జాతీయంసేంద్రియ వ్యవసాయం

బీజామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి ?

0
             విచక్షణారహితంగా సస్యరక్షణ మందులు వాడటం వల్ల పంటఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు మిగిలిపోయి ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆహార శైలిలో మార్పుల వల్ల వినియోగదారులు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పశుపోషణ భారంగా మారడంతో పశువుల ఎరువు వంటి సేంద్రియ ఎరువులు చాలినంతగా దొరకడం లేదు. దీంతో రైతులు తమకు  అవసరమైనప్పుడు తయారు చేసుకునే విధంగా వివిధ ద్రవ సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఆ కోవలోకి చెందినదే బీజామృతం ద్రవసేంద్రియ ఎరువు.
            ఈ బీజామృతం ఎరువులో వివిధ స్థూల, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, హార్మోన్లు, ఇతర ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు లభిస్తాయి. బీజామృతాన్ని విత్తన శుద్ధికి వాడుకోవడం వల్ల పంట పెరుగుదల బాగా ఉంటుంది. పంట దిగుబడి పెరిగి రైతుకు అధిక ఆదాయం వస్తుంది.
బీజామృతం తయారీ:
        బీజామృతం తయారీకి నీరు 20 లీటర్లు, పశువుల పేడ 5 కిలోలు, పశువుల మూత్రం 5 లీటర్లు, సున్నం 50 గ్రాములు కావాలి.
విధానం:
సుమారు 5 కిలోల పశువుల పేడను పల్చటి గుడ్డలో తీసుకొని 20 లీటర్ల నీటితో ఉన్న బకెట్లో 12 గంటల పాటు వేలాడగట్టాలి. ఒక లీటరు నీటిలో 50 గ్రాముల సున్నం వేసి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు గుడ్డలో నానబెట్టి ఉంచిన పేడను గట్టిగా నీటిలోకి పిండుకోవాలి. దీనిలోకి ఐదు లీటర్ల పశువుల మూత్రాన్ని, నానపెట్టి ఉంచిన సున్నాన్ని కలుపుకొని బాగా కలుపుకోవాలి. మూడు, నాలుగు రోజులలోపు ఈ ద్రావణాన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు.
Leave Your Comments

వరిలో సన్నగింజ రకాలు…తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు రూ.500 బోనస్

Previous article

రబీలో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం !

Next article

You may also like