డా. సిహెచ్. ముకుందరావు , డా. పి. సాంబశివ రావు , డా. డి. ఆదిలక్ష్మి మరియు పి . వి. కె. జగన్నాధరావు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి , 08924 223370
మన రాష్ట్రంలో చెరకు ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి తరువాత ఖర్మాగార సాధికారత ఉన్న పంట చెరకు పంట మాత్రమే. ఈ పంటను మన రాష్ట్రంలో సుమారుగా 48,000 హేక్ట్రార్లులో చేస్తూ సుమారు 40 లక్షల టన్నులు చెరకు ఉత్పత్తి చేసే సగటు దిగుబడి హెక్టారుకు 78 టన్నులుగా నమోదు చేసుకుంటున్నది. మన పొరుగు రాష్ట్రాలతో పోల్చినపుడు ఉత్పత్తి దిగుబడులు 6 వ స్థానం నమోదు చేసుకుంటున్నది.
పంటలో పూత దశ వివిధ పంటలలో ఆహారం, పచ్చిమేత మరియు నార వంటి పదార్ధాలు పంట ప్రత్యుత్పత్తి నిర్మాణం నుండి లభిస్తాయి. చెరకులో పూత అన్నది లాభదాయకం గాను మరియు నష్టదాయకంగాను ఉంటుంది. చెరకులో పూత కారణంగా చెరకులో జన్యు వ్యత్యాసం ద్వారా మంచి చెరకు రకాలను తయారు చేయడానికి వృక్ష ప్రజనన శాస్త్రకారులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రైతు సోదరులకు చెరకులో పూత సాధారణంగా పంట దిగుబడి మరియు నాణ్యత తగ్గుతుంది. చెరకులో పూత సాధారణంగా తక్కువ పగటిపూట మరియు తక్కువ ఉష్ణోగ్రత కాలం (అక్టోబర్ – నవంబర్) మాసంలో సంభవిస్తుంది. శాస్త్ర పరిశోధనలో పగటి పూట కాలం (ఫోటో పిరియడ్) కారణంగా తక్కువ పగటి పూట మొక్కలు (short day plants), ఎక్కువ పగటి పూట మొక్కలు (long day plants) , మధ్యస్థ మొక్కలు (Intermediate plants) గా వర్గీకరించడం జరిగింది. ఈ వర్గీకరణకు చెరకులో పూత అతీతం. చెరకులో పూత మధ్యస్థ పగటి కాలం ప్రేరణలో ఉంటుంది. చెరకులో సెకారం స్పాంటేనియమ్ తెగ మిగిలిన తెగలుకన్నా నిర్దిష్ట కాలానికి పూతకు వస్తుంది. చెరకులో పరిశోధన ప్రకారం పూత పూయడానికి 100 నుండి 250 కెలోరీలు / సెంటీమీటర్లు / రోజులు , 12 1/2 గంటల పాటు ఉన్నప్పుడు చెరకు పంటలో పూత సంభవిస్తుంది.
కాలము మరియు పూత తీవ్రత: చెరకులో పూతకు పూత కాలం మరియు పూత తీవ్రతల మధ్య నిర్దిష్టమైన సంబంధం ఉంది. ముందు పూతకు వచ్చు చెరకు రకాలు ఎక్కవ పూతతోను (70 శాతం) ఆలస్యంగా పూతకు వచ్చు రకాలు తక్కువ పూతకు (30 శాతం) కన్నా తక్కువ లోనవుతాయి.
చెరకులో పూత విధానం: చెరకులో పూత విధానం దీర్ఘకాలిక సంక్లిష్ట శరీర ధర్మ పద్ధతిగా చెప్పుకోవచ్చు. చెరకులో పూత ఐదు దశలుగా ఉంటుంది. 1. ఇండక్షన్ 2. ఇన్సియేషన్ 3. డెవలప్మెంట్ 4. ఎమర్జెన్స్ 5. యాంతసిన్ ఒక్కొక్క దశకు ఒక్కొక్క నిర్దిష్ట పగటి కాలం (Photo period) పరిమితి ఉంటుంది. చెరకులో ఈ ఐదు దశలు పూర్తికావడానికి సుమారు 70 నుండి 100 రోజుల కాలం పడుతుంది.
చెరకులో పూతను ప్రభావితం చేయు అంశాలు:
పంట వయస్సు: సాధారణంగా చెరకులో ముదురు వయసు గల బలిష్టమైన చెరకు గడ దుబ్బులు పూతకు లోనవుతాయి.
చెరకు ఆకులు: చెరకులో లేత ఆకులూ (సుడిలోని ఆకులు) కారణంగా చెరకులో పూత ఆరంభిచడానికి కారణం అవుతాయి. దీనికి గల కారణంగా చెరకులో లేత ఏదుగుతున్న ఆకులు పూత ప్రారంభానికి అవసరమయ్యే పగటి పూట కాల పరిధిని ప్రభావితం చేస్తాయి.
పగటి పూట కాలం (Photo period)
చెరకు పంట పూతకు పగటి పూట కాలంలో సంధ్యా కాంతి సాధారణంగా ఎక్కువ దోహదపడుతుంది.
ఉష్ణోగ్రత: చెరకులో పూతను పగటి ఉష్ణోగ్రత 300C మించినపుడు తక్కువగా పూస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతకు 180C తక్కువ నమోదయినప్పుడు పూత పూయడం సంభవించును. పగటి ఉష్ణోగ్రత 280C రాత్రి ఉష్ణోగ్రత 23 చెరకులో పూతకు అనుకూలం. సాధారణంగా వాతావరణంలోని పగటి, రాత్రి ఉష్ణోగ్రతల తేడా చెరకులో పూతను ప్రభావితం చేస్తాయి.
Also read: పశువుల్లో పాల సంబంధిత సమస్యలు మరియు చికిత్స
నేలలోని తేమ: నెలలో తక్కువ తేమ చెరకు పూతకు అవరోధనం. చెరకు పంట నెలలో తడి మరియు చెరకు పంటలో పూతకు నిర్దిష్టమైన అనుబంధం ఉంది. తక్కువ వర్షపాతము మరియు బీడు భూములలో చెరకు పంటలు పూత అధికం నెలలో అధిక నత్రజని సారం పూత తగ్గుదలను ప్రభావితం చేస్తాయి.
పూతను క్రమపరచు పద్ధతులు
చెరకులో పూతను కృత్రిమ కాంతుల ద్వారా నియంత్రణ చేయవచ్చు. చెరకులో పూత ఫలదీకరణకు వాతావరణం ఉష్ణోగ్రత (18 నుండి 20 0C) చాలా అనుకూలం.
A ) ముందుగా పూత పూయించు పధ్ధతి: ఆలస్యంగా పూత పూయు రకాలలో కృత్రిమ పగటి పూట కాలాన్ని నియంత్రించి పూత పూయించవచ్చు. దీనికి సాయంత్ర సమయానికి పది నిమిషాలు ముందుగా చీకటి వాతావరణం కారణంగా చెరకు ముందుగా పూత పూయించవచ్చు. రోజుకు 30 సెకెన్లు కాలం పాటు పగటి కాలాన్ని తగ్గించినప్పుడు చెరకులో పూతను నియంత్రిచవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు చెరకులో పూతను నియంత్రిస్తాయి. దీనికి కారణంగా చెరకులో పూతను 20 నుండి 40 రోజులకు ముందుగా పూత పూయించవచ్చు.
B) పూతను ఆలస్యం చేయు పధ్ధతి: కృత్రిమ పద్ధతుల ద్వారా సహజ రోజు కాంతిని పెంచినపుడు పూతను ఆలస్యం చేయవచ్చు. నిర్దిష్టంగా 12 1/2 గంటల పాటు ఆరు వారాలు చెరకు పంటను పగటిపూట కాలానికి గురిచేసినపుడు చెరకులో పూత ఆలస్యం అవుతుంది. సాధారణంగా దీర్ఘకాలం పాటు పగటికాలం చెరకులో పూతను ఆలస్యం చేయడానికి కారణం అవుతుంది.
ఒకే సమయంలో పూత : ఒకే కాలంలో చెరకులో తల్లిదండ్రులు పూతకు రావడం అన్నది చెరకు రకాల రూపకల్పనకు చాలా ముఖ్యం. దీని కొరకు పూతను ముందుగా గాని ఆలస్యంగా గాని చేసుకొనుటకు చెరకు రకాలను బట్టి సరైన సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటారు. దీని కొరకు అంతేకాక పగటిపూట కాలాన్ని బట్టి చెరకులో తల్లిదండ్రులు ఒకేసారి పూటకు తెచ్చుటకు ఏర్పాటు చేసుకోవడం, చెరకులో వారసత్వ పూత ప్రవర్తన చెరకులో రూపకల్పన శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యం. దీని ఆధారణంగా శాస్త్రవేత్తలు చెరకులో తల్లిదండ్రులను సంకర పరచి రకాలను రూపకల్పన చేయునపుడు తక్కువగా పూత పూయు లేదా పూత పూయని చెరకు రకాలను పెంచుకోవడం జరుగుతుంది.
చెరకులో ఒకేసారి పూతలో సంకర జాతి రకాల రూపకల్పన:
చెరకులో తల్లిదండ్రులను సంకర పరచినపుడు తక్కువగా పూయడం మరియు తప్పుగా పూయడం అన్నది రకాల రూపకల్పనకు అవరోధంగా ఉంటుంది. పగటి పూట కాలం (photo period) అనేది చెరకులో రకాల రూపకల్పనకు ముఖ్యమైనది.ఈ సమయాన్ని అనుసరించి శాస్త్రవేత్తలు చెరకులో రకాల రూపకల్పన చేస్తారు. దీని కొరకు కావాల్సిన సదుపాయాలలో 1 ) చెరకును రవాణా చేయుటకై పెద్ద భవనాలు 2)
2) వాతావరణ ఉష్ణోగ్రతను నియంత్రించే సదుపాయం. 3) తగిన కాంతిని అందజేయు ప్లోరాసెంట్ ప్లాంట్స్ 4) పగటి పూట కాంతిని నియంత్రించు సదుపాయం 5) చెరకును నియంత్రిత గదులలో బయటకు లోపలకు మార్చు సదుపాయం మొదలగునవి. మన దేశంలో ఈ సదుపాయం కోయంబత్తూర్ నందు గల షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ నందు కలిగి ఉన్నది. అందుకే అక్కడ సదుపాయాలు వాతావరణం బట్టి మన దేశంలోకి వివిధ రాష్ట్రాలకు అనువైన చెరకు రకాల రూపకల్పన చెరకులో పూతను అనుసరించి జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు అనువైన చెరకు రకాల రూపకల్పనకు SBI (Sugarcane Breeding Institute) కోయంబత్తూరు మూలాధారం.
చెరకులో పూతతో కలిగే నష్టాలు
సాధారణంగా రైతులు సాగుచేయుటకు విడుదల చేయు చెరకు రకాలు పూత పూయని లేదా తక్కువగా పూత పూసే రకాలై ఉంటాయి. అయినప్పటికీ నీటి ఎద్దడి లేదా సుదీర్ఘకాలం పాటు నీటి ముంపుకు గురైన చెరకు తోటల్లో ఒత్తిడి కారణంగా పూత పూయని మరియు తక్కువగా పూచే చెరకు రకాలలో కూడా పూత సంభవిస్తుంది. దీని కారణంగా పక్వతకు ముందు కాలం వరకు చెరకు గడలలో కూడి వున్నా చక్కెర పదార్ధం పూత కారణంగా వినియోగించబడుతుంది. దీని కారణంగా చెరకు గడ బరువు తగ్గి రస నాణ్యత క్షిణిస్తుంది. అంతేకాక చెరకులో నారా శాతం పెరిగి కర్మాగారంలో చక్కెర కూడికకు అవరోధం ఏర్పడుతుంది. పూత కారణంగా చెరకులో బరువు కోల్పోయి ఊళ ఏర్పడుతుంది. ఇది రైతు సోదరుల చెరకు దిగుబడికి నష్టము. పరిశోధనా ఫలితాలు ఆధారంగా చెరకులో పూత కారణంగా, దిగుబడిలో 56.6 శాతం (మొక్కతోట) , 33.8 శాతం (మోడెం తోట) వరకు నష్టం వాటిల్లుతుందని , రసనాణ్యతలో 69. 1 శాతం (మొక్క తోట), 35.4 శాతం (మోడెం తోట) క్షినత ఉండునట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
చెరకులో పూత నివారణ :
సాధారణంగా చెరకు పూతలో వెన్ను పుట్టి పూయడానికి 70 నుండి 100 రోజులు కాలం పడుతుంది. ఈ కాలం మొదటి భాగంలోనే చక్కర కర్మాగారాలు చెరకు గానుగాటను గమనించి చెరకును గానుగాడినపుడు చెరకులో పూత నష్టాన్ని కొంత మేరకు నివారించవచ్చు. అంతేకాక చెరకు రకాల పంట కాల పరిమితిని బట్టి చెరకులో పక్వత దశకు 8 వారాల ముందుగా ” ఇథరిల్” (ఇథపెన్ 2 క్లోరో ఇథైల్ 2 ఫాస్ఫారిక్ ఆమ్లము) రసాయనాన్ని 100 నుండి 150 ppm చెరకుపై పిచికారీ చేసినపుడు చెరకులో పూతను నివారించుకోవచ్చు. తద్వారా చెరకులో పుత కారణం వాటిల్లు నష్టాన్ని వివంచుకోవచ్చు. పరిశోధనా ఫలితాలు ప్రకారము ” ఇథిఫాన్” పిచికారీ కారణంగా చెరకులో 87 శాతం వరకు చెరకులో పూత తగ్గి, 7.5 శాతం దిగుబడి మరియు 10 శాతం వరకు చక్కెర పెరిగినట్లుగా నమోదుకాబడినది.
చెరకులో పూత మరియు దిగుబడిపై “ఇథిఫాన్” ప్రభావ ప్రయోగం
రకము : కో 62175
పరిశోధనా అంశము | ప్రామాణికం | ఇథిఫాన్ పిచికారీ |
పూత శాతం | 81.90 | 23.90 |
ఒక్క గడ బరువు (కిలో) | 0.90 | 1.15 |
చెరకు రసం బ్రిక్స్ (చక్కెర శాతం) | 18.6 | 19.80 |
రస శుద్ధత | 91.76 | 92.07 |