Asparagus Cultivation: వేసవిలో కూరగాయలకు, ఆకుకూరలకు అధిక డిమాండ్ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనే రకాలను ఎంపిక చేయడం, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో అధిక దిగుబడులతో పాటు అధిక ధరలను పొందే వీలుంది.
Also Read: ఆరోగ్యానికి ఆకుకూరలు
వేసవి కాలంకు అనువైన తోటకూర పంటలు మరియు రకాలు
తోట కూర: ఆర్ ఎన్ ఎ-1, అర్క అరుణ. పాలకూర: ఆల్ గ్రీన్. మెంతి: పూసా ఎర్లీ బంచింగ్. కొత్తిమీర: స్వాతి, సాధన.
తోట కూర, పాల కూర, మెంతి మరియు కొత్తిమీర లాంటి ఆకకూర పంటల కోసం నేలను 4-5 సార్లు బాగ దుక్కి దున్నాలి. ఎకరాని 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను చదనుగా చేసుకోవాలి. 2×1.5మీ. మదుల్లో పలుచగా విత్తుకోవాలి. విత్తనం విత్తేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో విత్తుకోవాలి. నారు మడిలో పోసుకొని కూడా 20×20 సెం.మీ దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే విత్తనం చాలా వరకు ఆదాచేయవచ్చు.
Also Read: ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న గ్రామం