Natural Farming: రైతులు పండించిన పంట దిగుబడి మంచిగా రావాలి అని ఎక్కువ ఎరువులు చల్లుతారు. ఎక్కువ మోతాదులో ఎరువులు, మందులు వెయ్యడం ద్వారా దిగుబడిలో మార్పు లేదు కానీ రైతుకు పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరిగిన కూడా మార్కెట్లో పండించిన పంటకి గిట్టుబాటు ధర రావడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. దీని కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయాని వదిలి వేరే ప్రదేశంలో పనులకి వెళ్తున్నారు. కానీ పశ్చిమగోదావరి జిల్లా రైతులు పెట్టుబడి తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
ఈ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయాలని పండిస్తున్నారు. బెండ సాగులో మంచి దిగుబడి వస్తుంది. ఇందులో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తి వస్తుంది. ప్రకృతి సాగు విధానంలో వ్యవసాయంలో మంచి మార్పులు వస్తున్నాయి. దీనితో ఇతర రైతులు కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
Also Read: Mist Blower Sprayer: ఎరువులు వృధా కాకుండా ఉండాలంటే ఈ పరికరాన్ని వాడాల్సిందే.!
ఎక్కడి రైతులు వారికి ఉన్న భూమిలో కొంత భాగం బెండ కాయలని సాగు చేస్తున్నారు. ఎలాంటి ఎరువులు పురుగుమందులు వాడకుండా బెండ కాయలని సాగు చేశారు. పశువుల ఎరువు, అక్కడ దొరికే ఆకులతో కషాయాలను తయారు చేసి పంటకు పిచికారి చేస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వారా దిగుబడి పెరిగింది.
దిగుబడితో పాటు బెండ కాయ నాణ్యత కూడా పెరిగింది. వచ్చిన దిగుబడిని కొంత మంది రైతులు సొంతంగా అమ్ముకుంటున్నారు. కొంత మంది రైతులు మార్కెటింగ్ వాళ్ళతో కాంట్రాక్టు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఎక్కడి రైతులకి ఒక ఎకరం బెండ కాయలని సాగు చేస్తే దాదాపు 2 లక్షలు ఆదాయం వచ్చింది.
ప్రకృతి వ్యవసాయం ద్వారా సేద్యం చెయ్యడం వల్ల నేల నాణ్యత పెరిగి రెండో పంటకి కూడా దిగుబడి మంచిగా వస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో పంటకి చీడ పురుగుల వ్యాపించడం కూడా తక్కువగా ఉంటుంది.
Also Read: Trellis Method: పందిరి పంటలు ఒక చోటు నుంచి మరో చోటికి తరలించుకొని సాగు చేసే విధానం మీకు తెలుసా…