Good News for Farmers: ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలలో జరిగిన చర్చలలో ఈ సంవత్సరం సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులని ప్రత్యేక ప్రోత్సహం ఇస్తుంది.
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి బడ్జెట్లో 6018 కోట్ల నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఐసిఏర్ నుంచి ఏర్పాటు అయిన వ్యవసాయ విశ్వవిద్యాయాల కోర్సులలో సహజ ,సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ గురించి సిలబస్లో చేర్చేలా విధులు ప్రారంభించారు. కెవికె శాస్త్రవేత్తల నుంచి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Cotton Crop: ప్రస్తుత వర్షాలకు ప్రత్తి పైరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Good News for Farmers
సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకి అవసరం ఉన్న ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పై అందించనున్నట్లు చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ మిషన్ ఆన్ న్యా చురల్ ఫార్మింగ్ ద్వారా కూడా సహజ వ్యవసాయం రైతులకి ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా సహజ వ్యవసాయ సాగు చేసే భూమి విస్తారం పెంచుతున్నారు. 2013-2014 సంవత్సరంలో 11 లక్షల హెక్టర్లు ఉన్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేశారు, ప్రస్తుతం 69 లక్షల హెక్టర్లు పెరిగింది.
సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా మట్టిలోని సూక్ష్మ పోషకాలు పేరుతాయి. వీటి ద్వారా నీరు, గాలి మట్టిలోకి బాగా వెళ్లి మొక్కలు తొందరగా పెరగడానికి తోడ్పడుతుంది. దాని వల్ల రైతుల కూడా మంచి దిగుబడి వచ్చి, లాభాలు కూడా పేరుతాయి.
Also Read: Poultry Farm Loans: కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.50 లక్షలు ఇస్తున్న కేంద్రం.!