ఉద్యానశోభ

Custard Apple Farming: సీతాఫలాలు పండిస్తూ లక్షల్లో ఆదాయం.!

2
Custard Apple Farming
Custard Apple Farming

Custard Apple Farming: రుచిలో మధురం. ఆకారంలో ఆకర్షనీయమైన నోరూరించే ఆ ఫలాన్ని ఆస్వాదించాలంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే. అది శీతాకాలంలో తెలిసిందా. మన దేని గురించి మాట్లాడుకుంటున్నామో తెలిసిందా అదే సీతాఫలం. అధిక చక్కెర శాతం ఉన్న సీతాఫలం అంటే ఎందరికో మమకారం. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు..అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది.

అడవిలో మాత్రమే దొరికే ఈసీతాఫలాలు ఇప్పుడుప్పుడే మార్కెట్లకు చేరుకుంటున్నాయి. రైతులు రేటును బట్టి పంటను పెంచుతున్నారు. ఆంధ్ర, తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రమే తోటలు విస్తరించి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగిన అవగాహన లేని కారణంగా సాగును విస్తరింప జేయలేక పోతున్నారు. అన్ని రకాల నేలల్లో పెరిగి వర్షాధారంగా కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఈ పంట రైతులకు కాసులను కురిపిస్తోంది..

Also Read:  ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు – మంత్రి

Custard Apple Farming

Custard Apples

ఒక్కప్పుడు కొండలు, గుట్టల మీద విరివిరిగా కనిపించే ఈ పండుకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో రైతులు వాణిజ్య సరళిలో కూడా ఈసాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. వ్యవసాయానికి హద్దులు లేవని నిరూపిస్తూ సీతాఫలాలను పండిస్తూ లక్షలలో ఆదాయాన్ని చవిచూస్తున్నారు. ఈ తోటలకు వర్షాలు లేకపోయినా సరే పండించవచ్చు. డ్రిప్ ను ఏర్పాటు చేసుకుంటే చాలు. మంచి దిగుబడులను సాధించవచ్చు. సీతాఫలం పండు ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతుంది. చెట్లు ఎక్కువగా గుట్ట ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. కేవలం చలికాలంలో మాత్రమే ఈ పండ్లు వస్తాయి. అయితే సీతాఫలం పంట సాగు చేసే రైతులు చాలా తక్కువగా ఉండడంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.

సీతాఫలం చెట్లులో రెండు కొత్త రకాలు ఉన్నాయి. రకాలని గ్రాఫ్టింగ్ ద్వారా తయారు చేశారు. ఒక రకాన్ని బాలానగర్ మరో రకాన్ని సూపర్ గోల్డ్ అనే పేర్లతో పిలుస్తారు. బాలానగర్ సీతాఫలం చెట్ల ఆకులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ రకం నాటి రెండు సంవత్సరాల తర్వాత మనకు దిగుబడి వస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కోతకు వస్తాయి. సూపర్ గోల్డ్ రకానికి చెందిన సీతాఫలం చెట్లను కూడా గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేస్తారు. ఈ మొక్కలు ముందుగా నర్సరీ ఆరు నెలలు పెంచి తర్వాత రైతులకు ఇస్తారు. వీటిని రెగ్యులర్ గా ట్యూనింగ్ చేయాలి. ఎండాకాలంలో ఈ మొక్కల ఆకులు పూర్తిగా రాలిపోతాయి. జూన్ నెలలో తొలకరి చినుకులు కురిసిన తర్వాత మళ్లీ ఆకులు చిగురించి పూతకు రావడం ప్రారంభమవుతుంది. ఈచెట్లకు కేవలం నాలుగు నెలల పాటు నీళ్లు ఎరువులు అందిస్తే చాలు మంచి దిగుబడిని అందిస్తాయి.

Also Read: అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల కోసం కొత్తరకం విస్తరణ విధానాలు.!

Leave Your Comments

Minister Niranjan Reddy: ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు – మంత్రి

Previous article

Chilli Seedlings: మిర్చి నారు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Next article

You may also like