మరియు తెగుళ్లు. మిరపలో ఆశించే రకరకాల తెగుళ్లలో ‘‘కాయ కుళ్ళు’’ తెగులు ఆశించడం వలన అధిక స్థాయిలో పంటకు నష్టం చేకూరుతుంది. ప్రస్తుత వాతావరణ మార్పుల ధృష్ట్యా మిరపలో కాయ కుళ్ళు తెగులు ఆశిస్తున్నట్లు గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో మిరపలో ఆశించే కాయ కుళ్ళు తెగులు లక్షణాలు మరియు యాజమాన్యం గురించి వివరించడం జరిగింది.
కాయ కుళ్ళు గుర్తింపు లక్షణాలు :
. ఈ తెగులు కొల్లెటోట్రైకమ్ క్యాప్సిసి (%జశీశ్రీశ్రీవ్శ్ీతీఱషష్ట్
. ఈ తెగులు నవంబర్, డిసెంబర్ మాసాల్లో లేత కొమ్మలకు మరియు పుష్పాలకు ఆశిస్తుంది.
. ఈ తెగులు మొదట పుష్పాలకు ఆశించి క్రమంగా కాండం కొమ్మలకు వ్యాపిస్తుంది.
. కొమ్మల బెరుడు పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు పెద్దవైన తర్వాత మచ్చల మధ్య భాగంలో శీలింధ్ర బీజాలు వలయంగా ఉంటాయి.
. తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి కిందికి వడలి ఎండిపోతాయి.
. ఈ శీలింధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినప్పుడు కాయలపై ముదురు గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి.
. తెగులు కాయలను ఆశించినప్పుడు కాయలు కుళ్ళిపోతాయి.
. కాయల మీద ఏర్పడిన నల్ల మచ్చలో శీలింధ్ర బీజాలు గమనించవచ్చు.
. భారతదేశంలో ఈ తెగులు ఆశించడం వలన ఒక్కోసారి 8 నుండి 60 శాతం వరకు నష్టం చేగురుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
. ఈ తెగులు ఆశించడం వలన కాయలకు నష్టం చేకూరి, కాయ నాణ్యత తగ్గడం, కాయల ధర తగ్గడం మరియు తెగులు యాజమాన్యం కోసం అధిక సార్లు మందుల పిచికారి చేయడం వలన రైతుల ఖర్చు పెరిగే అవకాశముంటుంది.
Read More: మిరపలో విత్తనశుద్ధి – నారుమడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
తెగులు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు :
. ఈ తెగులు ముఖ్యంగా గాలిలో తేమశాతం అధికంగా ఉండటం మరియు అధిక వర్షాలు పడుతున్నట్లయితే ఉధృతి అధికంగా ఉండే అవకాశముంటుంది.
. భూమిలో అధిక తేమ శాతం, మురుగునీరు పోని సౌకర్యం లేనప్పుడు కూడా తెగులు పెరిగే అవకాశముంటుంది.
యాజమాన్యం
. మంచి నాణ్యమైన విత్తనాన్నే వాడాలి.
. నాటు వేసే ప్రదేశం అనేది శుభ్రంగా ఎలాంటి కలుపు మరియు చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి.
. విత్తనాన్ని ట్రైకోడెర్మా విరిడి అని జీవ శీలింధ్రంతో కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేయాలి.
. తొలి దశలో తెగులు ఆశించిన మొక్కలను, కాయలను నాశనం చేయాలి.
. పంటలో అధిక తేమ శాతం లేకుండా, మురుగునీరు బయటకు పోయే సౌకర్యం ఏర్పరచాలి.
. పంటని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమగ్ర కలుపు యాజమాన్యం మరియు శుభ్రంగా ఉంచుకోవాలి.
. ఒకే రకమైన తెగుళ్ల మందులను అధికసార్లు పిచికారి చేయకూడదు.
. సస్యరక్షణ తెగుళ్ల మందులైన, కాపర్‌ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కాప్టాన్ 1.5 గ్రా. లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2.5 గ్రా. లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ. లేదా డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్ 1 మి.లీ. లేదా పైరాక్యూలోస్ట్రోబిన్‌ంమెటిరామ్
. సస్యరక్షణలో భాగంగా, పైన తెలిపిన మందులను మారుస్తూ, పంట పూత దశకి వచ్చే ముందు ఒకసారి, రెండవసారి కాయ దశలో మరియు రెండవసారి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత మూడోసారి పిచికారి చేస్తే కాయకుళ్ళు ఉధృతి తగ్గించే అవకాశముంటుంది.
ఈ క్రమంలో రైతులు తెగులు గుర్తింపు లక్షణాలను గుర్తించి, సకాలంలో సరైన యాజమాన్యం పద్ధతులను పాటిస్తే కాయకుళ్ళు ఉధృతిని తగ్గించుకొని మంచి దిగుబడులు పొందే అవకాశముంటుంది.
డా. కె. రవి కుమార్, డా. ఎ. శైలజ,
డా. వి. చైతన్య, డా. డి. నాగరాజు,
డా. జెస్సీ సునీత, శ్రీమతి
పి.ఎస్.ఎం ఫణిశ్రీ, కృషి విజ్ఞాన కేందం, వైరా.