Rudraksha Plant: శివుడికి ఎక్కువ ఇష్టమైన రుద్రాక్ష మన ఇంటికి ప్రదేశంలో కూడా పెంచుకోవచ్చు అని మీకు తెలుసా..? రుద్రాక్ష చెట్టు మనకి తెలిసి ఎక్కువగా చల్లగా ఉండే ప్రదేశంలో పెరుగుతుంది. రుద్రాక్ష చెట్లు నేపాల్, థాయిలాండ్, హిమాలయాల్లో పెరుగుతాయి. ఎక్కువగా వేడి లేదా ఎండ ప్రాతలో పెరగవు అనుకున్న వాళ్ళు ఇప్పుడు రుద్రాక్ష తోటలు పండిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో , న్యాలకొండపల్లి గ్రామంలో ఆకుల లక్షయ గారు ఈ రుద్రాక్ష తోటని పెంచుతున్నారు.
ఈ రుద్రాక్ష చెట్టుని నెట్టుకున్న తర్వాత రెండు సంవత్సరాలో పూత వస్తుంది. కానీ మన దగర ఎక్కువ ఎండా, వేడి ఉండటం వల్ల మొక్క నాటిన తర్వాత 14 సంవత్సరాలకి పూత వచ్చి , రుద్రాక్ష కాయలు రావడం మొదలు అయ్యాయి. ఈ చెట్లని 2009 సంవత్సరంలో నాటితే, 2022 ఆగష్టు నెల నుంచి రుద్రాక్షలు వస్తున్నాయి.
Also Read: 3 Rows Ridger: మూడు వరుసలు ఉన్న నాగలిని చూశారా…
ఈ రుద్రాక్ష చెట్లని సేంద్రియ పదాధితోనే పెంచుతున్నారు. ఇప్పుడు ఒక చెట్టుకి దాదాపు 1000 రుద్రాక్షలు వస్తాయి. చెట్ల నుంచి ఎక్కువ రుద్రాక్షలు రావడంతో ఈ చెట్ల సంఖ్యని ఈ సంవత్సరం పెంచుతున్నారు.
రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అందరూ నమ్ముతారు. ఈ రుద్రాక్షలు ఒక ముఖం నుంచి 21 ముఖాలుఉంటాయి. ఇక్కడి చెట్లకి ఎక్కువగా మూడు ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఇవి చూడానికి నిమ్మకాయల ఉంటాయి. పై భాగం చాలా గట్టిగ ఉంటుంది.
ఈ రుద్రాక్షలు చెట్టు నుంచి తీశాక కొంచం ఎండకా , నువ్వుల నూనెలో వేస్తే ఎరుపు రంగులో మారుతాయి. ఈ చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. రుద్రాక్షలకి మన దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ చెట్లని రైతులు పండించి అమ్ముకోవాలి అనుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
Also Read: Carrot Cultivation: క్యారెట్ పంట ఎలా సాగు చేయాలి..?