అంతర్జాతీయంసేంద్రియ వ్యవసాయం

Organic Farming Products: ప్రపంచ మార్కెట్‌లో సేంద్రియ పంటలకు గిరాకీ ఎక్కువ.!

2
Organic Farming Products
Organic Farming Products Demand

Organic Farming Products: 1961 వరకు తిండి గింజలను విదేశాల నుండి దిగుమతి చేసుకొనే దయనీయ స్థితి నుంచి ఎగుమతి చేయగలిగిన పరిస్థితికి మనం వచ్చాము. దేశాన్ని సుసంపనం చేసిన ఘనత భారత రైతన్నది, హరిత విప్లవం తర్వాత రసాయన ఎరువులను కుమ్మరించడంతో సాగులో అనేక సమస్యలు రైతులకు సవాలును విసురుతున్నాయి. వ్యవసాయంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో చీకటిలో వెలుగు రేఖల రైతుకు అభయ హస్తాన్ని అందించింది ప్రకృతి వ్యవసాయం. పాతతరం వ్యవసాయాన్ని గుర్తుచేస్తూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన భరోసానిస్తోంది సేద్యం. ప్రాకృతిక, సహజ సేద్యానికి పునరుజ్జీవం పోసిన మహామహులు ఎందరెందరో, ప్రకృతికి జీవితాలని అంకితం చేసి పంచభూతాల ధర్మ తత్వాలను అవగతం చేసుకొని భూమాతకు ముప్పులేని సహజ సాగు విధానాలను పరిచయం చేసిన వారెందరో ఈ సేద్యంలో ఉన్నారు..

పండించిన పంటలకు బ్రాండింగ్‌

ఆధునిక పోకడలకు అద్దంగా నిలుస్తున్న వ్యవసాయ విధానానికి చెల్లుచీటి తప్పదనిపిస్తున్నది. రసాయనాలు, ఎరువులను మోతాదు కంటే ఎక్కువగా ఉపయోగించి పండించిన పంటలకు మార్కెట్లో గిరాకీ తగ్గే పరిస్థితులను మనం కల్పించుకుంటున్నాము. పుడమితల్లికి చేవనిచ్చే ఎరువులను కాకుండా రసాయనిక ఎరువులను విపరీతంగా వాడి పండించిన పంటలతో రోగాలను కొన్ని తెచ్చుకుంటున్నామని నిపుణుల అభిప్రాయం.

Organic Farming Products

Organic Farming Products

Also Read: Indian Tea Prices: భారతీయ తేయాకు ధరలు తగ్గుముఖం.!

ప్రకృతిలో దొరికే వాటితో సేంద్రియ వ్యవసాయం చేసి దిగుబడులను సాధించాలని నిపుణులు కోరుతున్నారు. రైతులకు అందుబాటులో ఉన్న వాటితోనే ఎరువులను తయారు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తే అన్నదాతలకు మంచి నాణ్యమైన దిగుబడులు రావడం ఖాయమని అంటున్నారు. రైతులు పండించిన పంటలకు బ్రాండింగ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంటుదని నిపుణులు సూచిస్తున్నారు.. సేంద్రియ సాగు ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్‌ చేసుకోవడం కోసం సేంద్రియ సర్టిఫికేషన్‌ ను వ్యవసాయ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌ పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా చేసుకోవచ్చు.

మార్కెట్‌లో మంచి గిరాకీ

సేంద్రియ వ్యవసాయం అనేది రాష్ట్రంలో కొద్ది మంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. సాధారణంగా పండించే పంటల కంటే సేంద్రియ ఎరువులు వాడి పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. మెట్ట ప్రాంత రైతులు వారి సొంత అవసరాలు, మార్కెట్‌ అవసరాల దృష్ట్యా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లినట్లయితే లాభదాయకంగా ఉంటుందనేది నిపుణుల సలహా ఇస్తున్నారు. మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫెస్టిసైడ్స్‌ రహిత పంటలు పండించినట్లయితే రైతులకు లాభం చేకూరడంతో పాటు ప్రజలకు ఆరోగ్యదాయకంగా ఉంటాయి. పంటలు వేస్తున్న సేంద్రీయం తోనే చేయాలని అధికారులు కోరుతున్నారు.

Also Read: Bullet Tractor: బుల్లెట్ ట్రాక్టర్ తో సేద్య ఖర్చులు ఆదా.!

Leave Your Comments

Indian Tea Prices: భారతీయ తేయాకు ధరలు తగ్గుముఖం.!

Previous article

Youth and Agriculture: వ్యవసాయ పనుల్లో బిజీగా విద్యార్థులు, కూలీలకు పోటీగా నాట్లు.!

Next article

You may also like