ఉద్యానశోభ

పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నయువరైతు..

0

తక్కువ కాలంలో మంచి దిగుబడులు, అధిక ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయడంతో పాటు పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు రామన్నగూడేనికి చెందిన బండి వెంకటకృష్ణ ఎంసీఏ చదివిన ఇతను ఈ ఏడాది పుచ్చ, తైవాన్ జామ, దొండ పాదులు వేశారు. 25 ఎకరాల్లో పుచ్చ సాగు చేశారు. వసుధ, 777, జిగానా గోల్డ్ వంటి మూడు రకాలున్నాయి. కిలో విత్తనం రూ. 15 వేల చొప్పున (కిలో మూడున్నర ఎకరాలకు సరిపోతుంది) 8 కిలోలకు మొత్తం రూ. 1.20 లక్షలు వెచ్చించారు. డ్రిప్ పద్ధతిలో నీరు అందించారు. ప్రస్తుతం ఏడెకరాల్లో కాయలు తయారై ఎకరాకు 20 టన్నుల దిగుబడి రాగా టన్ను రూ. 9 వేల చొప్పున చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. పెట్టుబడులు పోను రూ. 3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. మిగిలిన పంట కూడా కోత దశకు చేరుకుంది. అరెకరాల్లో తైవాన్ జామ వేశారు. రూ. 6 లక్షల పెట్టుబడి పెట్టారు. ఎకరాకు దిగుబడి 20 టన్నుల వరకు వస్తోంది. 25 కిలోల పెట్టెను రూ. 600 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులన్నీ పోను ఎకరాకు రూ. 2 లక్షల వరకూ మిగులుతోంది. రెండెకరాల్లో దొండ పాదులు పెట్టారు. ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 2 లక్షల వరకూ వ్యయం చేశారు. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. టన్ను రూ. 10 వేల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అన్నీ పోను రూ. 4 లక్షల ఆదాయం ఆర్జించారు. తైవాన్ జామ, దొండ మొక్కలను జంగారెడ్డిగూడెం నర్సరీ నుంచి తీసుకొచ్చారు. ఉద్యాన పంటలు రైతులకు ఎంతో లాభదాయకం. ఏడాదికి రెండు, మూడు పండించుకోవచ్చు. గతంలో క్యాప్సికం, టమాటా, బొప్పాయి పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. ఆదాయం బాగా వచ్చింది. ఈ ఏడాది పంట మార్పిడి చేసి సత్పలితాలు సాధించానని రైతు వెంకటకృష్ణ తెలిపారు.

Leave Your Comments

గుమ్మడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

ప్రపంచ పాల దినోత్సవం -2021 పై ప్రత్యేక కథనం..

Next article

You may also like