ఎ. పోశాద్రి, యం. సునీల్ కుమార్, జి. శివ చరణ్, డి. మోహన్ దాస్, కె. రాజశేఖర్, వై. ప్రవీణ్ కుమార్
కృషి విజ్ఞాన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.
నిత్యజీవితంలో రోజు వాడే కూరగాయలలో టమాట ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆహార పదార్థాలలో విరివిగా ఉపయోగించే ముడి సరుకు. మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాట సాగు చేస్తున్నాము తద్వారా సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాట దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నాము ( ఎన్ హెచ్ బి 2021-22 అంచనాల ప్రకారం).. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్థానంలో టమాట ఉంది. మన దేశ కూరగాయల గంప (బాస్కెట్) లో టమాట ఉత్పత్తి శాతం 10.7%. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1266 హెక్టార్లలో టమాటాను సాగు చేస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్ మండలాలలో గిరిజన రైతులు అధిక మొత్తంలో టమాటాను వాన కాలము మరియు నీటి లభ్యత ఉన్నచోట యాసంగి లో టమాట సాగు చేస్తున్నారు. సుమారు 56952 మెట్రిక్ టన్నుల టమాటాలు జిల్లాలో ఉత్పత్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని రైతులకు పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట నిల్వ చేసుకునే పద్ధతులు, రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శీతల గిడ్డంగులు యొక్క ఉపయోగం గురించి వారికి అవగాహన లేదు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ శాస్త్రవేత్తలు ముఖ్యంగా పంట యజమాన్య పద్ధతులతో పాటు, పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు, మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు టమాట నుండి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే విధానాలను క్షేత్ర ప్రదర్శన మరియు ప్రథమ శ్రేణి ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు మరియు శిక్షణ కార్యక్రమాలను గిరిజన ఉప ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.
రైతులు పంట కోసిన తర్వాత టమాటాలను 25 కిలోల క్రేట్ (crate) ఒక యూనిట్ గా అమ్ముతారు. ఈ సంవత్సరం టమాట వినియోగదారులకు ఎంతో ఎన్నో ఇబ్బందులకు గురి చేసినది. మనం నిత్యం వండుకునే కూరలలో ముఖ్యంగా జూన్ చివరి వారం మొదలుకొని జులై, ఆగస్ట్ మాసాలలో కిలో టమాటలను సామాన్యులు కొనుక్కునే పరిస్థితి లేక పోయింది. మరికొన్ని కుటుంబాలు వివిధ హోటల్లు, రెస్టారెంట్స్ వివిధ ఆహార పరిశ్రమలు టమాట వాడకాన్ని నెల రోజులపాటు తగ్గించుకోవడం జరిగినది. కిలో టమాట 150 – 200 రూపాయల వరకు చేరినది. 25 కిలోల క్రేట్ ధర సుమారు ₹3000-4000 పలికినది. గత సంవత్సరాల మార్కెట్ ధరలు పరిశీలించినట్లయితే ఆగస్టు నుండి డిసెంబర్ మాసాల మధ్య సుమారు ఒక క్రియేట్ ధర 350 నుండి 1200 రూపాయల రేటు పలుకుతుంది. కొన్నిసార్లు ఒక నెల లోని వివిధ వారాల మధ్య ధర వ్యత్యాసం సుమారు రెండు వందల నుంచి 700 వరకు ఉంటుంది. ధరల వ్యత్యాసాల వల్ల రైతులు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటా క్రేట్ ధర వ్యత్యాసాలను అధిగమించాలంటే వారం వ్యవధిలో టమాటాలను శీతల గిడ్డంగుల్లో దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మారుమూల గిరిజన ప్రాంతాలలో కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వలన రైతులు ఎంతోగానో నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించి గిరిజన ఉప ప్రణాళిక కింద క్షేత్ర ఈ ప్రదర్శన ద్వారా పర్యావరణ హితమైన ఇంధన రహిత శీతల గది నిర్మాణం, కూరగాయల నిల్వలపై, అంతేకాకుండా ప్రతికూల మార్కెట్ పరిస్థితులు వచ్చిన ఎడల టమాటాల నుండి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతు నష్టపోకుండా బయటపడవచ్చని వివిధ శిక్షణలో మరియు ప్రదర్శన ద్వారా నిరూపించడం తెలియజేయడం జరిగినది.
టమాటాల నుండి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ
టమాటా దిగుబడులు మార్కెట్ ని ముంచెత్తినప్పుడు రేటు పడిపోవడం సర్వసాధారణం, మారుమూల గిరిజన ప్రాంతాలలో రైతులు నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడం, పంట కోత అనంతరం సరైన చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో పంట నుండి ఎటువంటి లాభం పొందిన అటువంటి పరిస్థితులలో ఆదివాసీ గిరిజన మహిళా రైతులకు, గిరిజన యువకులకు గిరిజన ఉప ప్రణాళిక కింద ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా టమాట పంటకు విలువ జోడించడం, వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు అయినా టమాట పచ్చడి, టమాటో కెచప్ టమాటా సాస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల పైన ప్రత్యక్ష శిక్షణా తరగతులను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ శాస్త్రవేత్తలు నిర్వహించారు.
టమాట పచ్చడి తయారీ: టమాటా పచ్చడి తయారీ కోసం బాగా పండిన టమాటాలు ఎంచుకొని వాటిని క్లోరినేటెడ్ నీటిలో శుభ్రంగా కడిగి పొడిబట్టతో తేమ లేకుండా తుడవాలి. తరువాత టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి ఉప్పు కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచడం ద్వారా టమాట ముక్కలు నుండి జ్యూస్ అంతా బయటకు వస్తుంది. తరువాత ముక్కలను మరియు జ్యూస్ ను వేరు చేయాలి. ముక్కలను సోలార్ డ్రాయర్ లో మూడు రోజుల పాటు ఆరబెట్టాలి. వేరు చేసిన టమాటా జ్యూస్ కు చింతపండు కలిపి నానబెట్టాలి. సోలార్ డ్రైవర్ లో ఎండిన టమాటా ముక్కల్ని, టమోటా జ్యూస్ లో నానబెట్టిన చింతపండు నుండి చింతపండు గుజ్జు తీసి కలపాలి. బాగా కలిపిన తరువాత కారంపూడి, ఆవాల పొడి, మెంతుల పొడి, పొట్టుతీసిన వెల్లుల్లిపాయ లను కలపాలి. మరో బాణీలో నూనె వేడి చేసి తాలింపు గింజల ను వేయించాలి. చల్లారిన తాలింపు గింజలు మరియు నూనెను పచ్చడి మిశ్రమానికి కలపాలి. బాగా కలిపిన తరువాత సుబ్రమణ్యం గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నింపి సుమారు తొమ్మిది నుండి పది నెలల వరకు నిలువ చేసుకోవచ్చు.
Also read:వానాకాలం (ఖరీఫ్) టమాటా సాగులో మెళకువలు
టమాట పచ్చడి తయారీ కి అయ్యే ఖర్చు వివరాలు
100 కిలోల బ్యాచ్ కి కావలసిన పదార్ధాలు
|
శాతం
|
కిలో ముడి సరుకు ధర (రూ.)**
|
మొత్తం (రూ.)
|
టమాటాలు
|
52.5 | 0.83 | 43.0 |
చింతపండు
|
8.0 | 125 | 1000 |
అయోడైజ్డ్ ఉప్పు
|
12.2 | 10.0 | 122 |
కారప్పొడి
|
5.0 | 100 | 500 |
వంట నూనె
|
12.0 | 180 | 2140 |
ఆవాల పొడి
|
2.4 | 60 | 144 |
మెంతుల పొడి
|
1.9 | 65 | 123.5 |
పొట్టుతీసిన వెల్లుల్లిపాయలు | 6.0 | 120 | 720 |
ఉత్పత్తి వ్యయం (రూ.)
|
4793.0 | ||
**పైన తెలిపిన సరుకుల ధరలలో వ్యత్యాసం ఉండే అవకాశం కూడా ఉంది |
టమాట పచ్చడి తయారీ తాలింపుకు కావలసిన పదార్థాలు
కావలసిన పదార్ధాలు
|
పరిమాణము | ముడి సరుకు ధర (రూ.)
|
ఎండిన ఎర్రటి మిరపకాయలు | 300.0 | 25.0 |
శనగపప్పు | 250.0 | 20.0 |
ఆవాలు | 250.0 | 15.0 |
జిలకర | 200.0 | 50.0 |
కరివేపాకు | 500.0 | 15.0 |
ఉత్పత్తి వ్యయం (రూ.) | 125.0 |
100 కిలోల పచ్చడి తయారీకి అవసరమయ్యే ముడిసరకు ఖర్చు రూపాయలు
వివరాలు
|
ఉత్పత్తి వ్యయం (రూ.)
|
100 కిలోల ముడిపదార్థాల మొత్తం ఖర్చు | 4793.0 |
కూలీల ఖర్చు. (ఒక్కొక్కరికి 150 రూపాయలు రోజుకి) X 2 రోజులు | 300.0 |
ప్యాకింగ్ ఖర్చు ( 200 ప్లాస్టిక్ కంటైనర్) | 240.0 |
మొత్తం ఉత్పత్తి ఖర్చు (రూ.) | 5333.00 |
పచ్చడి అమ్మక మరియు లాభాల వివరాలు
వివరాలు | అమ్మకపు ఖర్చు (రూ.)
|
పచ్చడి కంటైనర్ల మొత్తం (500 గ్రా. పరిమాణము) | 85.0 |
అమ్మకపు ధర (రూ.)
( కనీస అమ్మకం ధర)/ 500 గ్రా |
120 |
మొత్తం అమ్మకపు విలువ (రూ. | 10200 |
మొత్తం ఉత్పత్తి ఖర్చు (రూ.) | 5333 |
నికర లాభం (రూ.) | 4867 |
ఖర్చు: ఆదాయం నిష్పత్తి ( సుమారు యాభై కిలోల టమాటా కు) | 1:1.9 |
అంతేకాకుండా గత మూడు సంవత్సరాల్లో చూసినట్లయితే అక్టోబర్ నుండి మార్చి వరకు టమాట ధరలు మార్కెట్లో బాగా పడిపోతున్నాయి. ముఖ్యంగా మహిళా రైతులు ఫిబ్రవరి మాసంలో టమాటాల నుండి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అధిక లాభాలను పొందవచ్చు. 200 కిలోల టమాటా పచ్చడి ద్వారా సుమారు 12 వేల పైన ఆదాయాన్ని పొందవచ్చు. ఇది ముఖ్యంగా గిరిజన రైతుల జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుంది.