రోగరహిత అంటుకట్టిన చీని, నిమ్మ మొక్కలకు మంచి ఆదరణ లభిస్తుంది. వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని తిరుపతి చీని, నిమ్మ పరిశోధన స్థానంలో నర్సరీల ద్వారా సిద్ధం అవుతున్న రోగరహిత అంటుకట్టిన చీని, నిమ్మ మొక్కలకు ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఉద్యాన విశ్వ విద్యాలయ ఉపకులపతి డాక్టర్ టి. జానకిరామ్ అన్నారు. పరిశోధన స్థానంలోని వివిధ పరిశోధన క్షేత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తల్లి మొక్కల తయారీ విధానాల గురించి తెలుసుకుని శాస్త్రవేత్తల్ని అభినందించారు. పాలీహౌస్ ద్వారా రోగ రహిత చీని అంట్లను రైతులకు, ఉద్యాన శాఖ నర్సరీలు సరఫరా చేస్తున్నట్లు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఉపకులపతికి తెలిపారు.
Leave Your Comments