Make Compost at Home: రైతులు గత కొన్ని సంవత్సరాలుగా రసాయన ఎరువులు వాడుతున్నారు. రసాయన ఎరువులు వాడటం వల్ల రెండు మూడు సంవత్సరాలు మంచి దిగుబడి వచ్చి, నేల సారం మొత్తం తగ్గించాయి. నేల సారం తగిపోయే, పంటల దిగుబడి తాగింది. దానితో రైతులు అందరూ సేంద్రియ పద్దతిలోనే వ్యవసాయం మళ్ళీ మొదలు పెట్టారు. రైతులు కొందరు వారి సొంతగా ఎరువులు తయారు చేసుకుంటున్నారు. కానీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పర్వత్ రెడ్డి నగర్ కర్నూల్ రైతు చాలా సులువైన పద్దతిలో పశువుల కంపోస్ట్ తయారు చేస్తున్నారు.
పర్వత్ రెడ్డి రైతు 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంతో పాటు 100 పశువులని పెంచుతున్నారు. వాటి వ్యర్థాలని కంపోస్టుగా సులువైన పద్దతిలో తయారు చేసుకొని తన పొలంలో వేసుకుంటున్నాడు. దాని వల్ల పంట దిగుబడి పెరిగి, నెల నాణ్యత కూడా పెరుగుతుంది.
Also Read: Agriculture Trolley: వ్యవసాయ పనులు సులువు చేయడానికి ఈ ప్రత్యేకమైన ట్రాలీ…

Make Compost at Home
కంపోస్ట్ తయారు చేసుకోవడానికి బెడ్ లేదా సమానమైన స్థలం ఉండాలి. పశువుల పేడని ఒక లేయర్గా వేసుకోవాలి. తర్వాత నీళ్లు చిలకరించుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ పేడని వేసుకోవాలి. ఇలా చేయడం చాలా శ్రమ, ఖర్చుతో కూడిన పని. ఈ రకమైన కంపోస్ట్ తయారీకి ఎక్కువ మంది కూలీ వాళ్ళు అవసరం.
పర్వత్ రెడ్డి రైతు ఈ ప్రక్రియని సులువు చేశాడు. పొలంలో 5-10 అడుగుల గుంత తొవ్వుకోవాలి. అందులో రోజు పశువుల నుంచి సేకరించే పేడని అందులో వేసుకోవాలి. ఈ పేడ గుంతలో భూమి వేడికి కంపోస్ అవుతుంది. దీనికి మళ్ళీ ఎలాంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.
ప్రతి రోజు పేడని వేయడం ద్వారా ఆ గుంతలోనే పేడ కంపోస్ అవుతుంది. పోలంకి ఎరువుగా వాడుకోవాలి అనుకున్నపుడు మాత్రమే ఈ గుంతలో నుంచి తీయడానికి జెసిపి సహాయంతో బయటికి తీయాలి. అప్పుడు మాత్రమే కొంచం ఖర్చు అవుతుంది. సాధారణ కంపోస్ట్ తయారీ కంటే ఈ కంపోస్ట్ తయారీకి ఖర్చు చాలా తక్కువ. రైతులు అందరూ ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటే కంపోస్ట్ తయారీకి ఖర్చు తాగించుకోవచ్చు. పొలంలోని నేల కూడా సారం కూడా పెరుగుతుంది.
Also Read: Lily Cultivation: ఈ కొత్త పరికరంతో సంపంగి పువ్వుల తోటలో కలుపుని సులువుగా తీయవచ్చు.!