ఉద్యానశోభ

Nursery Cultivation in Pro-tray : ప్రోట్రేలలో నర్సరీ సాగు.!

0
Cultivation in Pro-tray
Cultivation in Pro-tray

Nursery Cultivation in Pro-tray:  నాణ్యమైన దిగుబడికి ప్రథమ సోపానం ఆరోగ్యకరమైన నారు. వ్యవసాయ కళాశాల పాలెం నందు నాల్గవ సంవత్సరంలో వ్యవసాయంలో అనుభవ పూర్వకమైన అభ్యాసంలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరంలో 15 మంది విద్యార్థులు, 2021-22 విద్యా సంవత్సరంలో 6 గురు విద్యార్థులు కూరగాయలు, పూల మొక్కల నారు పెంపకంలో శిక్షణ పొంది మంచి లాభాలను అర్జించడం జరిగింది. 2020-21 విద్యా సంవత్సరంలోని విద్యార్థులు ఈ నారు పెంపకం వల్ల రూ. 51,000/-లు స్థూల ఆదాయాన్ని, రూ. 31,000/-లు నికర ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. దీనికి గాను ఈ విద్యార్థులు విశ్వవిద్యాలయం స్థాయిలో ఉత్తమ అవార్డును వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి గారి చేత అందుకోవడం జరిగింది.
అలాగే 2021-22 విద్యా సంవత్సరంలోని విద్యార్థులు కూరగాయల నారు పెంపకం ద్వారా రూ.82,860/-లు స్థూల ఆదాయాన్ని, రూ.51,105/-లు నికర ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది.

Nursery Cultivation in Pro-tray

Nursery Cultivation in Pro-tray

ఈ విధంగా కేవలం విద్యార్థులే కాకుండా యువ రైతులు కూడా స్పూర్తిగా తీసుకొని నారును పెంచి మంచి లాభాలు పొందవచ్చు. నాణ్యమైన నారును రైతులకు అందజేయడానికి విద్యార్థులు పాటించిన నారు పెంపకం విధానాన్ని క్రింద స్థూలంగా వివరించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు కూరగాయల నారును (టమాట, మిరప, వంగ) మరియు బంతి పూల నారును నారు తొట్టెలలో పెంచడం జరిగింది. నారు పెంపకానికి కావాల్సిన ముడి సరుకులైనటువంటి కోకోపీట్‌, వర్మికంపోస్టు, విత్తనాలు, మల్చింగ్‌ షీట్‌, కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 19:19:19 లను ముందుగానే సమకూర్చుకున్నారు.

మొదటగా విత్తనాలు కొనుగోలు చేయడానికి ముందు గ్రామాలలోకి వెళ్లి రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి కూరగాయలు పండిరచే రైతులు ఏ రకం విత్తనం నారు నాటడానికి ఆసక్తి చూపుతున్నారో ఆ రకం విత్తనం ఎంచుకొని నారు పెంచడం జరిగింది. దీనిలో భాగంగా మిరపలో సోనాల్‌, అంకూర్‌ అను రకంను టమాటాలో సాహూ, యూ.ఎస్‌-440 మరియు స్వీకర్‌ – 448 అనే రకాలను, వంకాయలో సిమ్రాన్‌ అనే రకం ను ఎంచుకోవడం జరిగింది. మిరపలో సోనాల్‌ రకంను 324 ట్రేలలో, అంకూరను 40 ట్రేలలో, టమాటాలో సాహూ రకంను 142 ట్రేలలో, యూ.ఎస్‌-440 ను 44 ట్రేలలో, స్వీకర్‌-448 రకంను 65 ట్రేలలో, వంకాయలో సిమ్రాన్‌ రకంను 50 ట్రేలలో వేసారు. ఒక్కొక్క ప్రోట్రేలలో 98 గడులు ఉంటాయి. ప్రతి ప్రోట్రే క్రింద భాగంలో ఒక గడికి రెండు రంధ్రాల చొప్పున ఉంటాయి. ఈ ట్రేలను జాగ్రత్తగా వాడుకుంటే 4 నుండి 5 సార్లు వినియోగించుకోవచ్చు. ప్రతి సారి ప్రోట్రేను వాడుకునే ముందు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేసుకోవాలి. ఒక్క ప్రోట్రే ధర రూ.18/-లు ఉంటుంది.విత్తనాలను ట్రేలలో విత్తడానికి ముందు అనువైనటువంటి కోకోపీట్‌ మిశ్రమాన్ని తయారు చేసుకున్నారు. దీనికి గాను కోకోపీటను 6-7 గంటలు నీటిలో నానబెట్టి తర్వాత సమపాళ్ళలో దానికి వర్మికంపోస్టును కలిపి ట్రేలలో 3/4వ వంతు నింపుకున్నారు. ఈ ట్రేలలో ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనం గుంత మధ్య భాగంలో విత్తకోవడం జరిగింది. దానిపై మిగిలిన 1/4 వంతు భాగాన్ని మరల ఈ మిశ్రమంతో కప్పి వేయడం జరిగింది. విత్తనాలు విత్తిన ట్రేలను పది చొప్పున ఒకదానిపై మరొకటి పేర్చిన తరువాత వాటిపై గాలి చొరబడకుండ పాలిథిన్‌ షీలో పూర్తిగా కప్పుకోవడం జరిగింది. విత్తనాలు మొలకెత్తడం ప్రారంభించగానే ఈ ట్రేలను వరుసగా మల్చింగ్‌ షీట్లపై షెడ్సెట్లలో పరుచుకోవాలి.

Cultivation in Pro-tray

Cultivation in Pro-tray

నీటి, ఎరువుల యాజమాన్యం : ప్రతి రోజు ప్రోట్రేలను క్షుణ్ణంగా పరిశీలించి తేమకు అనుగుణంగా ఒకటి లేదా రెండు సార్లు (ఉదయం, సాయంత్రం) రోజ్‌ క్యా తో నీటిని అందించారు. మొక్క ఎదుగుదలను బట్టి 19:19:19ను 2 గ్రా./ లీటరు నీటిలో కలుపుకొని మొక్కలకు అందించడం జరిగింది.

సస్యరక్షణ యాజమాన్యం :ప్రోట్రేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నారుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. కావున దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. / లీ. నీటికి కలుపుకున్న ద్రావణంతో మొక్క వేరు వ్యవస్థ మరియు కోకోపీట్‌ మిశ్రమం తడిచేలా నాటిన 9వ రోజు మరియు 12వ రోజు మొలకల మొదలు దగ్గర పోసారు.
మొక్క పెరుగుదల దశలో పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులపై వంకర టింకరగా రంధ్రాలు చేసి పూర్తిగా తినివేసే అవకాశం ఉంది. దీని నివారణకు కార్బొప్యూరాన్‌ గుళికలను ఇసుకలో కలుపుకొని సాయంత్రం వేళ సుమారుగా ఒక్కొ గుంతలో ఒక్కొక్క గుళిక చొప్పున పడేలాగా చల్లుకున్నారు.
ఈ విధంగా పెంచిన నారును ఎ.ఇ.ఎల్‌.పి విద్యార్థిని విద్యార్థులు టమాటలో 20 రోజులకు, మిరపలో 30 రోజులకు, వంకాయలో 25 రోజులకు రైతులకు అమ్మడం జరిగింది. టమాటా యూ.ఎస్‌-440 రకం ఒక్కొక్క ట్రే ధర రూ.80/-లు స్వీకర్‌-448 ఒక్కొక్క ట్రే ధర రూ.80/-, సాహెరీ ఒక్కొక్క ట్రే ధర రూ.120/ -లు అదే విధంగా మిరపలో సోనాల్‌ రకం ఒక్కొక్క ట్రే ధర రూ.150/-లు, అంకూర్‌-2121 ఒక్కొక్క ట్రే ధర రూ.150/-లు, వంకాయలో సిమ్రాన్‌ ఒక్కొక్క ట్రే ధర రూ.50/-ల చొప్పున అమ్ముకున్నారు.

Also Read: Nursery Management in Jatropha: జట్రోఫా లో నర్సరీ యాజమాన్యం.!

ఆర్ధిక విశ్లేషణ :
ఖర్చులు :
ముడి సరుకులు ధరలు
1. విత్తనాలు
ఎ. మిరప 18,000/`
బి. టమాట 4,900/`
సి. వంకాయ 450/`
మొత్తం ధర 23,350/`
2.వర్మికంపోస్టు 1,150/`
3. కోకోపీట్‌ 4,835/`
4. ఎరువులు 720/`
5. క్రిమిసంహారక మందులు 1,700/`
మొత్తం ఖర్చులు 8,405/` (23,350 G8,405R 31,755)

ఆదాయం :
స్థూల ఆదాయం :
రకం ట్రేల సంఖ్య ధర/ట్రే మొత్తం
1. మిరప
ఎ. సోనాల్‌ 324 150/` 48,600/`
బి. అంకూర్‌`2121 40 150/` 6,000/`
మొత్తం 54,600/`
2. టమాట
ఎ. సాహు 142 120/` 17,040/`
బి. యుఎస్‌`440 44 80/` 3,520/`
సి. స్వీకర్‌`448 65 80/` 5,200/`
మొత్తం 25,760/`
3. వంకాయ
ఎ. సిమ్రాన్‌ 50 50/` 2,500/`

డా. డి.రజని, డా. ఎ. నిర్మల వ్యవసాయ కళాశాల, పాలెం, వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్‌

Also Read: Seed Treatment in Vegetable Nursery: కూరగాయల నారు మాడులలో విత్తన శుద్ధి ఎలా చేయాలి?

Also Watch:

Leave Your Comments

Black Rot in Cotton: పత్తిని ఆశిస్తున్న బాక్టీరియా నల్ల మచ్చ తెగులుయాజమాన్యం.!

Previous article

Percentage of Butter in Milk : పాలలోని వెన్న శాతం ను ఎలా కనుక్కోవాలి.!

Next article

You may also like