Snake Gourd Cultivation: సాంప్రదాయ సాగు పద్దతులు రైతులను నిరాశకు గురిచేస్తాయి. దీంతో కాలానికి అనుగుణంగా పంటలను సాగు చేస్తే మంచి లాభాలను చవిచూస్తున్నారు రైతులు. ఆధిక మొత్తంలో తీగజాతి కూరగాయాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. పందిరి సాగు పద్దతిలో పొట్లకాయలు సాగుచేస్తూ మంచి దిగుబడులను పొందుతూ మార్కెట్లో లాభాలను కళ్లజూస్తున్నారు. నిత్యం లాభాలతో సంతృప్తి చెందుతున్నాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాకుండా ఉద్యానశాఖ ద్వారా పందిరి సాగు కి వచ్చే రాయితీలను అందిపుచ్చు కుంటున్నాడు ప్రకాశం జిల్లా కొత్తపాలెంనకు చెందిన రైతులు. సాగు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను ఉపయోగించుకుంటూ నాణ్యమైన కూరగాయలను పండించుకుంటున్నారు.
Also Read: Minister Niranjan Reddy America Visit: మూడవరోజు అమెరికా పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!
పొట్ల సాగులో విత్తన శుద్ధి ముఖ్యం
పొట్ల కాయలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా రైతులు రెండు రకాలను మాత్రమే ఎక్కువగా సాగుచేస్తారు. పొట్లకాయసాగుకు తేమగా ఉండే వాతావరణం, వేడి వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే పొట్లకాయ తీగ పెరుగుదల బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పూత మరియు పిందె బాగా పెరుగుతుంది. పొట్లకాయ సాగులో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఎటువంటి పురుగులు, తెగుళ్లు వ్యాపించకుండా బీజామృతం తో లేదా బీజరక్షతో విత్తన శుద్ధి చేయాలి. వైరస్ తెగులు సోకని మొక్కల నుండి విత్తనాలు సేకరించుకోవాలి. జూన్ జూలై నెలలో విత్తనాలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆతర్వాత వేసవి పంటగా డిసెంబర్ జనవరి నెలలో విత్తడం వల్ల పంటకు అనుకూలంగా ఉంటుంది.సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి లాభాలను రైతులు పొందవచ్చు.
పొట్ట చుట్టూ ప్రహారిగా కాకర
తక్కువ స్ధలంలో తక్కువ పెట్టుబడితో పొట్లసాగు చేస్తూ ఆధిక ఆదాయాన్ని పోందుతున్నారు. తనకున్న 25 సెంట్లలో వెదురు బొంగులతో పందిరి సాగు చేసి ఏడాదికి రెండు పంటలు పొట్ల సాగుచేస్తూ మంచి దిగుబడిని తీస్తున్నారు. అక్కడక్కడ కాకర సాగు చేసి అదనపు ఆదాయాన్ని పోందుతున్నారు. పొట్ల సాగుతో ప్రతిరోజు ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. విత్తనాలను స్వయంగా తామే తయారు చేసుకుంటున్నామని అన్నారు. పొట్లసాగుకు ఎలాంటి రసాయానాలు జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయంలోనే సాగు చేస్తున్నారు. చీడపీడలకు కషాయాలు తయారు చేసి పిచికారి చేస్తున్నారు. దిగుబడులు నాణ్యంగానే వస్తున్నాయని అంటున్నారు. రోజు కాయలను కోసి పొలం దగ్గరే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పొట్ల చుట్టు ప్రహారిగా కాకరను సాగుచేశారు. పొట్ల దిగుబడులతో పాటు కాకర దిగుబడులు రావడంతో అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఉన్న కొద్దిపాటి స్ధలంలోనే రెండు పంటలను వేసి మంచి దిగుబడులను సాధిస్తూ లాభాలను పొందుతున్నారు. ఈ రైతును అందరూ ఆదర్శంగా తీసుకుంటారు.
Also Read: Turmeric Cultivation: పసుపులో అధిక దిగుబడి సాధిస్తే, లక్షల్లో ఆదాయం.!