మన వ్యవసాయం

Nutrient Deficiencies in Banana – Prevention : అరటిలో పోషక పదార్ధ లోపాలు – నివారణ

0

బి. జ్యోతిర్మయి, టి. బేబిరాణి
ఉద్యాన కళాశాల, మోజెర్ల, ఫోన్‌ :

మానవులు జీవించడానికి ఆక్సిజన్‌, నీరు, ఆహారం ఎలా అయితే ముఖ్యపాత్ర వహిస్తాయో అలాగే ఆరోగ్యవంతమైన మొక్కల పెరుగుదలకు కూడా సూక్ష్మ పోషకాలు కూడా అంతే ప్రాధాన్యత వహిస్తాయి. సూక్ష్మ పోషకాలు అనగా మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో కావలసిన పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. మొక్కల ఆరోగ్యవంతమైన జీవనానికి మరియు అధిక దిగుబడులు సాధించడానికి 16 మూలకాలు అవసరం.

అరటిలో ముఖ్యపాత్ర పోషించే సూక్ష్మ పోషకాలు :
1. పొటాష్‌
2. జింక్‌
3. బోరాన్‌
4. గంధకం
5. ఇనుము
6. మాంగనీస్‌


పొటాష్‌ లోప లక్షణాలు :
శీతాకాలంలో పొటాష్‌ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుల అంచుల వెంబడి పసుపు వర్ణం గా మారి, క్రమేపి ఆకు మొత్తం పండిపోయి ఎండిపోతాయి.
నివారణ :
. మొక్కకు 80 గ్రా. చొప్పున మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను 40 రోజుల వ్యవధితో 4 దఫాలు వేసుకోవాలి.
. ఆకులపై 5 గ్రా. సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ లీటరు నీటికి కలిపి 7-10 రోజుల తేడాతో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.


2. జింకు థాతు లోప లక్షణాలు :
. ఆకుల ఈనెల వెంబడి తెల్లని చారలు ప్రారంభమై ఆకులు పాలిపోయినట్లు కనబడతాయి.
. ఆకుల అడుగు భాగాన ముదురు ఊదా రంగు ఏర్పడుతుంది. ఒక్కొక్క మొక్కకు 10 గ్రా. జింకు సల్ఫేట్‌ భూమిలో వేయాలి.
. ఆకులపై 2 గ్రా. జింకు సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.


3. బోరాస్‌ థాతు లోప లక్షణాలు :
. ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా ఉండి, ఆకులు బిరుసుగానూ, పెళుసుగాను ఉండును.
. ఆకులపై నిలువగా చారలు ఏర్పడతాయి.
నివారణ :
0.1% బొర్డాక్స్‌ మందును ఆకులపై 10 రోజుల తేడాతో 2 సార్లు పిచికారీ చేయాలి.

Read More: ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్.!


4. గంధకం లోప లక్షణాలు :
కొత్తగా వచ్చు లేత ఆకులు బాగా లేత రంగులో ఉండి, ఆకు పచ్చ రంగుకు మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
నివారణ :
ఒక్కొక్క మొక్కకు 100 గ్రా. అమ్మోనియం సల్ఫేట్‌ను భూమిలో వేయాలి.


5. ఇనుము థాతు లోప లక్షణాలు :
. ఇనుము ధాతువు లోపించినపుడు లేత ఆకులు తెలుపు చారలతో ఉంటాయి.
. ఇనుము థాతు లోపం అధికంగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారి క్రమేపి ఎండిపోతాయి.
. మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది.
నివారణ :
అన్నభేది 3 గ్రా. G నిమ్మ ఉప్పు 1 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి అరటి ఆకులు పూర్తిగా తడిసేలా 10 రోజుల వ్యవధిలో సార్లు, ఇనుప థాతు లోపాన్ని నివారించవచ్చు


6. మాంగనీసు థాతు లోప లక్షణాలు :
. మాంగనీసు థాతు లోపం వలన ముదురు ఆకులపై నిర్ణిత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
రోజులు గడిచే కొద్ది పసుపు రంగు మచ్చలు మాడిపోతాయి.
. లోపం తీవ్రమైనప్పుడు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.
. పిలకలు లేత ఆకులు ఆకుపచ్చ చారలతో కూడిన తెలుపు వర్ణము కల్గి ఉంటాయి.
. లోపము తీవ్రమైనప్పుడు లేత తెలుపు రంగు ఆకులు ఎండిపోతాయి.
నివారణ :
మాంగనీసు సల్ఫేట్‌ 2 గ్రా. లీటరు నీటిలో కలిపి ఆకులను తడిసేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసి మాంగనీసు లోపాన్ని సవరించవచ్చు.

Leave Your Comments

Aquaculture for all eligible farmers : అర్హులైన రైతులందరికీ జలకళ

Previous article

Custard apple…. health power : సీతాఫలం…. ఆరోగ్య బలం

Next article

You may also like