Turmeric Cooking Precautions: దుంపలను, కొమ్మలను వేరు చేసి వేర్వేరుగా ఉండకబెట్టాలి. పసుపు ఉడికించే బానాలిలో దుంపలు, కొమ్ములు,మునిగే దాకా నీరు పోసి మంట పెట్టాలి.45-60 నిముషాలకు తెల్లటి నురుగు పొంగు దానితో పాటు పసుపుతో కూడిన మంచి వాసన, పొగలు వస్తాయి.అప్పుడు పసుపు నొక్కితే మెత్తగా ఉంటుంది.ఆ దశలో పసుపు బయటకు తీయాలి. ఉడకడం తక్కువ అయితే కొమ్మ లోపలి భాగంలో తొర్రా ల ఏర్పడుతుంది.సులభంగా విరిగిపోతుంది. ఎక్కువ ఉడికిస్తే ఎండిన తర్వాత కొమ్ము రంగు తగ్గి ఆకారం కోల్పోతుంది. పసుపు ఉడికించడానికి వాడే నీరు శుభ్రం గా ఉండాలి.ఉప్పు నీరు, బురద నీరు వాడరాదు.పేడ కలుపరాదు.
పసుపు ఆరబెట్టడం: సమంగా ఉడికిన పసుపును బానేలనుంచి తీసి బయట చదునైనా, శుభ్రమైన నేల లేదా టార్పాలీన్ లేదా సిమెంట్ గచ్చు పై కుప్పగా పోయాలి.24 గంటల తర్వాత 2-3 ఆగుళల మందం ఉండేటట్లు నేరపాలి.పలచగా నెరిపితే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది. 10-15 రోజుల తర్వాత పసుపు తయారైన కొమ్ములు అన్ని ఒకేలా కనిపిస్తాయి.పసుపును అప్పుడప్పుడు తిరగ బెట్టాలి.మధ్యాహ్నం పూట తిరగబెడితే కొమ్ములన్నీ సమానంగా ఎండుతాయి.
కొమ్మ విరిస్తే కంచు శబ్దం వస్తే బాగా ఎండినట్లు లెక్క.ఆ సమయంలో తేమ 8% ఉంటుంది.
Also Read: Turmeric Crop Cultivation: పసుపు సాగులో సస్యరక్షణ.!

Turmeric Cooking Precautions
ఎండిన పసుపు పచ్చి పసుపు లో సుమారు 20% తుగుతుంది. ఉడికిన పసుపు తడిస్తే పసుపు రంగు కోల్పోయి నారింజ రంగు వస్తుంది.కనుక తడవకుండా చూసుకోవాలి. పసుపు అరెటప్పుడు ఆశించే బూజు తెగులు అప్లటాక్సీన్ విష పదార్ధాలు బూజులు ఆశించినప్పుడు కొమ్ములపైన నల్లని, ఆకు పచ్చని, తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఉడికిన పసుపు త్వరగా ఎండకపోవడం వలన అఫ్లాటాక్సిన్ అనే విష పదార్ధం ఏర్పడుతుంది.దీని నివారణకు వండిన పసుపు అరబెట్టునపుడు క్రిందకు మీదకు త్రిప్పాలి.ఉడికించేటప్పుడు తక్కువ ఎక్కువ ఉడికించరాదు. ఎండ, గాలి తగిలేటట్లు సమతల కళ్లెం పై అరబెట్టాలి.
పాలిషీంగ్: ఎండిన,పసుపు దుంపలు కొమ్ములు గరుకుగా పోలుసులతో చిన్న చిన్న వెర్లతో ఆకర్షణీయంగా ఉండవు. కావున వాటిని మెరుగు పట్టడానికి ఎండిన పసుపు కొమ్ములను గరకు నేలపై రుద్దలి. లేదా సంచులలో మూత వేసి కాళ్లతో రుద్దాలి. ఇరుసు ఎటావాలుగా ఉండే డ్రమ్ము తిప్పితే తిరుగుతుంది.డ్రమ్ము లోపలి భాగం ఇనుప మెష్ అమర్చడం వల్ల ఒకదానికి ఒకటి అమర్చుకొని పసుపు మెరుపు వస్తుంది. ఆఖరి దశలో మెరుగు పెట్టేటప్పుడు దుంపలు, కొమ్ములపై పసుపు పోడిని నీళ్లతో కలిపి చిలకరించితే ఆకర్షణీయంగా ఉంటాయి.
Also Read: Rhizome rot in turmeric: పసుపు పంటలో దుంప కుళ్ళు తెగులు నివారణ చర్యలు