నీటి యాజమాన్యంమన వ్యవసాయం

Water Conservation: సాగు నీటి నాణ్యత – యాజమాన్యంలో మెళుకువలు.!

0
Water Conservation
Water Conservation: ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18 శాతం పంటలను పండిరచటానికి భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. నీరు ప్రధానంగా మొక్కల్లో వివిధ రకాల జీవక్రియలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నీటి నాణ్యత పంటలకు ముఖ్యమైన అంశం. భూగర్భ జలాల్లో లవణాల పరిమాణం కాలువలోని నీటికన్నా అధికంగా ఉండి, సాధారణంగా  తక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి. భూగర్బ జలాల్లో నాణ్యత పరీక్షించిన తరువాతే నీటిని ఆయా పంటలకు అనువుగా వాడుకునే వీలుంటుంది. మంచి నేలల్లో నాణ్యతలేని నీరు కారణంగా పంటలు సరిగా పండకపోవడమే కాక నేల కూడా పాడవుతుంది. కావున రైతులు తాము వాడే భూగర్భ జలాలు నాణ్యత సరిjైునదో కాదో పైరు వేయటానికి ముందే తెలుసుకోవడం ఎంతో అవసరం. దీనికోసం నీటి నమూనాలను పరీక్ష చేయించు కోవాలి. నీటి నమూనాలను అన్నీ భూసార పరీక్ష కేంద్రాల్లో విశ్లేషించి తగిన వాడకంలో తీసుకోవాల్సిన సూచనలను ఇస్తారు.

Water Conservation

నీటి నమూనాలను సేకరించే విధానం : 
సాగు నీటి నాణ్యత కోసం కనీసం అర లీటరు నీటిని సేకరించాలి. గట్టి మూత కలిగిన శుభ్రమైన గాజు లేక ప్లాస్టిక్‌ సీసాలను ముందుగా శుభ్రపరిచి, పరీక్ష కోసం పంపే నీటితో రెండు మూడుసార్లు కడగాలి. బోరు బావుల నుండి నీరు సేకరించేటప్పుడు సుమారు 10 నిమిషాలు మోటారు ద్వారా నీరు వదిలిన తరువాత నమూనా సేకరించాలి. చేదబావి నుండి 4-5 బకెట్లు తోడిన తరువాత నమూనా సేకరించాలి. చెరువులు, కాలువలు, వాగులు, వంకలు మరియు నదుల్లో నమూనాలు తీసేటప్పుడు గట్టుకు దగ్గర కాకుండా కొంచెం లోనికి వెళ్ళి తీయాలి. నమూనా సేకరించిన తరువాత మూతను గట్టిగా బిగించి, సీలు వేసి, సంబందిత వివరాలను కాగితంపై వ్రాసి సీసాపై అంటించాలి. వీలైనంత త్వరగా ఒకటి రెండు రోజుల్లో భూసార పరీక్షా కేంద్రానికి నమూనా పంపే ఏర్పాటు చేసుకోవాలి. నమూనా కోసం 250 మి.లీ. ఘణపరిమాణమున్న నీటిని సేకరించాలి. నమూనాకు, నమూనాకు మధ్య అరకిలోమీటరు నుండి ఒక కిలోమీటరు దూరం ఉండేటట్లు చూడాలి.
భూసార పరీక్ష కేంద్రంలో విశ్లేషించి నీటి నమూనాల నాణ్యతను నిర్ధారించడం జరుగుతుంది. తద్వారా రైతులకు సాగుకోసం ఎంతవరకు అనుకూలమో అర్థమవుతుంది. పూర్తిగా నాణ్యత లోపించి, పనికిరానివిగా నిర్ధారించిన నీటిని తప్ప, మిగిలిన తరగతులకు చెందిన నీటిని సాధ్యమైనంత అధికంగా వినియోగించుకోవటానికి  రైతులు వేయబోయే పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుని, తగిన యాజమాన్య పద్ధతులను చేపడితే సరైన దిగుబడులు పొందవచ్చు. భూసార పరీక్ష ప్రయోగశాలలో ఉదజని సూచిక, లవణ పరిమాణ సూచిక, కార్బోనేట్‌, బైకార్బోనేట్‌, క్లోరైడ్‌, సల్ఫేట్‌, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, బోరాన్‌ పరిమాణాలను నిర్ధ్దారించి వాటి అనుగుణంగా సాగు నీటి నాణ్యతను తెలియచేయటం జరుగుతుంది. ఈ విధంగా నాణ్యతకు సంబంధించిన వివిధ అంశాలను తెలుసు కోవటం ఎంతైనా అవసరం.
1. ఉదజని సూచిక 6.5- 7.5 గల నీరు సాగుకు ఉత్తమ మైనది.
2. లవణ పరిమాణ సూచిక (ఎలిక్ట్రికల్‌ కండక్టవిటి) : ఇది నీటిలో కరిగిఉండే మొత్తం లవణాల పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. సాధారణంగా దీన్ని డెసి సీమన్స్‌ /మీటర్లలో సూచిస్తారు. లవణాల పరిమాణం స్థాయి కన్నా అధికమయ్యేకొద్దీ నీటి నాణ్యత తగ్గుతుంది.
సాగు నీటి లవణ పరిమాణ పట్టిక :
3. సోడియం ధాతువుకు, కాల్షియం G మెగ్నీషియం ధాతువులకు మధ్యగల సారూప్య నిష్పత్తి (సోడియం అడ్సార్ప్షన్‌ రేషియో) : ఇది నీటిలో గల క్షార తీవ్రతను సూచిస్తుంది. సోడియం పెరిగే కొద్దీ క్షార ప్రభావం పెరుగుతుంది. కాల్షియం, మెగ్నీషియం పెరిగే కొద్దీ క్షారప్రభావం తగ్గుతుంది. వీటి నిష్పత్తిని లెక్కకట్టి తెలుసుకోవచ్చును. నిష్పత్తి పెరిగే కొద్దీ క్షార ప్రభావం పెరుగుతుంది.
అయితే నాణ్యత నిర్ధారణకు నీటిలోఉండే లవణ పరిమాణాన్ని కూడా అన్వయించుకోవాలి. సోడియం అడ్సార్ప్షన్‌ రేషియో వివిధ తరగతులుగా విభజించి చూస్తే యస్‌ 1 నీటికి ఇది 10 కన్నా తక్కువ గానూ, యస్‌ 2 నీటికి 10-ఆ8 గానూ, యస్‌ 3 నీటికి 18-26 వరకూ, యస్‌ 4 నీటికి 26 పైన ఉంటుంది. ఇందులో యస్‌1 మరియు యస్‌2 నీటి తరగతులు వ్యవసాయానికి యోగ్యమైనవి.
4. అధికంగా మిగిలి ఉండే సోడియం కార్బోనేట్లు : కార్బోనేట్లు మరియు బైకార్బోనేట్ల మొత్తాన్ని ఉంచి కాల్షియం మరియు మెగ్నీషియంల మొత్తం పరిమాణాన్ని తీసివేస్తే మిగిలి ఉండే సోడియం కార్బోనేట్లు పరిమాణం వస్తుంది. వీటి పరిమాణం 1.25 మి.లీ ఈక్వివలంట్స్‌ కన్నా తక్కువ ఉన్నప్పుడు సురక్షితం. ఈ నీటిని అన్నీ నేలల్లో పంటలు పండిరచడానికి వాడుకోవచ్చు. 1.25`2.5 వరకు ఉన్నప్పుడు నీటి వాడకంలో తగిన మెళకువలు పాటించాలి. 2.5 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నీరు వ్యవసాయానికి పనికి రాదు.
5. సాగునీటిలో ఇతర ధాతువు ఆయానుల ప్రభావం : సాధారణంగా బోరాన్‌ మరియు క్లోరైడ్‌ ఆయానుల గాఢత తట్టుకోలేని పైర్లకు వాటి పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకుని సాగు నీటి నాణ్యత నిర్ధారిస్తారు. తద్వారా రైతులు పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బోరాన్‌ తట్టుకోలేని పైర్లకు పరిమాణం 1 పి.పి.యం లోపున, ఒక మోస్తరుగా తట్టుకోగల పైర్లకు 2.0 పి.పి.యం. లోపు, బాగా తట్టుకోగల పైర్లకు 3.0 పి.పి.యం లోపున ఉండాలి.
బోరాన్‌ తట్టుకోలేని పైర్లు: నిమ్మ, నారింజ, ద్రాక్ష, ఆపిల్‌ మొదలైనవి. బోరాన్‌ తట్టుకోగల పైర్లు: కొబ్బరి, ఆయిల్‌ పామ్‌, సుగర్‌ బీట్‌ (చెక్కర దుంప) క్యాబేజీ, క్యారెట్‌ మొదలైనవి.
బోరాన్‌ ఒక మోస్తరుగా తట్టుకోగల పైర్లు:  పత్తి, గోధుమ, బార్లీ, మొక్కజొన్న, టమోటా, ప్రొద్దుతిరుగుడు, బంగాళా దుంప, చిలగడ దుంపతో పాటు మిగిలినవి సాధారణ పైర్లు. సాగు నీటిలో క్లోరైడ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల పైర్లకు తీవ్రమైన హాని కలుగుతుంది. ద్రాక్ష, నిమ్మజాతి, పొగాకు, బంగాళాదుంప పైర్లు క్లోరైడ్‌ ఎక్కువ తట్టుకోలేవు. సాగు నీటిలో క్లోరైడ్‌లు లీటరు నీటికి సాధారణంగా 10.0 మిల్లీ ఈక్వివాలెంట్స్‌ కంటే తక్కువ ఉంటే మంచిది.
సాధారణంగా నదులు, కాలువల్లోని నీరు సంవత్సరంలో అన్నీ కాలాల్లో మొదటి మరియు రెండవ తరగతులుగా ఉంటాయి. చెరువులు, కుంటల్లోని నీరు రెండవ, మూడవ తరగతికి చెందినవిగా ఉంటాయి. భూగర్భజలాల్లో ఎక్కువ భాగం మూడవ తరగతికి చెందినవిగానూ, ఒక్కొక్కప్పుడు నాల్గవ తర్గతికి చెందినవిగా ఉంటాయి కనుక వేసే పైరు, నేెల రకం మొదలైనవి దృష్టిలో ఉంచుకొని భూసార పరీక్షతో పాటుగా సాగునీరు(భూగర్భ జలం) కూడా పరీక్ష చేయించుకుని, విశ్లేషణ ఫలితాల ఆధారంగా తగిన యాజమాన్య పద్ధతులు చేపడితే దీర్గకాలికంగా ఏవిధమైన సమస్యలు లేకుండా నాణ్యమైన పంటలు పండిరచుకోవచ్చు. కొన్ని సందర్బాల్లో వర్షాకాలంలో నీటి నాణ్యత సరిగా ఉన్న అది శీతాకాలానికి మరియు వేసవికి మారుతుంటుంది. అలాగే వేసే పైరుకు లవణ సాంద్రతను తట్టుకునే లక్షణాన్ని బట్టి పంట ఎంపిక ఆయా సీజన్లలో సరిjైునదిగా ఉండాలి.

Also Read: వాటర్‌ షెడ్‌ పథకం `మనకో వరం’

Water Conservation Techniques

Water Conservation Techniques

తక్కువ నాణ్యత గల నీటి వినియోగం యాజమాన్యంలో మెళకువలు:  
తక్కువ నాణ్యత గల నీరును వాడుతున్నప్పుడు రైతులు యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి.
క్షార నాణ్యత గలిగిన నీటికి జిప్సం ఉంచిన బస్తాల మీద నీటిని పారించడం వల్ల కాల్షియం నెమ్మదిగా కరిగి సోడియం ధాతువుకు గల నిష్పత్తిలో మార్పు వస్తుంది తద్వారా సోడియం తగ్గి క్షారత తగ్గుతుంది.
పైరుకు మామూలుగా వేసే నత్రజని, భాస్వరం ఎరువులు 25 శాతం అధికంగా వేసుకోవాలి.
వీలైనంతగా పొలానికి నీరు ఇవ్వటం, తీయటం చేస్తూ ఉండాలి. సేంద్రియ ఎరువులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలి. పశువుల ఎరువు, కంపోస్టు, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లు, చెరకు మడ్డి మొదలైనవి నేలలో కలియదున్నటంవల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి సంవత్సరం సాగు నీటి పరీక్షలు చేయించుకుని సలహాలు పొందాలి. వీలైన చోట మంచి నాణ్యత గలిగిన నీటితో కలిపి వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులను పొలంపై జల్లుకొని తర్వాత జిప్సం జల్లుకుంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది.
* క్షార జాలంతో సాగు చేసే పంటలకు జింకు లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి నివారణకు ఎకరానికి 20 కి.గ్రా. చొప్పున జింకు సల్పేట్‌ తప్పకుండా వాడాలి.
* బోదెలు చేసుకుని బోదె వాలు మీద విత్తనం నాటుట చాలా మంచి పద్దతి.
* ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు వేయడంతోపాటు మిగిలిపోయే సోడియం కార్బోనేట్లు అధికంగా ఉన్న నీటిని జిప్సం ఉన్న తొట్ల ద్వారా పారించి వంగ, టమాటా, క్యాబేజీ, దోస వంటి కూరగాయలను సాగుచేసుకోవచ్చు.
ఉప్పు నీటి వాడకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు:
* నాణ్యత సరిగా లేని నీటిని స్ప్రింక్లర్‌ పద్ధతిలో మరియు డ్రిప్‌ పద్ధతిలో వాడితే లవణ ప్రభావం పంటల మీద తగ్గుతుంది.
*వర్షపు నీరు వృధా చేయకుండా నీటికుంటల్లో సేకరించి పైరు కీలక దశల్లో సాగుకు వాడడం లేదా ఉప్పునీటితో కలిపి సాగుకు వాడుకోవచ్చు
*ఉప్పును తట్టుకునే పైర్లను సాగు చేసుకోవాలి
*బోదెలు చేసుకుని బోదె వాలు మీద విత్తనం నాటుట చాలా మంచి పద్దతి.
*పచ్చి రొట్ట 5 టన్నులు లేదా పశువుల ఎరువు 15 టన్నుల చొప్పున హెక్టారుకు నెలలో కలియదున్నాలి
*మొక్కల సాంద్రత 50 శాతం పెంచుకుని సాగుచేయాలి
*నత్రజని, భాస్వరం ఎరువుల మోతాదును 50 శాతం అధికంగా వాడాలి.
*మల్చింగ్‌ పద్ధతిలో పంటలను పండిస్తే నీటి వినియోగం తగ్గుతుంది.
Leave Your Comments

Organic Farming: 10వ తరగతి డ్రాపౌట్ కానీ పద్మశ్రీ !

Previous article

Health Benefits of Honey: మానవ శరీరానికి అమృతంలా తేనే…

Next article

You may also like