Tomato Crop Cultivation: నిత్యవసర సరుకులలో ఒక్కటి అయినా టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు వల్లన పంట రాలిపోయి, దిగుబడులు రాక వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మార్కెటుకు సరుకు తక్కువ రావడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వినియోగదారులు టమాటాలను కొన్నాలి అంటేనే భయపడే పరిస్ధితి ఏర్పడింది..
మదనపల్లె మార్కెటుకు సరుకు తక్కువ రావడం
ఆంద్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో మరియు తమిళనాడులోని మరికొన్ని జిల్లాలలో టమాటా పంటకు తెగులు సోకడంతో పంటలు నష్టపోయి మార్కెట్లో టమాటాకు తీవ్ర కొరత ఏర్పడింది. చిత్తూరుజిల్లా మదనపల్లె మార్కెట్ కి తక్కువ సరుకు రావడం జరిగింది.. ఆకాల వర్షాలు వల్లన పంట దిగుబడి తగ్గిపోయింది.. సరాఫరా తగ్గడంతో మార్కెట్లో ఉన్న టమాటా ధర ఒకేసారి పెరిగిపోయింది.. నేషనల్ హర్టీకల్చల్ బోర్డు ప్రకారం 2021-2022లో దేశంలోనే టమాటా సాగు ఆంధ్రప్రదేశ్ లో రెండువ స్ధానంలో ఉంది..ప్రస్తుతం పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు..మార్కెట్ లో టమాటా ధరలు ఒడిదుడుకుల మద్య ప్రభుత్వాలు కల్పించుకోవాలని కోరారు.
నారు పోసుకోవడం ఉత్తమం.
Also Read: Telangana Farmers: తెలంగాణా రైతులకు శుభవార్త
టమాటాలో మంచి దిగుబడులు సాధించాలి అంటే మార్చి చివరి వారంలో నారు పోసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు కాపు రావడం మొదలవుతుంది. అప్పుడు మనకు మంచి రేటు దక్కుతుంది.. అలాగే ఎండాకాలంలో పంట రావాలంటే డిసెంబర్ లో గాని, జనవరిలోని నారు పోసుకుంటే ఏప్రిల్ కి కాపు రావడం మొదలవుతుంది.. అప్పుడు మార్కెటుకు తీసుకొని వెళ్లితే మంచి లాభాలు వస్తాయి. అసలు ఆ కాలాలలో టమాట పంటను ఎవరు వేయరు.. ఎందుకంటే వర్షాలకు టమాట పంట పాడవుతుందని అపోహ ఉంది.. అందుకే వర్షాకాలంలో టమాట వేయకుండా వేరే పంటలకు వెళ్తారు.. అయితే వర్షాకాలంలో టమాటా పంట వేయాలంటే స్కేటింగ్ పద్దతిలో వేయాలి.
ఈపద్దతిని మనం పాటించినట్లతే ఏకాలంలో అయినా దిగుబడులను తీయవచ్చు. ఎండాకాలంలో కూడా ఆధిక ఉష్టోగ్రతలు వల్లన మనం పంటను ఎక్కువ తీయలేము.
మనం టమాటా పంటను కాలాలకు అనుగుణంగా వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.. అందుకే మనం ఏపంట వేసిన ఆలోచించి వేయాలి. వర్షం పడింది కదా విత్తనం వేస్తే నష్టపోక తప్పదు.
Also Read: Drum Seeder Machines: రాయితీపై డ్రం సీడర్ యంత్రాలు