ఉద్యానశోభ

Amaranthus Leaf Cultivation: తోటకూర.. అన్ని రుచుల కలిపిన ఆకు కూరని ఎలా సాగు చేయాలి?

2
Amaranthus Leaf Cultivation
Amaranthus Leaf Cultivation

Amaranthus Leaf Cultivation: మన రాష్ట్రంలో ఆకు కూరలన్నీ కలిపి ప్రస్తుతం సుమారుగా 16,740 ఎకరాలలో సాగుచేయబడి, 36,823 టన్నుల దిగుబడినిస్తున్నాయి. ఆకు కూరలు సమీకృత పోషకాహారంలో చాలా ముఖ్యమైన భాగం. ఇందులో ఎక్కువ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉన్నాయి.

మనం పండించే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. ఎలాంటి పరిస్థితుల్లో పెంచటానికి అనువైనది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 సెల్సియస్ కంటే తక్కువ ఉంటే పెరుగుదల సరిగా ఉండదు.

ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూచి 6.0 – 7.0 ఉన్న నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పనికిరావు. నేలను 4 – 5 సార్లు బాగా దుక్కిదున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదునుగా చేసుకోవాలి.

తోటకూరని ఎక్కువగా వర్షాకాలం అయితే జూన్ నుండి అక్టోబరు నేలలో సాగు చేస్తారు. వేసవికాలంలో మే నేలలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కలిపి వేయాలి. నారుమడిలో పోసుకొని కూడా 20 X 20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి.

Also Read: Finger Millet Cultivation: రాగి పంట సాగుకు సరిపోయే ఆలోచనలు, సలహాలు.!’

Amaranthus Leaf Cultivation

Amaranthus Leaf Cultivation

తోటకూర రకాలు:
ఆర్.ఎన్.ఎ. 1: ఆకులు, కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకంలో విటమిన్ ‘ఎ’,’సి’లు అధికంగా ఉండటంతో పాటు కాండం కూడా పీచు లేకుండా చాలా మృదువుగా ఉండి, రుచికరంగా ఉంటుంది. నెలరోజుల్లో ఒక ఎకరాకు 6-7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. మొదటి కోత విత్తిన 15-20 రోజులకు వస్తుంది. కోత తరువాత బాగా శాఖలు విస్తరిస్తాయి. నీటి ఎద్దడి, తెల్ల ఆకుమచ్చ తెగులును తట్టుకొని అధిక దిగుబడి నిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, వేసవి కాలంలో పండించేందుకు అనువైనది.

కో 1:

ఆకులు,కాండం లావుగా ఉండి కండ కలిగి ఉంటాయి. ఒక ఎకరానికి 3- 3.5 టన్నుల దిగుబడిని 25 రోజులలో ఇస్తుంది. ఆకులు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా, నల్లగా ఉంటాయి.

కో 2 :

ఆకులు కోలగ, ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం లేతగ, మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూడ కూరగా పనికి వస్తుంది. ఎకరాకు 4-5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు పెద్దవిగా, నల్లగా ఉంటాయి.

పూసా చోటి చౌలై :

మొక్కలు పొట్టిగా, ఆకులు చిన్నవిగా ఉంటాయి.

సిరికూర :

మొక్కలు పొట్టిగ, ఆకులు చిన్నవిగ ఉంటాయి. కాండం, వేరు కలిసే చోట గులాబిరంగులో ఉంటుంది. నాటిన 25 రోజులకు లేత మొక్కలను కాండంతో సహా కూరగా వాడుకొనవచ్చు. ఈ రకాలే కాకుండా పూసాకీర్తి, పూసాకిరణ్, పూసాలాల్ చౌలై, అక్క అర్క అరుణ రకాలను కూడా రైతులు సాగు చేస్తున్నారు.

ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ల నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. కత్తిరింపులు తీసుకునే రకాలకు ఎకరాకు 30 కిలోల నత్రజనిని మూడు భాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత నత్రజనిని వేసి నీరు పెట్టాలి.విత్తిన 15 – 20 రోజుల తర్వాత 20గ్రా యూరియా, ఒక లీటరు నీటికి, 20 పి.పి.యమ్ జిబ్బరెల్లిక్ ఆసిడ్ , ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణం పిచికారి చేస్తే అధిక లాభాలు వస్తాయి. అంతేకాక 25% నత్రజని ఆదా అవుతుంది. కలుపు నివారణకు ఎకరాకు డ్యుయల్ మందును తేలిక నేలలకు ఒక లీటరు లేదా బరువు నేలలకు 1.5 లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తినలు నాటిన 24 – 48 గంటలలో భూమిపై పిచికారి చేయాలి. భూమిలో తేమను బట్టి 7 – 10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5 – 6 రోజులకు ఒక తడిని ఇవ్వాలి.

ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపెల వంటివి ఏర్పడతాయి. ఆకు పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందును కలిపి పిచికారి చేయాలి. ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా చూడాలి.

చిన్న, పెద్ద పురుగులు ఆకులను కొరికి వేయడం వలన ఆకులు పనికి రాకుండా పోవడమేగాక, మార్కెట్ లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకుకోయాలి.

కోత రకాలలో విత్తిన 25 రోజులకు మొదటి సారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజులలో 4 – 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కను వేర్లతో సహా పీకి కట్టలు కట్టే రకాలలో 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

Also Read: Green Gram:పెసర పంటను ఏ ప్రాంతంలో, ఏ కాలంలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది..

Leave Your Comments

Crops Damage: భారీ వానలతో నీట మునిగిన పంటలు.!

Previous article

Banana Varieties Cultivation: భారతదేశంలో అరటి పండులో ఇన్ని రకాలు సాగులో ఉన్నాయి.!

Next article

You may also like