Rose Cultivation: హరిత గృహాలలో సాగు చేసేందుకు డచ్ రోజ్ గులాబీ రకం అనువైనది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ , దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్ ,సంగారెడ్డి , మెదక్ జిల్లాల్లో కట్ గులాబీలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
హైబ్రిడ్ టి ,ఫ్లోరిబండ రకాలు కట్ గులాబీ సాగుకు అనుకూలమైనవి .ప్రైవేటు కంపని రకాల లో పాటు ప్రభుత్వ పరిశోదన సంస్థల నుండి విడుదలైన ఆర్క స్వదేశ్ , ఆర్క ఇవారి , ఆర్క సుకన్య, ఆర్కఫ్రైడ్, పూసమేహక్,పూస మేహిత మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి.నాటిన దగ్గర నుంచి 4-5 సం. వరకు మంచి దిగుబడి పొందవచ్చు.
Also Read: గులాబీ మొక్క ఎక్కువగా పూలు పూయాలంటే.. ఇలా చేసి చూడండి
గాలిలో తేమ శాతం అధికంగా ఉండి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు సాగుకు అనుకూలం కావు. తేమ శాతం తక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం . పగటిపూట ఉష్ణోగ్రతలు 15-25 డిగ్రీ సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా ఉండి, 12 గం. కంటే ఎక్కువ వెలుతురూ ఉన్నాట్లైతే ఎగుమతి కి అనువైన గులాబీలు సాగు చేయవచ్చు.ఇందుకు గాను హరిత గృహాల పాలి షీట్ ను శుబ్రంగా ఉంచుకోవాలి. అదే విదంగా వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటె , షేడ్ నెట్ స్క్రీన్ ను వాడాలి. పాలి హౌస్ లో తేమ శాతం తగ్గించేందుకు పాలి హౌస్ పక్కన తెరలను నేల నుండి 60 సె. ఎత్తు నుండి ఉంచాలి. గులాబీ మొగ్గలు బఠాణీ సైజులో ఉన్నపుడు నెట్ కాప్ ను తొడగాలి.
ఇతర దేశాలకు ఎగుమతి చేసే రకాల మొక్కలను , విదేశాల నుండి రైతులు దిగుమతి చేసుకోవాలి . మన దేశం లో ఐతే బెంగళూరు, పూణే నుంచి ఈ రకాలను పొందవచ్చు. రెండు ఆకుపచ్చ ఆకులు కలిగి , 2-3 నెలల వయసు గల మొక్కలను ఎంచుకోవాలి.
Also Read: వేసవిలో గులాబీ మొక్కల సంరక్షణ