Ivy Gourd Profits: తీగజాతి కాయకూర గాయల్లో దొండకు కూరగాయల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దొండకాయకు మార్కెట్లో మంచి లభిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ నిలకడైన ఆదాయాన్ని ఏడాది పొడవునా పొందుతున్నారు. శాశ్వత పందిర నిర్మాణానికి ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి దొండ సాగు చేస్తూ అధిక లాభాలను పొందవచ్చు. పందిరి సాగుకు మొదట ఖర్చు ఎక్కువే అయినా శాశ్వత పందిరి ద్వారా దిగుబడులు పెరిగి మంచి దిగుబడితో పాటు ఆదాయం పొందవచ్చని ఆదాయాన్ని ఇస్తు న్నాయని రైతులు అంటున్నారు. దొండ సాగుకు నీరు నిలవని అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. దొండ సాగుకు వివిధ దశల్లో అనేక రకాల వ్యాధులు, పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నందున తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు.
ఇతర కూరగాయల సాగు కంటే ఇది భిన్నంగా ఉంటుంది. దొండ తీగలను ముక్కలుగా కోసి నేలలో నాటితే వాటికి వేళ్లు వచ్చి మొక్కలుగా ఎదుగుతాయి. ఎకరాకు 900 వరకు మొక్కలు నాట వచ్చు. పొలంలో స్తంభాలు, కర్రల ఆధారంగా ప్లాస్టిక్ లేదా ఇనుప తీగల ద్వారా పందిళ్లు ఏర్పాటు చేస్తారు. నాటిన 30 రోజుల నుంచే కాయలు వచ్చినా పూర్తిగా దిగుబడి వచ్చేందుకు సుమారు 90 రోజులు వరకు పడుతుంది. పాదులకు ఎరువులు, నీరు అందిస్తే ఏడాది పొడవునా దిగుబడి ఉంటుంది.
Also Read: Capsicum Cultivation in Polyhouse: పాలీహౌస్ లో క్యాప్సికం సాగు – లాభాలు బాగు

Ivy Gourd Profits
దొండ సాగులో కూలీలతో పెద్దగా పని ఉండదు. రైతు దంపతులు, కుటుంబసభ్యులకు రోజూ పని లభించడంతోపాటు నికర ఆదాయాన్ని పొందవచ్చు. పందిరి సాగుకు మొదట ఖర్చు ఎకువే అయినా శాశ్వత పందిరి ద్వారా మంచి దిగుబడితోపాటు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి ఎకరాకు 60 టన్నుల దిగుబడిని తీస్తున్నారు రైతులు. మార్కెట్‌లో సరాసరి కిలో రూ.7కు అమ్మినా, ఎకరా పంటకు సుమారు రూ.4.20 లక్షల ఆదాయం వస్తుంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ.3 లక్షలు పోయినా, రూ.1,20,000 నికర ఆదాయం పొందుతున్నారు. ఇక రెండు, మూడో ఏడాది నుంచి పెద్దగా పెట్టుబడులు ఉండవు కాబట్టి, వచ్చేదంతా నికరంగా లాభమే.
దొండ సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు మంచి పంట యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొక్క విత్తుట మొదలు పంట కోసే వరకు జాగ్రత్తలు పాటించాలి. దొండ సాగు చేసే ప్రాంతంలో 25-30 డిగ్రీ సెంటీగ్రేడ్ ల మధ్య ఉష్ణోగ్రత ఉంటే దొండ పెరుగుదల బాగుంటుంది. అలాగే పూత, పిందె బాగా వస్తుంది. దొండసాగుకు మామూలుగా వారానికి ఒకసారి తడి పెడితే సారిపోతుంది. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిలవ ఉంచకూడదు. అలా చేస్తే.. మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు.ఇక వేసవిలో నాలుగైదు రోజులకు ఒకసారి తగి వేసుకుంటే సరిపోతుంది.
దొండను తెగుళ్ళు పరుగులు ఆశిస్తుంటాయి. వాటికి సరైన సమయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోకపోతే పంటకు నష్టం వాటిళ్లుతుంది. దాంతో దిగుబడి తగ్గిపోతుంది. కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం గంధకం సంబంధిత పురుగు, తెగుళ్ళ మందులను అసలే వాడకూడదు. ఒకవేళా వాడినట్లయితే ఆకులు మాడిపోతాయి. అందుకే దొండను సాగు చేసే రైతులు సస్యరక్షణకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి దిగుబడులను సాధిస్తారు.
Also Read: Bicycle Weeder: రైతు వినూత్న ప్రయత్నం.. పాత సైకిల్ తో కలుపు తీసే గుంటుక యంత్రం.!