నత్త అనేది గ్యాస్ట్రోపొడ తరగతికి చెందిన మొలస్కా జీవి దీని శరీరం మెత్తగా ఒక కవచం లాంటి షీల్ (కర్పరం) కలిగి ఉంటుంది. ఇవి తడిగా మరియు చిత్తడి నేలల్లో ఎక్కువగా ఉంటాయి. పగటి వేళల్లో రాళ్ళ కింద ఉండి, రాత్రి సమయాలలో మొలకలు భూగర్భ దుంపలు (ఆలు) ఆకులు మరియు పండ్ల పంటలను దెబ్బతీస్తాయి. మొక్కల మొలకల దశలలో అధిక నష్టాన్ని కనపరుస్తాయి అంతేకాకుండా తెగుళ్ళుగా మరియు వ్యాధుల వాహకాలుగా పనిచేస్తాయి.
నత్తలు నష్టపరచే విధానం :
నత్తలు పెద్ద సంఖ్యలో వృద్ధి చెంది పంటలలో నష్టాన్ని కనపరుస్తాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన బంగాళదుంప, టమాటా, తమలపాకు మరియు ఇతర పంటలను ఆశిస్తాయి. ఆకులలో పెద్ద రంధ్రాలను చేసి, కాండం, పువ్వులు దుంపల్లో ఉన్న పదార్థాలను తినేసి మొక్క యొక్క మరణానికి దారి తీస్తాయి.
యాజమాన్య పద్ధతులు :
మొక్కల మొదళల్లో గరుకుగా ఉన్న పదార్థాలైన పొగాకు పొడి వేప చెక్క పిండి వేరుశెనగ పొట్టు వంటి పదార్థాలను చల్లుకోవడం వల్ల నత్తలు పైకి పాకకుండా చేయవచ్చు.
ఎర పద్ధతి :
- పులిసిన ద్రావణాలైన ఈస్ట్, తాటికల్లు, వెనిగర్ ద్రావణాలు మరియు పంచదారలో కలిపి ఈ ద్రావణాన్ని ప్రమిదలలో పోసి నేల మట్టానికి సమాంతరంగా అంచుల్లో పెట్టాలి. ఆ ద్రావణానికి ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి.
- నత్తలు ఎక్కువగా బొప్పాయి మొక్కలను ఇష్టపడతాయి. వాటి పౌడర్ మొక్కల మొదళ్ళ దగ్గర చల్లుకోవాలి.
- తడి గోనె సంచులను అక్కడక్కడ కప్పి ఉంచాలి. అలా ఉంచడం వల్ల అవి ఆకర్షింపబడి ఒకే దగ్గరకి చేరుతాయి. ఆ తరువాత నత్తలు ఏరి బకెట్‌లో ఉప్పు ద్రావణంలో వేసి చంపివేయాలి.
- మార్కెట్లో దొరికే ంఅaఱశ్రీ సఱశ్రీశ్రీ 4% మెటాల్డీహైడ్ విషపు ఎర, పొలంలో అక్కడక్కడ ఉంచడం వల్ల ఆకర్షింపబడి తిని చనిపోతాయి.
- రాగి సంబంధిత రకాలైన బోర్డోపేస్ట్ 1 కి. కాపర్ సల్ఫేట్ 1 కి. సున్నం 100 లీటర్ల నీటిలో కలిపి మొలకల పిచికారి చేయడం వలన నత్తల బారి నుండి కాపాడుకోవచ్చు.
- మొక్కల మొదళ్ల దగ్గర రాగి తీగలను ఉంచడం వలన అవి కరెంట్ షాక్ తగినట్లు పనిచేసి చంపుతాయి.
- బేయర్ కంపెనీకి చెందిన మెసురోల్ 0.3 గ్రా. / లీటరు నీటికి పిచికారీ చేయాలి.
డా.వేణుగాపాల్, డా. వరాల కృష్ణవేణి,
ఎవియన్ లావణ్య, షహనాజ్, ఎ. మమత,
కొండాలక్ష్మణ్ తెలంగాణ యూనివర్సిటీ, హైదరాబాద్.