Water Hyacinth Organic Compost Fertilizer: సేంద్రియ పదార్ధం కుళ్ళడానికి తక్కువ సమయం పడుతుంది. కనుక భారతదేశంలో గుర్రపు డెక్కను సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగించవచ్చు.
సేంద్రియ ఎరువు వల్ల లాభాలు
- నేలలో కర్బన శాతాన్ని పెంచుతుంది.ఈ కర్బనం నీరు నిలువ ఉంచి పంటకు అందేలా చేస్తుంది.
- పోషకాలు నిలువ ఉంచి పంటకు నెమ్మదిగా అందిస్తుంది.
- నత్రజని పొటాష్ లతో పాటు భాస్వరం వంటి ముఖ్య పోషక పదార్ధాలను కలిగి ఉంటాయి.
- నేల నిర్మాణాన్ని పెంపొందిస్తుంది.
- గుర్రపు డెక్కను నీటిలోని లోహలను శోషించే గుణం ఎక్కువ కనుక ఈ సేంద్రియ ఎరువుల తయారీ కొరకు మురుగు నీటిలో పెరిగే గుర్రపు డెక్కను ఉపయోగిస్తే భార లోహలు అధికంగా ఉండే ఆస్కారం ఉంది.
Also Read: Water Hyacinth: చెరువుల్లో ఉండే గుర్రపుడెక్క యాజమాన్యం.!
ఎరువు తయారీ ఎంపికలో జాగ్రత్తలు
- సేంద్రియ ఎరువు తయారీకి గుర్రపు డెక్కను 4-5 రోజులు ఎండనివ్వాలి.
- మొక్కల లభ్యతను, ఎరువు ఉపయోగించే పొలాలకు దగ్గరగా ఉండే అనువైనటువంటి, తయారీకి అనుగుణంగా ఎక్కువ ఖాళీ స్థలం కలిగి ఉండి తడి ఆరిపోనియకుండా చూసుకోవాలి.
- ఎరువు తయారీకి వాడే ప్రాంతం క్రిమికీటకాలను ఆకర్షిస్తుంది. కనుక ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండాలి.
- గాలి చొరబడే పద్దతిలో కంపోస్టు తయారీ
- గుంత అడుగు భాగంలో గుర్రపు డెక్క కాడలు లేదా చెరకు కాడలు / కంది కట్టెలు పరచాలి. దీని వల్ల ఎరువుకు గాలి తగులుతుంది.
ఎండిన గుర్రపు డెక్క చిన్న 2-5 సెం. మీ ముక్కలుగా కోయాలి. 20సెం. మీ. ఎత్తు వరకు గుర్రపు డెక్క లేదా ఇతర కూరగాయల వ్యర్థాలు పేర్చాలి. దీనిపై 5సెం. మీ. ఎత్తు పశువుల ఎరువు, మట్టి వేయాలి. ఈ విధంగా భూమిపై 2మీ. ఎత్తు వచ్చే వరకు కుప్పగా వరుసలు పేర్చాలి. కుప్పను పేర్చడం వీలయినంత త్వరగా ఒక వారంలో పూర్తి చేయాలి.2లేదా 3 వారాల తర్వాత కుప్పను లోపలి భాగం బయటకు, బయటి భాగం లోపలికి పోయేటట్లు తిరగవేయాలి.
Also Read: Nela Vemu Cultivation: నేలవేము సాగులో మెళుకువలు.!
గుంత పైభాగంలో ఉండే ఎండిన వాటిని తడిచేసి గుంత మధ్యలో వేయాలి. ఇదే ప్రక్రియ మూడు వారల తర్వాత మళ్ళీ చేయాలి. ఈ విధంగా 75-90 రోజులకు నల్లని ఎరువుగా తయారవుతుంది. ఎరువు తయారీకి ఎక్కువ సమయం పడుతుంటే పశువుల పేడ, నీరు 1:4 పరిమాణంలో కలిపి చల్లాలి. గుర్రపు డెక్క సేంద్రియ ఎరువు తయారీలో పశువుల ఎరువు వాడకం సమతుల పోషకాలు అందిచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పశువుల ఎరువు లేకుండా గుర్రపు డెక్క సేంద్రియ ఎరువు అధిక దిగుబడులు అందించలేదు.
గాలి చొరబడకుండా సేంద్రియ ఎరువు తయారీ
గుర్రపు డెక్క ఎరువును ఆవు పేడతో కలిపినప్పుడు దానిలోని పోషకాలు ఆవు పేడలో కంటే అధికంగా ఉంటాయి. అలాగే ఎరువును గుంతలోపల తయారు చేసినట్లయితే కొన్ని పోషకాలు గుంత గోడలు పీల్చుకుంటాయి. అందువలన గుంతల యొక్క పక్క భాగంలో, క్రింది భాగంలో బండలు పరచాలి.
గుర్రపు డెక్క బూడిద
గుర్రపు డెక్క బూడిద లో అధికంగా పోటాష్ కలిగి రవాణాకు అనువుగా ఉంటుంది. చిన్న మొక్కలలో సిలికాన్ ఎక్కువగా ఉన్నందువల్ల పెద్ద మొక్కల నుండి బూడిద తయారు చేసుకోవాలి.
Also Read: Fish Farming: చేపల పెంపకం – సాగులో మెళుకువలు.!