Veneer Grafting – మట్టిని శుద్ధి చేయుట: మట్టి మిశ్రమంతో పాలిథీన్ సంచులను (9×6″) / (10″×8″) నింపడానికి ముందు నర్సరీలో వాడే మట్టిని శిలీంధ్రాల బారి నుండి కాపాడు కోవడానికి మట్టి శుద్ధి చేయడం అవసరం. దీనికొరకు ముందుగా మట్టిని తోలుకొని 2 అడుగుల ఎత్తులో పరచాలి. తరువాత మట్టి మిశ్రమాన్ని 5 శాతం ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో మట్టి మొత్తం తడిచే విధంగా తడపాలి. తరువాత మట్టి కుప్పలను black పాలిథీన్ పట్టాతో కప్పి 15 రోజుల పాటు గాలి ఆడకుండా ఉంచాలి. ఈ పనిని ఎండలు బాగా ఉన్నప్పుడు అనగా april – may నెలల్లో చేపట్టాలి. దీని వల్ల మట్టిలో ఉండే హానికరక శిలీంధ్రాలు, నులి పురుగులు నశించిపోవును. తరువాత ఈ మట్టికి పశువుల ఎరువు, SSP ను తగు మోతాదులో కలిపి సంచులను నింపుకోవాలి.
వేరు మూలం, సయాన్ ఒకే మందం ఉండేటట్లు చూసుకోవాలి.తల్లి మొక్క నుండి సయానును తీసుకోనుటకు 7 నుండి 10 రోజుల ముందు కాడలు మాత్రమే ఉంచి ఆకులు తీసి వేయాలి.వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అంట్లు కట్టాలి .అంట్లు కట్టిన మొక్కలను మంచు వాతావరణంలో ఉంచాలి.అంటుకట్టిన మొక్కలకు విధిగా లేబుల్స్ కట్టుకొనాలి. ఇలా చేసినచో రకాలు కలువకుండా జాగ్రత్తపడవచ్చు.సయాను చిగురించిన తదుపరి వేరు మూలం మొక్కను కత్తిరించుకోవాలి.
Also Read: Grafting Management: అంటు కట్టడంలో జాగ్రత్తలు.!
మొక్కల ఉత్పత్తి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఉత్పత్తి చేసిన మొక్కలు వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా గట్టిపరచాలి. ఈ మొక్కలను షేడ్ నెట్లకు తరలించినచో పెరుగుదల బాగా ఉండి మొక్కలు చనిపోతాయి.
సకాలంలో సూక్ష్మ పోషకాలు అందిస్తూ చీడపీడల నిర్మూలన, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా గట్టిపరిచిన మొక్కలను షేర్నెట్ నుండి ప్రధాన పొలంలోకి తరలించినప్పుడు మొక్కలు చనిపోకుండా ఉంటాయి.
మొక్కల ఎంపిక:
అంట్ల ఎంపిక: చీడ పీడలు ఆశించని వెనీర్ గ్రాఫ్టింగ్ అంట్లు నాటుకోవాలి. వేరుమూలం, సయాన్ బాగా అతికి ఉండాలి. అంట్లను నాటేటప్పుడు వేరుమూలం పై కొత్త చిగుళ్ళు ఉండరాదు. అంటుకట్టిన భాగం భూమిపై నుంచి 20 cm. ఎత్తులో ఉండి అంటు పైభాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. 8 నుండి 12 నెలల వయసు గల అంట్లు నాటుకోవాలి.
Also Read: Mango Grafting: మామిడిలో మొక్కల వ్యాప్తి ఎలా జరుగుతుంది.!